యువ

లవ్ స్టోరీ.. సూపర్ హిట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరవై రెండేళ్ల దివ్యషా సంతోషానికి ఇప్పుడు అవధుల్లేవు!
కష్టానికి గుర్తింపు లభించినప్పుడు ఎవరికైనా అంతే!
పట్టరాని ఆనందంతో గంతులేస్తాం కదూ?
దివ్యషా సంగతే తీసుకుందాం. పదిహేడేళ్ల వయసులో ఇంటర్ పాసయ్యాక, సెలవులు వృథా చేయడమెందుకని పేపరూ, పెన్నూ చేతపట్టుకుని, నవల రాసేందుకు ఉపక్రమించింది. ప్రేమ కథను సబ్జెక్ట్‌గా ఎంచుకుని, అద్భుతంగా రాసేసింది. దానికి ‘ఏ 20-సమ్‌థింగ్ కూల్ డూడ్’ అని పేరు పెట్టింది.
రాయడమైతే రాసింది కానీ...అసలు కథ అప్పుడే మొదలైంది. పుస్తకాన్ని ప్రచురించడం ఎలా? పబ్లిషర్ల వద్దకు ఎక్కే గడప...దిగే గడప! కనీసం ఓపిగ్గా పుస్తకం చదివేందుకు కూడా ఎవరూ అంగీకరించలేదు. అలాంటి సమయంలో లైఫై పబ్లికేషన్స్ ముందుకొచ్చింది. దివ్యషా కాస్త ఊపిరి పీల్చుకుంది. పుస్తకం మార్కెట్లోకి వచ్చాక, బాగానే అమ్ముడైంది. ముఖ్యంగా ప్రగతి మైదాన్‌లో జరిగిన ఢిల్లీ బుక్ ఫెయిర్‌లో యువతను ఆకట్టుకుంది.
తాజాగా ఈ పుస్తకాన్ని 200 దేశాల్లో ప్రమోట్ చేసేందుకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆసక్తి కనబరచడంతో దివ్యషా రొట్టె విరిగి తేనెలో పడినట్లయింది. ప్రేమ కథాంశమే అయినా భారతీయ సమాజంలోని వివిధ కోణాలను కళ్లకుకట్టడంవల్ల ఇది విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టిని ఆకర్షించిందన్నమాట. ఇంతకీ దివ్యషా చేయి తిరిగిన రచయిత్రా అంటే కానే కాదు. ఈ పుస్తకాన్ని రాశాక, ఆమె ఢిల్లీలోని ఇందిరాగాంధీ టెక్నికల్ యూనివర్శిటీ ఫర్ ఉమెన్‌లో చేరి, కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పట్టా తీసుకుంది. వాస్తవానికి ‘నాసా’లో ఉద్యోగం చేయాలన్నది ఆమె కల. కానీ, దేవుడు నా జీవితాన్ని రచయిత్రిగా మలుపు తిప్పాడంటున్న దివ్యషా, తన పుస్తకానికి వచ్చిన గుర్తింపుతో ఇప్పుడు మరో రచన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈసారి క్రైమ్ సబ్జెక్ట్‌ను కథాంశంగా ఎంచుకుందట. ఢిల్లీకి చెందిన ఓ యువతి సీరియల్ కిల్లర్‌గా ఎలా మారిందన్న అంశంతో ఓ సస్పెన్స్, థ్రిల్లర్‌కు దివ్యషా శ్రీకారం చుట్టబోతోంది.