యువ

ఆశయాలు అనన్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిర్లాల కుటుంబంనుంచి ఓ పాప్‌స్టార్
22 ఏళ్ల వయసులో బహుముఖ ప్రజ్ఞ

రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు.
సినీ యాక్టర్ కుమార్తె సినీ యాక్టర్ అవుతోంది.
వ్యాపారవేత్త కొడుకు వ్యాపారవేత్త అవుతున్నాడు.
ఇలా చూస్తే, అనన్య బిర్లా కూడా బిజినెస్ మాగ్నెట్ అవ్వాల్సిందే.
కానీ, విచిత్రంగా ఆమె మ్యూజిక్‌ను కెరీర్‌గా ఎంచుకుంది.
ఆ దిశగా ముందుకు సాగిపోతోంది.
ఇంతకీ ఎవరీ అనన్య అనుకుంటున్నారు కదూ?
అనన్య ప్రముఖ వ్యాపార దిగ్గజం కుమార్ మంగళం బిర్లా కుమార్తె. బిర్లాల వంశంలో ఐదో తరానికి ప్రతినిధిగా ఎదుగుతున్న 22 ఏళ్ల అనన్యలో బహుముఖ కోణాలున్నాయి.
లివింగ్ ది లైఫ్
పాప్ స్టార్‌గా ఎదగాలనేది అనన్య ఆశయం. అయితే ఇప్పటికిప్పుడు నిర్ణయించుకుని, రేపు పాప్‌స్టార్‌గా మారిపోవాలనుకున్నా ఆమెకు అడ్డంకులు, అవాంతరాలు ఏమీ ఉండబోవు. కానీ సంగీతంలో అనన్య పునాదులు గట్టివి. కవిత్వం రాయడం పనె్నండో ఏటనుంచి అలవడిందిట. చిన్నప్పుడు గిటార్, సంతూర్ నేర్చుకుంది. పాడటమూ సాధన చేసింది. అప్పటినుంచీ సంగీతం పట్ల పెరిగిన ఇష్టం...పాప్‌స్టార్‌గా మారేందుకు బాటలు వేస్తోంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు గేదరింగ్స్‌లో ఆమె ఎన్నోసార్లు గిటార్ పట్టుకుని విద్యార్థుల మధ్య నిలబడి పాడేది. అలా పాప్ మ్యూజిక్ పట్ల ఇష్టం పెంచుకుని, అమెరికన్ పాప్ ఆల్బమ్స్ ప్రొడ్యూసర్ జిమ్ బియాంజ్‌తో కలసి ఆల్బమ్‌ను రూపొందించే పనిలో పడింది. ఏడాదిపాటు పాటలు సాధన చేసింది. తనపై తనకు నమ్మకం కలిగాక, ఇప్పుడు ‘లివింగ్ ది లైఫ్’ పేరిట ఆల్బమ్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అన్నట్టు మ్యూజిక్‌ను కంపోజ్ చేయడమే కాదు, పాటలు రాసింది కూడా అననే్య కావడం విశేషం.
ఎంపవర్
అలాగని అనన్య వ్యాపార రంగాన్ని పూర్తిగా విస్మరిస్తోందని కాదు. తాతముత్తాతల నుంచి ఇదే రంగంలో ఉన్నప్పుడు ఆ జీన్స్ అనన్యకు మాత్రం రాకుండా ఎలా ఉంటాయి? అయితే ప్రస్తుతానికి మాత్రం ఆమె సమాజానికి నేరుగా ఉపయోగపడే వ్యాపారాలను మాత్రమే ఎంచుకుంటోంది. మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు తన తల్లితో కలసి అనన్య ‘ఎంపవర్’ (ఔ్యతీళూ) అనే సంస్థను నడుపుతోంది. ‘ప్రపంచంలో ఆత్మహత్యల రేటు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో ఇండియాకూడా ఉండటం నన్ను కలవరపరిచింది. కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక సమస్యలతో బాధపడేవారిలో చైతన్యం రగిలించడం ధ్యేయంగా ఎంపవర్ కృషి చేస్తోంది’ అని ఆమె చెప్పింది.
స్వతంత్ర
గ్రామీణ మహిళలకోసం ‘స్వతంత్ర’ అనే సంస్థను కూడా అనన్య నిర్వహిస్తోంది. టెక్నాలజీ దిశగా గ్రామీణ మహిళల్ని ప్రోత్సహించడం, వారికి ఎదురయ్యే ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ఈ సంస్థ కృషి చేస్తోంది. ఇదేకాకుండా చేతివృత్తికళాకారుల ఉత్పత్తులు పట్టణ వినియోగదారులకు అందించేందుకు అనన్య ఓ ఇ కామర్స్ వెబ్‌సైట్‌ను కూడా నడుపుతోంది.
ప్రస్తుతం హోమ్‌స్కూలింగ్‌కు పరిమితమైన అనన్యను ఈ వయసులో కాలేజ్‌కి వెళ్లకుండా హోమ్ స్కూలింగ్ దేనికని ప్రశ్నిస్తే, సమయం తన చేతిలో ఉండేందుకని జవాబిస్తుంది. ‘కాలేజీకి వెళ్లేటప్పుడు ఉదయం ఆరింటికి బయల్దేరితే మళ్లీ సాయంత్రం నాలుగింటికి కానీ ఇంటికి రావడం వీలయ్యేది కాదు. ఇంట్లోనే చదువుకుంటే, మధ్యాహ్నం ఒంటిగంటకే చదువు పూర్తి చేయొచ్చు. మిగతా సమయాన్ని నా ఇతర వ్యాపకాలకు, వ్యాపారాలకు కేటాయించొచ్చు కదా?’ అని ఎదురుప్రశ్నించే అనన్య వయసులో చిన్నదైనా భవిష్యత్తుకు బాటలు వేసుకోవడంలో పెద్దదే అనిపించకమానదు.

అనన్య బిర్లా