యువ

ఇండియా అంటే చాలా ఇష్టం... జపాన్‌లో పుట్టడం నా అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంక యోషికవా!
పేరు చూడగానే భారతీయ మూలాలున్న జపాన్ అమ్మాయని ఇట్టే తెలిసిపోతోంది కదూ!
కానీ...అది కాదు అసలు విషయం.
మిస్ జపాన్‌గా ప్రియాంక గెలవడమే తాజా సంచలనం.
బెంగాలీ అబ్బాయి, జపాన్ అమ్మాయి ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. జపాన్‌లో సెటిలయ్యారు. వారికి పుట్టిన అమ్మాయే ప్రియాంక యోషికవా!
బెంగాలీ, జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే 22 ఏళ్ల ప్రియాంక...మిస్ వరల్డ్ జపాన్-2016 టైటిల్ గెలుచుకోవడంతో ఆ దేశంలో వివాదాలకు తెర లేచింది. హాఫ్ ఇండియన్‌కు టైటిల్ ఇవ్వడంపై జపనీయుల్లో చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మిస్ జపాన్ టైటిల్‌ను జపనీస్‌కే పరిమితం చేయాలని, ఇతర దేశాల మూలాలున్న వారిని ఎంపిక చేయకూడదని టోక్యో వంటి నగరాల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘డక్కన్ క్రానికల్’ చేసిన ఇంటర్వ్యూలో ప్రియాంక తనపై చెలరేగుతున్న దుమారాన్ని మొదలుకుని బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం వరకూ అనేక విషయాలను వెల్లడించింది.
‘నేను ముమ్మాటికీ జపనీయురాలినే. భారతీయ మూలాలు ఉండటం నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. మిస్ వరల్డ్ జపాన్ టైటిల్ గెలవడం నా కల. దాన్ని సాధించడంతో నాలోని ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ఇక నిరసనలంటారా? వాటిని పెద్దగా పట్టించుకోను’ అంటూ చెప్పుకొచ్చింది. టైటిల్ గెలిచాక, సాటి జపనీయులంతా తాను ‘హాఫ్ ఇండియన్’ అయినందుకు హీనంగా చూశారన్న పత్రికా కథనాలను ప్రియాంక కొట్టిపారేసింది. కేవలం అందమే కాదు, ప్రియాంకకు చాలా క్వాలిఫికేషనే్ల ఉన్నాయి. చదువుతోపాటు కిక్ బాక్సింగ్ అంటే కూడా ఇష్టపడుతుంది. అలాగే చిన్నప్పటినుంచే ఏనుగులంటే ఏంతో ఇష్టమట. దాంతో ఎలిఫెంట్ ట్రెయినింగ్‌లో లైసెన్స్ కూడా తీసుకుంది. ఇక తండ్రితో కలసి భారతీయ వంటకాలు తయారు చేయడమంటే చెప్పలేని మక్కువట. అందాల పోటీల్లో గెలిచినవారంతా బాలీవుడ్ బాట పడుతున్న నేపథ్యంలో మీరు అలాంటి ప్రయత్నాలేమైనా చేస్తారా? అని ప్రశ్నిస్తే, ప్రస్తుతం డిసెంబర్‌లో వాషింగ్టన్‌లో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలపైనే తన దృష్టంతానని సమాధానం ఇచ్చింది ప్రియాంక. అయితే బాలీవుడ్‌లో అవకాశాలొస్తే పరిశీలిస్తానంది. హీరో వరుణ్ ధావన్ అంటే ఇష్టమని, అతనితో నటించే అవకాశం వస్తే వదులుకోనని చెప్పే ప్రియాంక, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రాలన్నా తనకు ఇష్టమంది.