యువ

వెనెల'లా' పాఠం చెబుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను పెట్టిన స్టార్టప్ స్వయం సమృద్ధి సాధించడం నా ఆశయం. దానిని నడిపేందుకు తరగతుల్లో పాల్గొనే విద్యార్థులిచ్చే ఫీజులు చాలు. వారినుంచి వసూలు చేస్తున్నది కూడా చాలా తక్కువే. అలాగే ఫీజులు చెల్లించుకోలేని వారికి మా తరగతులు ఉచితం

వెనె్నల ఏ కొందరికో పరిమితం కాదు..అది అందరిదీ!
అదే పేరు పెట్టుకున్న వెనె్నల కృష్ణ మనసూ అంతే!
ఆమె ఆలోచన అందరికోసం...ఆమె ఆశయం అందరి శ్రేయస్సుకోసం!
అందుకే ఆమెను అవార్డులు, రివార్డులు వరిస్తున్నాయి.
అసలు విషయంలోకి వస్తే, హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల వెనె్నల కృష్ణ నల్సార్ వర్శిటీలో నాలుగో సంవత్సరం ‘లా’ చదువుతోంది. ఒకవైపు చదువుకొనసాగిస్తూనే మరోవైపు న్యాయశాస్త్రం పట్ల మక్కువ కనబరిచే హైస్కూల్ విద్యార్థులకోసం ఓ స్టార్టప్‌ను పెట్టింది. వాళ్లకు లా ఎంట్రన్స్‌తో సహా ఇతరత్రా సందేహాలు తీరుస్తూ, వారిని అప్‌డేట్ చేసేందుకు తరగతులు నిర్వహిస్తోంది. చిన్న వయసులోనే ఇంత పెద్ద ఆశయాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ దిశగా అడుగులు వేస్తున్న వెనె్నలకు ఇటీవల యూత్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్-2016 లభించింది. నెదర్లాండ్స్‌కు చెందిన చైల్డ్ అండ్ యూత్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ పోటీ నిర్వహించింది. ఇందులో మన దేశంనుంచి ఫైనల్‌కు ఎంపికైన వారిలో పిన్న వయస్కురాలు వెనె్నలే. స్వీడన్‌లో నవంబర్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి ఆమె హాజరుకాబోతోంది.
‘లా స్కూల్ 101’-ఇది వెనె్నల స్టార్టప్ పేరు. హై స్కూల్ విద్యార్థుల్ని తీర్చిదిద్దేందుకు ఇదో ప్లాట్‌ఫామ్ అని చెప్పొచ్చు. న్యాయ శాస్త్రం చదువుతున్న విద్యార్థులే వారికి పాఠాలు చెబుతారు. వారి సందేహాలను నివృత్తి చేస్తారు. తన స్టార్టప్ గురించి వెనె్నల మాట్లాడుతూ ‘ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో కోచింగ్ క్లాస్‌లాంటిది. టెక్స్ట్ బుక్స్‌లో ఉన్న కంటెట్ మాత్రమే కాదు...పబ్లిక్ స్పీకింగ్, వక్తృత్వం వంటివాటి గురించీ చెబుతాం. మా ‘లా స్కూల్ 101’లో విశేషమేవిటంటే..ఇక్కడ పాఠాలు బోధించేవారూ విద్యార్థులే. కాకపోతే వారు న్యాయ శాస్త్రం చదువుతున్న విద్యార్థులు’ అంటుంది. అసలు ‘లా స్కూల్ 101’ అవసరమా అనడగితే న్యాయ శాస్త్రం చదవాలనుకునే విద్యార్థులకు అనేక సమస్యలు, సందేహాలు వస్తాయని, వాటిని నివృత్తి చేసి, వారిని లా ఎంట్రన్స్ ఎగ్జామ్ దిశగా నడిపించేందుకు ఇలాంటి స్టార్టప్ ఒకటి అవసరమేనని వెనె్నల చెబుతుంది. ప్రత్యక్షంగా లా ఎంట్రన్స్ రాసి, పాసై, న్యాయ శాస్త్రం చదువుతున్న విద్యార్థుల కంటే వారికి బాగా ఎవరు చెప్పగలరు? అందుకే మేమే (న్యాయ విద్యార్థు) ఆ బాధ్యతల్ని నెత్తికెత్తుకున్నామని చెప్పే వెనె్నల న్యాయ శాస్త్రం అంటే తనకు ఎంతో ఇష్టమంటుంది.
చైల్డ్ అండ్ యూత్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ పరీక్షలో పాల్గొన్న వెనె్నలను ‘నీ స్టార్టప్‌కు ఎంత ఖర్చవుతుంది? మా నుంచి ఎంత ఆశిస్తున్నావు?’ అని జడ్జీలు అడిగారట. తనకు డబ్బుతో పని లేదని వెనె్నల చెబితే ఆశ్చర్యపోవడం జడ్జీల వంతయిందట. ‘నేను పెట్టిన స్టార్టప్ స్వయం సమృద్ధి సాధించడం నా ఆశయం. దానిని నడిపేందుకు తరగతుల్లో పాల్గొనే విద్యార్థులిచ్చే ఫీజులు చాలు. వారినుంచి వసూలు చేస్తున్నది కూడా చాలా తక్కువే. అలాగే ఫీజులు చెల్లించుకోలేని వారికి మా తరగతులు ఉచితం కూడా’ అని వెనె్నల వివరించింది.
‘లా స్కూల్ 101’ను నడపడమే మీ ఆశయమా? న్యాయశాస్త్రం పట్టా అందుకున్నాక ప్రాక్టీస్ చేయరా?’ అనడిగితే లా అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆ ఇష్టంతోనే నల్సార్‌లో చేరానని, ప్రాక్టీస్ పెడతానని ధీమాగా చెబుతున్న వెనె్నల ఆశయం కొండంత. దాని నడిపేందుకు ఆమెకున్న మనోబలం కూడా కొండంతే. న్యాయశాస్త్రం పట్ల విద్యార్థుల్లో మక్కువ పెంచి, వారి భవిష్యత్తుకు తన వంతుగా బంగారుబాట వేసేందుకు ప్రయత్నిస్తున్న వెనె్నల ఆశయం నెరవేరాలని ‘యువ’ ఆకాంక్షిస్తోంది. ఆల్ ది బెస్ట్ టు వెనె్నల!