యువ

సెలబ్రిటీలకు ‘్ఫట్‌నెస్ గురు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మెగా యువహీరో’ రామ్‌చరణ్, అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నా, ‘సుప్రీం హీరో’ సాయిధర్‌మ్ తేజ.. ఇలా ఎందరెందరో సినీతారలు ఇపుడు ఆ జిమ్‌లో కసరత్తులు చేసేందుకు తహతహలాడుతున్నారు. కండలు తిరిగిన శరీరాకృతితో అలరించాలని కుర్రహీరోలు, బరువు తగ్గించుకుని మెరుపుతీగలా ఉండాలని హీరోయిన్‌లు తపన పడడం కొత్తేమీ కాదు. జిమ్‌కు వెళ్లి ఏదో కాసేపు కసరత్తులు చేస్తే చాలదు. వ్యాయామంపై అవగాహన పెంచే సరైన శిక్షకుడు ఎవరికైనా అవసరం. సరిగ్గా ఇపుడు- కుల్దీప్ సేథీ రూపంలో టాలీవుడ్ సెలబ్రిటీలకు తగిన ‘్ఫట్‌నెస్ గురు’ దొరికాడు. ‘వ్యాయామం, ఆరోగ్యంపై ఆసక్తి ఉంటే చాలదు.. అందుకు మనసు పెట్టి కొంత సమయాన్ని కేటాయించాల’ని చెప్పే కుల్దీప్‌ను ఇపుడు ఫిట్‌నెస్ సలహాల కోసం కల్యాణ్‌రామ్, వరుణ్ తేజ, ఆది, ప్రజ్ఞా జైస్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్, సందీప్ కిషన్ వంటి చాలామంది సెలబ్రిటీలు ఆశ్రయిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘ఇజం’ కోసం కల్యాణ్‌రామ్‌ను ‘కండలవీరుడి’గా కుల్దీప్ తీర్చిదిద్దాడు. రామ్‌చరణ్ తేజ తన తొలి సినిమా ‘చిరుత’లో నటించినపుడు ఈ ఫిట్‌నెస్ మాస్టారు కసరత్తులు చేయించాడు. రాజకీయాల్లోకి రాకముందు ‘మెగాస్టార్’ చిరంజీవికి, ‘అరుంధతి’లో నటించినపుడు అనుష్కకు కూడా ఈ హైదరాబాదీ యువకుడు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా సేవలందించాడు. పాఠశాల రోజుల నుంచే క్రీడలు, వ్యాయామంపై ఆసక్తి చూపించిన కుల్దీప్ సేథీ అదే రంగంలో కెరీర్‌ను మలచుకున్నాడు.
ఫిట్‌నెస్ ట్రైనర్‌గా మారి భాగ్యనగరంలో అధునాతన జిమ్‌ను ఏర్పాటు చేశాడు. బరువు తగ్గాలని చాలామంది కోరుకుంటారని అయితే అందుకు తగిన సమయాన్ని, ఏకాగ్రతను కేటాయించాలని కుల్దీప్ చెబుతుంటాడు. ఓపికతో దీక్షగా వ్యాయామ పద్ధతులను పాటిస్తే క్రమంగా బరువు తగ్గడం సాధ్యపడుతుందని అతను అంటున్నాడు. వ్యాయామం చేశాక మనసు తేలిక పడుతుందని, ఆ భావం ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని భరోసా ఇస్తున్నాడు. సరైన పద్ధతుల్లో శిక్షణ పొందాలని తాను సెలబ్రిటీలకు సూచిస్తుంటానని, స్వల్పకాలంలోనే మంచి శరీరాకృతిని పొందాలనుకోవడం ఎవరికైనా అత్యాశేనని కుల్దీప్ అంటున్నాడు. మంచి ఫిట్‌నెస్ కోసం కనీసం మూడు నెలల సమయాన్ని కేటాయించాలని సెలబ్రిటీలకు సలహాలిస్తుంటానని, సరైన శిక్షణ ఉంటే శరీరాకృతిలో ఆశించిన మార్పులు ఖాయమని ఆయన అంటున్నాడు. ప్రతిరోజూ కనీసం గంటసేపు వర్క్ అవుట్ చేస్తుండాలని, వారంలో ఐదు లేదా ఆరు రోజులు వ్యాయామం చేయడం మంచిదని కుల్దీప్ వివరిస్తున్నాడు. రోజువారీ పనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్ణీత సమయంలో నిబద్ధతతో వ్యాయామం చేస్తే మంచి ఫలితాలుంటాయని అంటున్నాడు. ‘ఇజం’లో అభిమానులకు కొత్తగా కనిపించాలని హీరో కల్యాణ్‌రామ్ తన వద్దకు వచ్చినపుడు నాలుగు నెలల పాటు శిక్షణ ఇచ్చానని, ఫలితంగా అతను 12 కిలోల బరువు తగ్గాడని కుల్దీప్ తెలిపాడు. వ్యాయామం ఒక్కటే కాదు, పోషకవిలువలతో కూడిన ఆహారం మంచి శరీరాకృతికి అవసరం అని ఆయన అంటున్నాడు. వ్యాయామ పద్ధతులు ఎలాంటివైనా ఎకాఎకిన బరువు తగ్గడం, కండలు పెరగడం అనేది జరగదని, నిర్ణీత కాలం మేరకు శిక్షణ పొందడం వల్ల, మేలైన ఆహారపు అలవాట్ల వల్ల మంచి శరీరాకృతి సాధ్యమవుతుందని కుల్దీప్ చెబుతున్నాడు.

చిత్రం.. రాశీఖన్నాకు శిక్షణ ఇస్తున్న కుల్దీప్ సేథీ