యువ

చైతన్యమే... ఊపిరిగా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహసం చాటుకోడానికో, వ్యక్తిగత ప్రచారానికో కాదు.. సామాజిక చైతన్యం కోసం ఆ ఇద్దరూ సైకిల్‌యాత్రకు శ్రీకారం చుట్టారు. చిన్నతనం నుంచి సైకిల్ యాత్రలు చేసే అలవాటు ఉన్నా, ఈసారి మాత్రం వారు ఓ లక్ష్యసాధనతో ముందుకు దూసుకుపోతున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల మీదుగా 4,400 కిలోమీటర్ల మేరకు సైకిల్ యాత్ర చేయాలని ప్రిసీలియా మదన్ (22), సుమీత్ పరింగె (26) కన్యాకుమారిలో బయలుదేరి హైదరాబాద్‌కు వచ్చి.. తమ అంతరంగాల్ని ఆవిష్కరించారు. చిన్ననాటి స్నేహితులైన ఈ ఇద్దరూ తమ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 70 రోజుల పాటు క్లిష్టతరంగా సాగే సైకిల్‌యాత్రను ప్రారంభించారు. బాలికా విద్యపై సమాజంలో అవగాహన పెంచేందుకు తాము ఊరూరా ప్రచారం చేస్తున్నామని ప్రిసీలియా, సుమీత్ తెలిపారు. విద్యారంగంలో బాలికలు సత్తాచాటుకునేలా తగినన్ని అవకాశాలను కల్పించాలని, ఈ విషయంలో సమాజం వైఖరి ఇంకా మారాల్సి ఉందని ప్రిసీలియా అంటున్నారు. ఆడపిల్లలను చదివిస్తే సమాజం మొత్తం అభివృద్ధి సాధిస్తుందన్న విషయాన్ని గ్రామీణ ప్రాంతాల వారికి వివరిస్తున్నామని ఆమె చెప్పారు. విభిన్నంగా కనిపించే తమ సైకిళ్లను వీక్షించేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపుతున్నారని ప్రిసీలియా తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడినపుడు భాషాపరంగా ఇబ్బంది కలిగినా తాము నిరుత్సాహ పడలేదని ఆమె చెప్పారు. సైకిల్ యాత్రలో ప్రిసీలియా, సుమీత్ రోజుకు 10 నుంచి 12 గంటల సేపు ప్రయాణిస్తుంటారు. 57 ఏళ్ల వయసులోనూ వివిధ దేశాలను సైకిల్‌పై సందర్శించే ప్రిసీలియా తండ్రి ఈ మిత్రద్వయానికి స్ఫూర్తిదాతగా నిలిచారు. సైకిల్ యాత్రలో కొన్ని మధురానుభూతులతో పాటు అక్కడక్కడా చేదు అనుభవాలు కూడా ఎదురైనట్టు సుమీత్ గుర్తుచేస్తున్నారు. తాము ముంబయిలో ఉండగా భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం కావడం చూశామని, కొన్నిచోట్ల తీవ్రమైన వడగాలుల ప్రభావాన్ని ఎదుర్కొన్నామని వివరించారు. జాతీయ రహదారులపై సైక్లిస్టులు సులువుగా ప్రయాణించే పరిస్థితులు లేవని, మిగతా వాహనచోదకులు సైకిళ్లకు దారి ఇవ్వాలన్న విషయాన్ని అస్సలు పట్టించుకోరని ఆయన అంటున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, పర్వత ప్రాంతాల్లో సైతం నిరాటంకంగా సైకిల్ యాత్ర చేయాలన్నదే తమ అభిమతమన్నారు. పరిచయం లేని ప్రాంతాల్లో రోజుల తరబడి సైకిల్ యాత్ర చేయడం ప్రమాదకరమని తెలిసినా మంచి లక్ష్యంతో తాము ముందుకు సాగిపోతున్నామని ప్రిసీలియా అంటున్నారు.

chitram.. బాలికా విద్య ప్రచారం కోసం సైకిల్ యాత్ర చేపట్టిన మదన్, సుమీత్