యువ

స్కూలంటే ఇదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇది మన స్కూలేనా.. ఫైవ్‌స్టార్ హోటలా..?’ అని ఆశ్చర్యపోయారు వేసవి సెలవుల తర్వాత స్కూల్‌కు వచ్చిన విద్యార్థులు.
ఇది మన స్కూల్ కాదేమోనే.. ఏదైనా ప్రైవేట్ స్కూల్‌కు అమ్మేశారేమో.. ఫాతిమా అనే విద్యార్థిని డౌట్. అలా చేయరే.. గవర్నమెంట్ స్కూలే.. స్కూల్ బోర్డు వుందిగా.. ఇంతకుముందే ఎవరో స్కూల్‌ను దత్తత తీసుకుని అపురూపంగా తీర్చిదిద్దుతాం అన్నారనీ టీచర్లు చెప్పారు కదా, అదే అయి వుంటుంది.. పరిమళ అనే స్టూడెంట్ కాన్ఫిడెన్స్‌గా చెప్పింది.
నిజమే.. కేరళలోని కోజికోడ్ జిల్లా నడక్కావ్‌లోని ప్రభుత్వ పాఠశాల అద్భుతంగా తయారయింది. కేవలం 95 రోజుల్లో స్కూల్ రూపురేఖలు మారిపోయాయి. సర్కార్ స్కూళ్లు.. అనగానే ఉండే అసౌకర్యాలు మచ్చుకైనా లేవు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ రూపుదిద్దుకుంది.
కేరళలోని కోజికోడ్ జిల్లా నడక్కావ్‌లోని గవర్నమెంట్ ఒకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఫర్ గర్ల్స్.. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ స్కూళ్లకు మోడల్‌గా తయారయింది. వందలాది స్కూళ్లను ఇదేవిధంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కదలి వచ్చింది అంటే గొప్ప మార్పే. ఈ మార్పులకు స్థానిక ఎమ్మెల్యే ప్రదీప్‌కుమార్ చొరవ ప్రధాన కారణం. 17 కోట్ల రూపాయల ఖర్చుతో.. పలువురు వ్యక్తులు, సంస్థల చొరవతో ప్రాంతీయ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే పథకం (ప్రిస్మ్) కింద స్కూళ్లలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించే పని చేపట్టారు. కోజికోడ్ ఐఐటీ స్కూల్ టీచర్ల ప్రమాణాలను పెంచడంతోపాటు మేనేజిమెంట్ స్కిల్స్ పెంచేందుకు తన వంతు తోడ్పడింది. ఇన్ని మార్పులకు కీలకం ఫైజల్, షహానా ఫౌండేషన్... భారతదేశంలోనే కాదు.. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లోనూ.. ఆర్థికంగానూ, ఇతర విధాలుగా వెన్నుదన్నుగా నిలిచింది ఫౌండేషన్.
ఫైజల్ ఇ.కొట్టికోలన్ (54), ఆయన భార్య షబానా ఫైజన్ (41) మదిలో ఊపిరి పోసుకున్న ఫౌండేషన్ ఇది. ఈ దంపతులు కెఇఎఫ్ హోల్డింగ్స్ అనే కంపెనీ పేరుతో వివిధ రంగాల్లో ఆరు రకాల బిజినెస్‌లను సాగిస్తోంది. హెల్త్‌కేర్, వౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఖనిజాలు, పెట్టుబడి వంటి రంగాల్లో విజయవంతంగా రాణిస్తోంది. ఫైజల్ ఫౌండేషన్ పుణ్యమా అని 123 సంవత్సరాల ప్రభుత్వ పాఠశాల ఆశ్చర్యకరంగా, అపూర్వ రీతిలో మారిపోయింది. కొత్త క్లాస్‌రూమ్‌లు, ఐటి కంపెనీల్లో మాదిరి ఖరీదైన ఫర్నీచర్, కొత్త కంప్యూటర్లు, అద్భుతమైన లైబ్రరీ, అందమైన కిచెన్, క్యాంటీన్, ఆడుకునేందుకు రాష్ట్రంలోనే ఏ స్కూలులోనూ లేని విధంగా తొలి ఆస్ట్రోటర్ఫ్ స్టేడియం, చిన్నపాటి సైన్స్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించుకునేందుకు వీలైన భారీ మీటింగ్ హాల్, చక్కటి టాయిలెట్లు.. ఇవన్నీ చూసి విద్యార్థులే కాదు.. టీచర్లే ఆశ్చర్యపోయారు. లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పాఠశాలలో ఫైజల్ ఫౌండేషన్ ప్రణాళికాబద్ధంగా మార్పులు చేపట్టి రికార్డు సమయంలో అంటే 10 నెలల్లో అన్నీ పూర్తిచేసి 2013లో ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పుడు ఈ పాఠశాల రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు మోడల్‌గా తయారైంది. రాష్ట్రంలోని 250కిపైగా పాఠశాలల అధికారులు, హెడ్‌మాస్టర్లు, నవక్కాడ్ పాఠశాలను సందర్శించారు. 65 స్కూళ్లలో ఈ పాఠశాల తరహాలో మార్పులు చేర్పులు చేపట్టారు. ప్రభుత్వమే నవక్కాడ్ పాఠశాల తరహాలో వెయ్యి ప్రభుత్వ స్కూళ్లలో మార్పులు చేసి తీరతామని ప్రకటించి ముందుకు వచ్చింది. ఇప్పటికే సర్కార్ ఇందుకోసం రూ.1000 కోట్లను కేటాయించింది. ఈ స్కూల్‌ను, స్కూల్‌లో విద్యా ప్రమాణాలను చూసిన తర్వాత తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వచ్చింది. పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ స్కూల్‌లో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. 350 మంది విద్యార్థులున్న స్కూల్‌లో చేరేందుకు వేలాదిగా దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. జోసఫ్ సెబాస్టియన్ (45) ఆధ్వర్యంలోని లాభాపేక్షలేని ఫైజల్, షబానా ఫౌండేషన్ ఈ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ఫైజల్, షబానా, సెబాస్టియన్.. ఇలాంటి మార్పులకు శ్రీకారం చుట్టినవారికి హేట్సాఫ్!