యువ

వ్యాయామానికీ ఓ లెక్కుండాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది రోజూ వాకింగ్ చేస్తారు. ఇంకొందరు జాగింగ్... మరికొందరు స్కిప్పింగ్. అయినా ఆశించిన మేరకు ఫలితం లేదని వాపోతూంటారు. దీనికి కారణం...సరైన ప్రణాళిక లేకపోవడం. దేనికైనా ఓ లెక్కుండాలి కదా! ఉదాహరణకు వాకింగ్ చేసేవారైతే... ఎంతసేపు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు వంటి లెక్కలుండటం తప్పనిసరి. గుడ్డెద్దు చేలో పడినట్టు చేస్తే ఏం ప్రయోజనముంటుంది? ఇది టెక్నాలజీ యుగం. ఫిట్‌నెస్ విషయానికొస్తే ఎన్నో ఆధునిక గాడ్జెట్లు వచ్చాయి. వాటి సాయంతో రంగంలోకి దిగితే విజయం మీదే.
స్టెప్ కౌంటర్స్
జాగింగ్, వాకింగ్, రన్నింగ్ చేసేవారికోసం ఇప్పు డు మార్కెట్లో పీడోమీటర్స్ దొరుకుతున్నాయి. మీరు వేసే ప్రతి అడుగునూ ఇది లెక్కించి మరీ చెబుతుంది. రోజూ ఎంతసేపు వ్యాయామం చేస్తున్నారో కళ్లకు కడుతుంది. రన్నింగ్ పేరుతో స్పోర్ట్స్ ట్రాక్ వేసుకుని, షూస్ కట్టుకుని దిగే చాలామంది యధాలాపంగా నడుస్తూంటారు. ఇలా ఎంతసేపు నడిస్తే ఏం ప్రయోజనం? పీడోమీటర్ సాయంతో చేస్తే దానికో లెక్కుంటుంది. సాధారణంగా రోజూ నడిచేవారు కనీసం ఐదువేల అడుగులు వేయాలనేది ఓ లెక్క. పదివేల అడుగులు నడిస్తే మరీ మంచిది.
ఫిట్‌నెస్ మానిటర్స్
రన్నింగ్, జాగింగ్ చేసేవారికి పనికొచ్చే మరో సాధనం ఫిట్‌నెస్ మానిటర్. ఎంత దూరం, ఎంత వేగంగా పరుగెడుతున్నామో ఇది లెక్కగడుతుంది. అలాగే తెలియని ప్రాంతాలకు వెళ్లి జాగింగ్‌కు దిగేవారికి జిపిఎస్ ఆధారంగా పనిచేసే ఫిట్‌నెస్ మానిటర్స్ అయితే బెటర్. సాధారణంగా స్టెప్ కౌంటర్లకంటే జిపిఎస్ ఆధారిత ఫిట్‌నెస్ మానిటర్స్‌లో కచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది.
కేలరీ కౌంటర్స్
కొన్ని రకాల పీడోమీటర్లు, ఫిట్‌నెస్ మానిటర్లు ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయో కూడా చెబుతాయి. కొన్ని రకాల కేలరీ కౌంటర్లలో మీ బరువును లోడ్ చేస్తే దానినిబట్టి కేలరీలను లెక్కగట్టి ఎన్ని కేలరీలు తగ్గాలో లేదా పెరగాలో చెబుతూంటాయి. ఇలాంటి పరికరాలను కొనేటప్పుడు కచ్చితత్వాన్ని దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యం.
హార్ట్ రేట్ మానిటర్స్
వ్యాయామం చేస్తున్నప్పుడు సాధారణంగా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఎంత స్థాయిలో వర్కవుట్ చేస్తున్నామనేది హార్ట్ రేట్ మానిటర్స్ లెక్కగడతాయి. ఇలాంటి వాటిలో కొన్ని టార్గెట్ పెడతాయి. ఆ టార్గెట్‌కుమించి హార్ట్ రేట్ పెరిగితే మిమ్మల్ని హెచ్చరిస్తాయి. *