యువ

జయహో... సుమేధ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమేధ గోస్వామి.. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెద్ద సెలబ్రిటీ.
ఎక్కడో వెనుకబడిన జార్ఖండ్‌లో పుట్టి పెరిగిన 27 ఏళ్ళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) విద్యార్థిని అరుదైన గౌరవం పొందింది. సేవారంగంలో సుమేధ చేసిన కృషికిగానూ విలియం జె.క్లింటన్ ఫెలోషిప్ పొందింది. అమెరికా ఇండియా ఫౌండేషన్ అందిస్తున్న ఈ ఫెలోషిప్ అందుకోవడం ఆషామాషీ కాదు. అభివృద్ధి, సేవారంగాల్లో కీలక ప్రాజెక్టులు చేపట్టిన స్వచ్ఛంద సంస్థల (ఎన్‌జివో)తో పనిచేస్తున్న అత్యంత ప్రతిభావంతులైన ప్రొఫెషనల్స్‌నే ఈ ఫెలోషిప్‌కు ఎంపిక చేస్తారు. ప్రపంచం మొత్తంమీద 35మందిని ఎన్నుకుంటే.. వారిలో కేవలం పదిమందికే అవకాశం దక్కుతుంది. లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా.. జల్లెడపట్టి నాలుగు శాతం మందికంటే తక్కువమందినే ఎంపిక చేస్తారు. అలాంటివారి సరసన ఎన్నికైంది సుమేధ గోస్వామి.
ఇంటర్మీడియెట్ పూర్తిచేసి ఏ ఇంజనీరింగో.. మెడిసినో చేసేసి.. కెరియర్ తీర్చిదిద్దుకోవాలని తహతహలాడిపోతున్న నేటి యువతరంలో అరుదైన ఆణిముత్యం సుమేధ గోస్వామి. సాధారణ విద్యార్థుల మాదిరిగా కెరియర్ గురించి ఆలోచించకుండా.. నిస్వార్థంగా.. సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఆలోచించే ధోరణే సుమేధకు అరుదైన పురస్కారాన్ని అందించింది. యువతరంలో కెరియరిస్ట్‌లు పెరిగిపోయారన్న మాట నిజం. సమాజానికి మనం ఏం చేద్దాం అన్న ఆలోచనతో, దేశం, అభివృద్ధి, సేవారంగం విషయంలో ఆలోచించే వారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో సుమేధ గోస్వామి వైవిధ్యంతో కూడిన ఆలోచన చేసింది. సేవారంగాన్ని ఎన్నుకుంది. మొదట మెడిసిన్ చేయాలనుకుంది. సమాజంలో ఎందరికో సేవ చేసే అరుదైన అవకాశం లభిస్తుంది. కానీ మెడిసిన్‌లో చేరడం సాధ్యం కాలేదు. సేవారంగంవైపు వెళ్లాలంటే.. భాష, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అని గుర్తించి తన ప్రతిభను ఇనుమడింపజేసుకునేందుకు ఇంగ్లీష్ ఆనర్స్ కోర్సులను, కమ్యూనికేషన్ స్టడీస్ వైపు దృష్టి పెట్టింది. తర్వాత ముంబైకి చెందిన సలాం బాంబే ఫౌండేషన్‌తో కలిసి కార్యరంగంలోకి దూకింది.
దేశంలో మహానగరాల్లో మురికివాడల్లోనే ఎక్కువమంది బతుకుతున్నారు. అలాంటి మురికివాడల్లో అభివృద్ధి పనులు జరగాలంటే.. అక్కడి యువతలో చైతన్యం తీసుకురావాలి.. సమస్యలను చెప్పి, ఆ సమస్యలను పరిష్కరించేలా అధికార యంత్రాంగంలో కదలిక తీసుకురావాలి. అందుకే మురికివాడల్లో యువతకు వీడియో, ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో నిమగ్నమైంది. మురికివాడల్లో విభిన్న సంస్కృతులకు చెందిన జనంతో మమేకమైంది. జనం స్థితిగతులు, సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం తెలిపే వీడియోలు, ఫిల్మ్‌లను అక్కడి యువకులే రూపొందించడంలో శిక్షణ ఇచ్చింది. వైవిధ్యంతో కూడిన సుమేధ చేసిన ఆలోచన, అభివృద్ధి పట్ల యువతలో తీసుకువస్తున్న చైతన్యం, సమాజానికి చేస్తున్న సేవకు తగిన గుర్తింపు లభించింది. సుమేధ గతంలో మహిత అనే సంస్థలోనూ, వీడియో వలంటీర్లతోనూ కలిసి పనిచేయడంవల్ల ఆమెకు ఈ ఫెలోషిప్ గురించి తెలుసుకునే అవకాశం వచ్చిందన్నది నిజం.
మాతృభాష తప్ప మరో భాష రాని వారికి వీడియో తయారీ, ఫిల్మ్‌మేకింగ్ గురించి చెప్పాల్సి రావడం కొంత కష్టమైనా దానిని చాలెంజ్‌గా తీసుకుని వారి భాష నేర్చుకుని మరీ వారికి వీడియో తయారీ అవసరాన్ని నొక్కి చెప్పి శిక్షణ ఇవ్వగలిగింది జార్ఖండ్ అమ్మాయి. సగటు విద్యార్థిని అయిన తనకు ఈ ఫెలోషిప్ రావడం మరీ ఆనందం కల్గించిందని సుమేధ గోస్వామి చెబుతుంది. అరుదైన గౌరవం పొందిన సుమేధకు.. ఆల్ ద బెస్ట్ చెబుదామా!