యువ

‘రాత’ మార్చే నోట్ బుక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుస్తకంపై రాస్తే... ఇట్టే డిజిటైజ్ అయిపోతుంది
పెన్నుతో రాయడం ఓల్డ్ ట్రెండ్. కంప్యూటర్ ఎదుట కూర్చుని కీబోర్డుపై టైప్ చేయడం న్యూ ట్రెండ్. కానీ, కంప్యూటర్ అందుబాట్లో లేనప్పుడు, కాయితం మీద రాయకతప్పదు. కానీ ఆ కాయితాన్ని ఎవరికీ ‘షేర్’ చేయలేం. కంప్యూటర్‌లోకి ‘అప్‌లోడ్’ అసలే చేయలేం. ఎలా మరి?
జర్మనీకి చెందిన ‘మాంట్‌బ్లాంక్’ కంపెనీ దీనికో పరిష్కారం కనిపెట్టింది. స్టార్‌వాకర్ పెన్‌ను, దానికి అనుబంధంగా బ్లాక్ ఇటాలియన్ లెదర్ నోట్‌బుక్‌నూ గత వారమే మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ నోట్‌బుక్‌మీద స్టార్‌వాకర్ పెన్నుతో రాస్తే చెరగదు సరికదా ఎంచక్కా డిజిటైజ్ అయిపోతుంది. వంద పేజీల ఈ నోట్‌బుక్‌కు ఎలక్ట్రో మేగ్నటిక్ శక్తి ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే ఎనిమిదిగంటలపాటు ఈ నోట్‌బుక్ పనిచేస్తుంది. రాసిన నోట్స్‌ను మాంట్‌బ్లాంక్ హబ్ యాప్‌కు అప్‌లోడ్ చేసి, దానిని ఎవరికైనా షేర్ చేయొచ్చు లేదా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కనీసం వంద పేజీల వరకూ అప్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇంతకీ ఈ స్మార్ట్ఫోన్, నోట్‌ప్యాడ్ ధర 725 డాలర్లు.