యువ

రోబోల ‘పంట’ పండుతుందా? జపాన్‌లో పాలకూర సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది రోబోల కాలం. ఐరోపా దేశాల్లో షాపింగ్ మాల్స్‌లోనూ, ఆఫీసులలోనూ ఎక్కడ చూసినా రోబోలే దర్శనమిస్తున్నాయి. ఇందులో వింతేం లేదు. అయితే ఇకపై ఇండస్ట్రియల్ రోబోలు రాబోతున్నాయి. అదే అసలు వింత. ఇండస్ట్రియల్ రోబోలంటే పరిశ్రమల్లోనూ, వ్యవసాయ క్షేత్రాల్లోనూ పనిచేసే రోబోలన్నమాట. జపాన్‌లోని క్యోటోకు చెందిన స్ప్రెడ్ అనే సంస్థ రోబోలతోనే సాగు చేయించే పద్ధతికి శ్రీకారం చుడుతోంది కూడా. 47,300 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఓ ఇండోర్ ఫామ్‌హౌస్‌లో రోబోలతోనే పాలకూర సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నారు పోయడం దగ్గరనుంచీ పంట కోత కోసే వరకూ అన్ని పనుల్నీ రోబోల చేతే చేయించాలన్నది స్ప్రెడ్ ఆలోచన. వ్యవసాయ రంగంలో కూలీల కొరతను ఎదుర్కునేందుకు ఈ ప్రయోగం చేస్తున్నట్టు స్ప్రెడ్ ప్రతినిధి చెప్పారు.