యువ

హితేశ్.. సినీ మహేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పుట్టి పెరిగిన ఊరు మనకు ఎంతో ఇచ్చింది...ఎంతో కొంత తిరిగి ఇవ్వకపోతే లావైపోమూ!’
- మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాలో యూత్‌కి బాగా కనెక్ట్ అయిన డైలాగ్ ఇది. కానీ...వాస్తవ జీవితంలో ఇలా ఆలోచించే కుర్రాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చేమో! నిరుపేద జీవితంలోంచి పైకొచ్చిన వాళ్లు కూడా రెక్కలొచ్చాక తల్లిదండ్రుల్ని కూడా వదిలేసి, ఎగిరిపోతున్న రోజులివి. తను వచ్చిన మార్గాన్ని, తాను పైకి ఎదగడానికి చేయూతనిచ్చిన వాళ్లను మరచిపోయి, తనకు తాను సుఖపడటానికి దారులు వెతుక్కుంటున్న కాలమిది. అలాంటి మనుషుల మధ్యనుంచే వచ్చిన ఓ యువకుడు మాత్రం లక్షలు కురిపించే జీతాన్ని, బంగారు బాట పరచుకున్న జీవితాన్ని కాదనుకుని, తాను పుట్టి పెరిగిన కుగ్రామానికి మరలిపోయాడు. తనలాంటి యువకులకు సానబెట్టి, తీర్చిదిద్ది గ్రామం పేరును నిలబెట్టడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. అకస్మాత్తుగా అతనెందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు...దాని వెనుక కారణమేమిటి?- ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
అది 2016. భోపాల్‌లోని వౌలానా ఆజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కాన్వొకేషన్ జరుగుతోంది. ఆ సంవత్సరం వివిధ సబ్జెక్టుల్లో గోల్డ్ మెడల్ సాధించిన వారి పేర్లు చదువుతున్నారు. ‘మెటీరియల్ సైన్స్, మెటలర్జీ విభాగంలో గోల్డ్ మెడలిస్ట్- మాస్త్రం హితేశ్’ వేదికపైనుంచి అనౌన్స్‌మెంట్ వినబడింది. ప్రేక్షకుల్లోంచి ఓ కుర్రాడు లేచి వేదికపైకి వెళ్లి మెడల్ అందుకున్నాడు. సహచరుల చప్పట్లే తప్ప తనవారంటూ ఆ హాల్‌లో ఎవరూ లేకపోవడం అతన్ని బాధించింది. దీనికి కారణమూ లేకపోలేదు. హితేశ్ వచ్చింది మధ్యప్రదేశ్‌లోని జిమ్రా అనే ఓ కుగ్రామం నుంచి. ఆ గ్రామంలో అంతా దళితులే. కొడుకు గోల్డ్ మెడల్ అందుకునే రోజున వచ్చి, ఆ దృశ్యాన్ని కళ్లారా చూడాలని అతని తల్లిదండ్రులు ఆరాటపడినా ఖర్చులు భరించి రాలేని పరిస్థితి వారిది. ఇది హితేశ్‌ను ఆలోచనలో పడేసింది. డిస్టింక్షన్‌లో పాసైన హితేశ్‌కు వెంటనే భారత్ ఓమన్ రిఫైనరీస్ సంస్థనుంచి భారీ మొత్తం ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. హితేశ్ ఉద్యోగంలో చేరిపోయాడు కూడా. కానీ, అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. తనను ఇంతవాణ్ని చేసిన గ్రామానికి ఏమీ చేయలేక, తన దారి తాను వెతుక్కున్నానన్న ఆత్మక్షోభ అతనికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఆ మాటకొస్తే, జిమ్రానుంచి గతంలోనూ చాలామంది రిజర్వేషన్ల ఆధారంతో, మంచి ఉద్యోగాలే సాధించుకున్నారు. ఆ తర్వాత వారెవరూ ఊరిముఖం చూసిన పాపాన పోలేదు. ఇదంతా ఆలోచించిన హితేశ్, ఓ శుభముహూర్తాన ఉద్యోగానికి రాజీనామా చేసి, జిమ్రా వచ్చేశాడు.
ఇప్పుడు అతని ముందున్న లక్ష్యం ఒకటే. జిమ్రాను తీర్చిదిద్దడం. యువత ప్రతిభకు సానబెట్టడం. ‘మా గ్రామానికి ఇప్పటికీ కరెంటు లేదు. రెండు పూటలా తినేవారు అతి తక్కువమందే. ముందు వాళ్లకో దారి చూపించాలి. వారి పిల్లల భవితకు బంగారు బాట వేయాలి. ఈ గ్రామానికి ఇప్పుడు నేనున్నాను. ఇక జిమ్రానుంచి ఎవరు ఏ రంగంలో విజయం సాధించినా, వేదికలపై ఒంటరిగా బహుమతులు అందుకోనక్కర్లేదు. అక్కడికొచ్చి, వారిని అభినందించేందుకు నేనున్నాను’ అని చెబుతున్నప్పుడు హితేశ్ కళ్లలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. మీలోనూ ఓ హితేష్ ఉన్నాడు..ఆలోచిస్తే ఉంటాడు కూడా. మనకోసం మనం బతకడంలో గొప్పతనం ఏమీ ఉండదు. ఇతరుల కోసం మన సమయాన్ని కొంత వెచ్చించడలోనే తృప్తి, ఆత్మ సంతృప్తి ఉంటుంది. ఇది ఎంత సంపాదించినా..ఎంతగా పరితమించినా రానిదే. ఇవ్వడంలో ఉన్న ఆనందం ఇదే. అది రితేష్ కనిపెట్టాడు. తను ఎదగడమే కాదు..తన గ్రామాన్ని, ఆ గ్రామంలోని యువతనూ తనతో పాటు మున్ముందుకు తీసుకెళ్లాలన్న ఆతడి ఆశయం ఉదాత్తమే కాదు నిరుపమానం కూడా.

డిగ్రీ పట్టా అందుకుంటున్న హితేశ్ (ఫైల్ ఫోటో)