యువ

చుక్కల్లో చంద్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినీలాకాశంలోకి చూస్తే మనకు ఏం కనిపిస్తుంది...
నిశిరాత్రిలో తారలు... వెనె్నల రోజుల్లో చందమామ..అంతేగా?
లక్షలమంది కన్నులకు కనిపించేది ఇవే..కాదనలేం... కానీ ఓ పద్నాలుగేళ్ల కుర్రాడికి ‘అద్భుతం’ కనిపించింది. అతడు చూసిన ‘దృశ్యం’ నిజంగా అద్భుతమేనని కొనియాడింది ఖగోళ శాస్తవ్రేత్తల బృందం.
అతి చిన్నవయస్సులో ఓ ఆస్టరాయిడ్‌తోపాటు అంతరిక్షంలో మరో 300 సరికొత్త ‘శకలాల’ ఆచూకీని తొలిసారిగా కనుగొన్న ఘనత దక్కించుకున్నాడు ఢిల్లీ కుర్రాడు ఆర్యన్ మిశ్ర. అతడికి కీర్తివర్ధన్ అనే మరో కుర్రాడి తోడ్పాటు ఉంది. వీరు కనిపెట్టిన ఆస్టరాయిడ్‌కు ‘2014 0యు6’ పేరుపెట్టారు. దీనితో పారిస్‌లోని ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ కేటలాగ్‌లో వీరిపేర్లు చేర్చారు. ఇది అతిపెద్ద గౌరవం. ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించినవారు మరొకలు ఇంతవరకూ లేరు.
రోజూ ఇంటింటికి తిరిగి పేపర్లు వేసే తండ్రితో తనూ తిరిగి.. ఆ తరువాత పగలు స్కూలుకు వెళ్లి, రాత్రి నిశీధిని తనివితీరా చూసే ఆ కుర్రాడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామందికి పాఠాలు చెబుతున్నాడు స్కైప్‌లో.. భవిష్యత్‌లో ‘మార్స్’లో అడుగుపెట్టడం తన కలగా చెప్పుకునే ఈ కుర్రాడు మనదేశంలో అతి పిన్నవయస్సులో ‘ఖగోళ శాస్తవ్రేత్త’గా వినుతికెక్కాడు.
పట్టణాల్లో వెలుగుపొరలు కమ్మేస్తూండటంతో ఆకాశంలో తారకలు కనిపించడం అరుదైపోయింది. ఊరి చివరకు వెళ్లి, లేదా పల్లెపట్టుకు చేరి, ఏ కొండో, గుట్టో ఎక్కి మనం మరీ పరిశీలనగా చూస్తే... కాస్త తీరికగా నేలపై పడుకుని ఆసక్తిగా గమనిస్తే.. మిలమిల మెరిసే చుక్కలు.. అప్పుడప్పుడు టప్పున రాలే ఉల్కలు కనిపిస్తే కనిపించవచ్చు.. అయినా మనకు తెలీనిదేదైనా కనిపిస్తుందా అన్న ఆసక్తితో ఆకాశాన్ని జల్లెడపట్టినట్లు చూసే ఆసక్తి ఎందరికుంటుంది. అలా చూసేవారిని జనం ఎలా చూస్తారు? ఇవేవీ ఆ పద్నాలుగేళ్ల కుర్రాడు పట్టించుకోలేదు...
అతడికి వెతుకులాట వెలుగురేఖ కోసమే..చీకిటపడితే చాలు టెలిస్కోప్ పట్టుకోవడం, ఊరిబయటకు వెళ్లడం... తదేకంగా అంతరిక్షంవైపు చూడటం..అదే శోధన.. మరో కుర్రాడి సాయంతో నిరంతర అనే్వషణ. అతడి పేరు ఆర్యన్ మిశ్ర. ఢిల్లీ శివారు అతడి స్వస్థలం. రాజధానిలోని చిన్మయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మిత్రుడు కీర్తివర్ధన్‌తో కలసి సంచలనం సృష్టించాడు. అదెలా సాధ్యమైందంటే..అదో విశేషం.
***
ఆర్యన్ మిశ్రాది పేద కుటుంబం. తండ్రి దినపత్రికలు అమ్మే వ్యక్తి. ఇంటింటికీ తిరిగి పేపర్లు పంచేవాడు. తనఈడు పిల్లలు ఆడుకుంటూంటే ఆర్యన్ ఆకాశంవైపు తదేకంగా చూసేవాడు. ఖగోళశాస్తమ్రంటే ఆసక్తి. కుటుంబ సభ్యులకు అతడి తీరు అర్ధమయ్యేదికాదు. స్కూలుకు వెళ్లేందుకు ఇచ్చిన బస్సు టిక్కెట్టు చార్జీలను దాచుకుని పదకొండేళ్ల వయసులో 7500 రూపాయలు దాచుకుని ఓ టెలిస్కోప్ కొనుక్కున్న ఆర్యన్ చీకటిపడ్డాకు ఇల్లువదిలి ఊరికి దూరంగా... చిమ్మచీకటి అలుముకున్న చోట చేరి అంతరిక్షంలోకి చూసేవాడు. అలా రెండున్నరేళ్లు గడచిపోయాయి. ఓ రోజు తన సహచరుడు కీర్తివర్ధన్‌తో కలసి చూస్తుంటే అతడి కళ్లు మెరిసాయి. ఓ ఆస్టరాయిడ్‌ను అతడు కనిపెట్టాడు. అంతవరకు ఎవరూ చూడనిది అది. దానితోపాటు మరో 300 గుర్తుతెలియని ‘శకలాల’ ఆచూకీని వారు కనిపెట్టారు. మార్స్, జూపిటర్ గ్రహాల మధ్య కక్ష్యలలో వాటిని వారు గుర్తించారు. అప్పటికే మొదలైన నేషనల్ లెవెల్ ఆస్టరాయిడ్ సెర్చ్ పోటీలో వారు భాగస్వాములవడం, వారు కొత్తగా ఆస్టరాయిడ్‌ను కనుగొనడంతో వారి పేరు మారుమోగిపోయింది. ది ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ సెర్ట్ కొలాబిరేషన్ (ఐఎఎస్‌సి), ది ఆస్ట్రానామికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎఆర్‌ఐ) వీరికి అండగా నిలిచాయి. ప్రస్తుతం చిన్మయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆర్యన్ ప్రపంచ ప్రసిద్ధ ఖగోళ శాస్తవ్రేత్తలు, వ్యోమగాములతో నిత్యం సంభాషిస్తూంటాడు. ఆయా రంగాల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతూంటాడు. ‘నాసా’కు వెళ్లాలన్నది ప్రస్తుతం అతడి కల. భవిష్యత్‌లో అంతరిక్షంలోకి ‘వ్యోమగామి’గా వెళ్లాలన్నది మరో కల. ఆ తరువాత ‘మార్స్’పై అడుగుపెట్టాలన్నది చిరకాల స్వప్నం. అదెలా సాధించుకోవాలో అతడికి స్పష్టమైన ప్రణాళిక ఉంది.

చిత్రాలు.. ఆస్టరాయడ్ కోసం ఆర్యన్ అనే్వషణ

*అవార్డులతో ఆర్యన్, కిర్తివర్ధన్