యువ

కఠోర శిక్షణతో ‘ భువన’ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనిమిదేళ్ల ప్రాయంలోనే టెన్నిస్ ర్యాకెట్ పట్టుకున్న హైదరాబాద్ అమ్మాయి భువన కాల్వ (22) అత్యద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అంతర్జాతీయ వేదికలపై భారత పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. జాతీయ స్థాయిలో అండర్ 14, అండర్ 16 విభాగాల్లో సత్తా చాటిన ఆమె దేశంలోని పదిమంది అత్యుత్తమ టెన్నిస్ క్రీడాకారిణుల్లో ఒకరిగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ఇటీవల ‘అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య’ పోటీల్లో గెలిచిన భువన వచ్చే నెలలో జరిగే ‘వరల్డ్ యూనివర్సిటీ చాంపియన్ షిప్ పోటీలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘వరల్డ్ యూనివర్శిటీ టెన్నిస్ చాంపియన్‌షిప్’ పోటీలకు భారత్ తరఫున ఎంపికైన నలుగురిలో భువన ఒకరు కావడం విశేషం. హైదరాబాద్‌లోని సెంట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో ‘మాస్ కమ్యూనికేషన్’లో పీజీ చేస్తున్న భువన ప్రతిరోజూ నియమబద్ధంగా ‘్ఫట్‌నెస్’ తరగతులకు హాజరవుతుంది. ఫిట్‌నెస్ ఉంటేనే దేన్నయినా సాధించగలమని చెబుతున్న భువన టెన్నిస్ శిక్షణకు క్రమం తప్పకుండా వెళుతుంది. ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకూ ఫిట్‌నెస్ క్లాసులో, ఎనిమిదిన్నర నుంచి పదకొండు గంటల వరకూ టెన్నిస్ శిక్షణలో గడుపుతుంది. ఆ తర్వాత కొంతసేపు విరామం తీసుకుని మరోరెండు గంటల సేపు టెన్నిస్ ప్రాక్టీస్, సాయంత్రం జిమ్‌కు వెళుతుంది. ఫిట్‌నెస్, టెన్నిస్ శిక్షణ కాస్త కఠినంగానే ఉంటుందని, సాధారణంగా సోమవారాల్లో వీటి నుంచి సెలవు తీసుకుంటానని భువన చెబుతోంది. టెన్నిస్‌లో మరిన్ని మెళకువలు నేర్చుకొనేందుకు హర్యానాలో ఆగస్టు 1 నుంచి జరిగే శిక్షణకు హాజరవుతోంది. ఇలియాస్ గౌడ్, సయ్యద్ ఫరూఖ్ కమల్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్న ఈమె పీజీ పూర్తయ్యాక పూర్తి సమయాన్ని టెన్నిస్‌పైనే కేటాయిస్తానంటోంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తాను విజేతగా నిలుస్తున్నానని తెలిపింది. తీరిక దొరికితే విభిన్న రుచులను ఆస్వాదిస్తానని, విశ్రాంతి తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తానని భువన అంటోంది.