యువ

గాడ్జెట్ల గ్రాడ్యుయేట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్ర నారాయణ్ ముఖర్జీ పేరు చెబితే జార్ఖండ్‌లోని సిందూర్పూర్ అనే కుగ్రామంలో ఎవరూ గుర్తు పట్టరు. కానీ, ‘రూరల్ సైంటిస్ట్’ అని అడిగి చూడండి. అందరూ రుద్ర గురించే చెబుతారు. అతని గురించి, అతను సాధించిన విజయాల గురించి వివరించేందుకు క్యూ కడతారు.
సిందూర్పూర్‌కు చెందిన 34 ఏళ్ల రుద్ర బిఎ చదివాడు. తల్లిదండ్రులు, అన్నయ్య, భార్యాబిడ్డలతో కలసి ఓ చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. తన ఇంట్లోనే ఓ షెడ్ ఉంది. అది రుద్రకు ప్రయోగశాల. ఎలాంటి వసతులూ లేని ఆ షెడ్డులో, బిఎ మినహా అంతకుమించి ఎలాంటి సాంకేతిక విద్యార్హతలు లేని రుద్ర 22 ఆవిష్కరణలు చేశాడంటే నమ్మగలమా? కానీ నమ్మి తీరాలి. ప్రజలకు ఉపయోగపడే వినూత్నమైన గాడ్జెట్లకు రూపకల్పన చేయడంలో అతనికి అతనే సాటి. అందుకే ఆ గ్రామస్థులంతా అతన్ని ‘గ్రామీణ శాస్తవ్రేత్త’గా పిలుచుకుంటారు.నాలుగేళ్ల కిందట ఢిల్లీలో నడుస్తున్న బస్సులో ఓ గ్యాంగ్ రేప్ జరిగింది. రేపిస్టుల దారుణానికి నిర్భయ అనే అమ్మాయి బలైపోయింది. ఈ సంఘటన రుద్రని కలచివేసింది. అలా అతని ఆలోచనల్లోంచి మహిళల రక్షణకోసం ‘దామిని’ అనే గాడ్జెట్ రూపొందింది.చిన్నారులకు డైపర్లు అమర్చినప్పుడు అవి తడిసిపోయినా తల్లిదండ్రులు గమనించరు. ఫలితంగా పిల్లలు రకరకాల చర్మ వ్యాధులకు గురవుతారు. ఇలాంటి పరిస్థితిని నివారించేందుకు రుద్ర తయారు చేసిన ‘కాలింగ్ బెడ్’ అనే పరికరం చిన్నారులకు ఎంతో ఉపయుక్తంగా మారింది. ఇలాంటివే మరో 22 గాడ్జెట్లను రుద్ర రూపొందించాడు.
ఎవరైనా రుద్రను ప్రశంసిస్తే, ఇంతటితో తన ప్రయోగాలు ఆగిపోలేదంటాడు. ‘ఇప్పటికీ నా గ్రామానికి రోజుకు ఆరేడు గంటలు కరెంటు ఉండదు. మా పాఠశాల పరిస్థితి సరేసరి. నేను పరిష్కరించాల్సిన ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయి’ అంటాడతను. ప్రస్తుతం రుద్ర మరో 40 గాడ్జెట్ల తయారీలో నిమగ్నమై ఉన్నాడు. తన పరికరాలను జనంలోకి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో రుద్ర ‘మేకిన్ ఇండియా’, సిఐఎమ్‌ఎఫ్‌ఆర్, ఎన్‌ఐఎఫ్ వంటి సంస్థలను ఆశ్రయించాడు. అయినా వారినుంచి పెద్దగా స్పందన లేదంటాడు. వాళ్లంతా నా ఆలోచనలు, ఫార్ములాల గురించి అడుగుతారు. ఇద్దామన్నా వాటిని కాపీ చేయరని గ్యారంటీ ఏమిటి? నా ఆవిష్కరణలకు పేటెంట్లు సాధించాలని ప్రయత్నిస్తున్నాను. కానీ అది సాధ్యం కావాలంటే 86 వేల రూపాయలు కావాలి. అంత డబ్బు నా దగ్గర లేదు’ అంటాడు రుద్ర. అతను తయారు చేసే గాడ్జెట్లన్నీ సమాజానికి ఉపయోగపడేవే కావడం గమనార్హం. సమాజహితం కోసం ఇంతగా కష్టపడుతున్న రుద్రకు ప్రభుత్వాలు గానీ, స్వచ్ఛంద సంస్థలు గానీ చేయూతనిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడనడంలో సందేహం లేదు.

ఆటో సేఫ్ హెల్మెట్
ద్విచక్ర వాహనదారులకు ఈ గాడ్జెట్ ఓ వరంలాంటిది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ హెల్మెట్ పెట్టుకుని వెడుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే, వాహనదారుడి బంధువులకు వెంటనే కాల్ వెడుతుంది. తద్వారా వాహనదారుడికి సకాలంలో చికిత్స అందే అవకాశం ఉంటుంది. ఇదెలా పనిచేస్తుందంటే...ప్రమాదం జరిగిన వెంటనే హెల్మెట్‌లో అమర్చిన గాడ్జెట్‌నుంచి బ్లూటూత్ సిగ్నల్స్ వాహనదారుడి సెల్‌ఫోన్‌ను యాక్టివేట్ చేస్తాయి. ఎమర్జెన్సీ కోసం వాహనదారుడు అప్పటికే నమోదు చేసుకున్న నంబర్‌కి కాల్ వెడుతుందన్నమాట.
ప్లాంట్ ఫ్రెండ్లీ గాడ్జెట్
పర్యావరణం మీద ఇప్పుడందరికీ అవగాహన పెరిగింది. కాలుష్యాన్ని పారదోలాలంటే మొక్కలు పెంచాలన్న వాస్తవాన్ని గుర్తించారు. ఆ దిశగా అడుగు వేస్తున్నారు. రుద్ర కనిపెట్టిన ప్లాంట్ ఫ్రెండ్లీ గాడ్జెట్ కూడా మొక్కల మనుగడకు ఉపయోగపడేదే. దీనిని మొక్క మొదట్లో అమర్చితే, మొక్క వాడిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు యజమానికి అలెర్ట్ మెసేజ్ పంపిస్తుంది. వెంటనే చర్యలు తీసుకుంటే, వాడుతున్న మొక్కను మళ్లీ చిగురింపజేయొచ్చు.
కాలింగ్ బెడ్
ఇదో వినూత్నమైన పరికరం. పసికందులకోసం తయారు చేసిన ఈ గాడ్జెట్‌ను మంచానికి అమర్చుకోవచ్చు. చిన్నారులకు డైపర్లు వేసినప్పుడు, అవి పాడైపోతే, వెంటనే ఈ గాడ్జెట్ తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు ఆరు సెకండ్లలో అలెర్ట్ మెసేజ్ పంపిస్తుంది.
దామిని- ది ప్రొటెక్టర్
దామిని పేరు వినగానే అర్థమైపోయి ఉంటుంది...ఇది మహిళల రక్షణకోసం రూపొందించిన గాడ్జెట్ అని. నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో గ్యాంగ్‌రేప్‌కు గురైన నిర్భయకు నివాళిగా రుద్ర రూపొందించిన ఈ పరికరం మహిళలకు కొండంత అండ అనే చెప్పాలి.
మహిళలు ప్రమాదంలో పడినప్పుడు ఈ గాడ్జెట్‌కు ఉన్న లివర్‌ను లాగితే వెంటనే సైరన్ మోగడం మొదలుపెడుతుంది. దీని వెనుక ఉన్న సీక్రెట్ స్విచ్‌ను ఆఫ్ చేసే వరకూ అది అలా మోగుతూనే ఉంటుంది.

చిత్రం..తాను తయారు చేసిన గాడ్జెట్లతో రుద్ర నారాయణ్ ముఖర్జీ