యువ

నేను సైతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల మల్లికా ఆర్య హేండ్‌బ్యాగ్‌లో ఏమున్నాయో అని ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోవాల్సి రావచ్చు.
ఎందుకంటే...ఆమె బ్యాగ్‌లో బయోడీగ్రేడబుల్ టూత్‌బ్రష్ ఉంటుంది.
వెదురుతో తయారు చేసిన ఓ కాఫీ మగ్ ఉంటుంది.
పునర్వినియోగించదగిన స్ట్రా ఉంటుంది.
ఓ వాటర్ బాటిల్ కూడా ఉంటుంది.
-అవి చూశాక ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది..ఆ అమ్మాయి పర్యావరణ హితం కోసం పాటుపడే ఓ కార్యకర్త అని.
నిజమే! పట్టుమని పాతికేళ్లయినా లేని మల్లికకు పర్యావరణమంటే ప్రాణం. వాతావరణ కాలుష్యాన్ని పరిహరించి, పచ్చదనాన్ని పాదుకొల్పే దిశగా పదిమందినీ చైతన్యవంతుల్ని చేయాలన్నది ఆమె ఆశయం.
నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించడం, పదిమందినీ చైతన్యవంతుల్ని చేయడం అంత తేలికేం కాదు. మార్గమధ్యంలో ఎదురయ్యే ఆటుపోట్లకు తట్టుకుని నిలబడే శక్తియుక్తులు పెంపొందించుకోవాలి. ఆటంకాలు తలెత్తినా, అవాంతరాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. మల్లిక ఈ లక్షణాలన్నింటినీ చిన్న వయసులోనే పుణికి పుచ్చుకుంది.
పర్యావరణ సమతుల్యత తప్పి, వాతావరణం పెనుమార్పులకు గురవుతూ జన జీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్న విషయాన్ని మల్లిక చిన్ననాడే గుర్తించింది. డిగ్రీ పూర్తిచేశాక, ఆ దిశగా రంగంలోకి దిగింది. తాజాగా వాతావరణ మార్పులపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అంటార్కిటికా యాత్ర తలపెట్టింది. పైగా పర్యావరణ నిపుణుడు రాబర్ట్ స్వాన్‌తో కలసి ఆమె ఈ ‘జైత్రయాత్ర’కు శ్రీకారం చుట్టబోతోంది. అయితే దీనికయ్యే ఖర్చు సుమారు 14 లక్షల రూపాయలు. అందుకు మల్లిక ఏం కుంగిపోలేదు. ఓవైపు వచ్చే ఏడాది జరిగే అంటార్కిటికా యాత్రకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూనే, మరోవైపు నిధుల సేకరణకూ నడుం బిగించింది. క్రౌడ్‌ఫండింగ్‌కోసం తీతీతీ.ఇజఆజ్పజశ.ష్యౄను ఆశ్రయింఛింది.
వాతావరణ మార్పుల వల్ల కలుగుతున్న అనర్థాలను వివరించి, ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ఇదో చక్కటి అవకాశమని మల్లిక భావిస్తోంది. అంటార్కిటియా యాత్రలో ఇతర దేశాలకు చెందిన తనలాంటి ఔత్సాహికులు కూడా ఎంతోమంది పాల్గొంటున్నారని, వారితో కలసి ఆలోచనలను కలబోసుకునేందుకూ అవకాశం కలగడం తన అదృష్టమనీ మల్లిక భావిస్తోంది.
పర్యావరణ పరిరక్షణకు ప్రాణం పెట్టే మల్లిక తన వంతు కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో సొంత వాహనానికి స్వస్తి చెప్పింది. కేవలం బస్సులు, రైళ్లనే ఆశ్రయిస్తుంది. అలాగే మినరల్ వాటర్ బాటిల్స్ కొనుక్కోవడం, నీళ్లు తాగాక పారేయడం ఆమెకు నచ్చదు. అందుకే తనతోపాటు ఎప్పుడూ ఓ ఖాళీ బాటిల్‌ను ఉంచుకుంటుంది. టూత్‌పేస్టులు, బ్రష్షులు, చివరకు మహిళలు వాడే శానిటరీ ప్యాడ్స్‌వల్ల పర్యావరణం పాడవుతోందని నమ్మే మల్లిక ఈ దిశగా వీలైనంతవరకూ ప్రజల్లో చైతన్యం తెచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మహిళలు వాడే ఒక్కో శానిటరీ ప్యాడ్ భూమిలో పూర్తిగా కలసిపోయేందుకు 400 సంవత్సరాలు పడుతుందని చెప్పే మల్లిక, ప్రస్తుతం మనం వాడుతున్న అనేక వస్తువులకు ప్రత్యామ్నాయం కనిపెట్టాల్సిన అవసరం ఉందంటోంది.