యువ

కాయా...పండా? * తేల్చి చెప్పే స్పెక్ట్రోమీటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాపిల్స్ కొనాలనుకుంటే, ఈసారి ఓ స్పెక్ట్రోమీటర్‌ను వెంట తీసుకెళ్తే సరి. సాధారణంగా పళ్లు పక్వానికి వచ్చాయో లేదో తెలుసుకోవడం ఓ పెద్ద పరీక్షే. ఇకపై ఇది కనిపెట్టడం చాలా ఈజీ. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్తవ్రేత్తల బృందం ఓ స్పెక్ట్రోమీటర్‌ను కనుగొంది. కాయకు దగ్గరగా ఈ పరికరాన్ని ఉంచితే అందులోంచి ప్రసరించే అల్ట్రా వయొలెట్ కిరణాలు కాయలోని క్లోరోఫిల్ (పత్రహరితం)ను బట్టి అది పక్వానికి వచ్చిందో లేదో ఇట్టే పసిగట్టి, సమాచారాన్ని స్మార్ట్ఫోన్‌కు చేరవేస్తుందట. ఇంకా ప్రయోగ దశలో ఉన్న ఈ స్పెక్ట్రోమీటర్ మార్కెట్లోకి వస్తే, వినియోగదారులకే కాదు...వ్యాపారులకు కూడా ఎంతో ఉపయోగకరం కదా!
మీ కళ్లు చల్లగా!
రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేశాక, వళ్లే కాదు..కళ్లు కూడా బాగా స్ట్రెయిన్ అవుతాయి. చాలామంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ కళ్ల మంటలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటివారికోసం ‘8 సెకండ్స్ గ్లాసెస్’ (8 డళష్యశజూఒ ద్ఘిఒఒళఒ) మార్కెట్లోకి వచ్చాయి. రోజంతా పనిచేసి ఇంటికొచ్చాక వీటిని కాసేపు కళ్లకు పెట్టుకుంటే కళ్లు తేలిక పడతాయట. అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డీమాగ్నిఫికేషన్ లెన్స్‌లతో తయారైన 8 సెకండ్స్ గ్లాసెస్... కంటి లోపలి సున్నితమైన కండరాలకు రిలీఫ్ కలిగిస్తాయట. దీనితోపాటు సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే, గ్లాసెస్ పనితీరు వల్ల కళ్లు మెరుగుపడిందీ లేనిదీ కూడా తెలుస్తుందట. యుఎస్‌బి సాయంతో ఈ గ్లాసెస్‌ను చార్జింగ్ చేసుకునే సౌకర్యమూ ఉంది.