యువ

ఘోషాల్ ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘గ్లోబల్ అండర్ గ్రాడ్యుయేట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’కు ఎంపిక కావడంతో హైదరాబాద్ యువతి సౌమయాని ఘోషాల్ అరుదైన ఘనతను సాధించింది. పిట్స్‌బర్గ్ (అమెరికా)లోని ఛాతమ్ విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్ పొందేందుకు భారత్ నుంచి ఈ ఏడాది ఎంపికైన అయిదుగురిలో ఘోషాల్ ఒకరు కావడం విశేషం. హైదరాబాద్‌లోని సెంట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో జర్నలిజం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఘోషాల్ తన కెరీర్‌ను సాకారం చేసుకునేందుకు ఈ స్కాలర్‌షిప్ ఎంతగానో దోహదం చేస్తుందని సంతోషం వ్యక్తం చేస్తోంది. విదేశాల్లో చదవాలన్న తన ఆకాంక్ష నెరవేరిందని, ప్రణాళికాబద్ధంగా చదవడం వల్లనే తాను ఇంతటి ఘనతను సాధించానంటోంది. విదేశీ విశ్వవిద్యాలయంలో వివిధ దేశాలకు చెందిన వారితో కలిసి చదివే అవకాశం రావడం గొప్ప అనుభూతి కలిగిస్తుందని చెబుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడుకావడంతో ఛాతమ్ విశ్వవిద్యాలయంలో చదివేందుకు తాను ఎంపికైనట్లు ఆమె వివరించింది. భారతీయ విద్యార్థులకు సంబంధించి విదేశాల్లో ఇప్పటికీ కొన్ని అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించి మన సత్తా చాటేందుకు తనకు అరుదైన అవకాశం దక్కడం ఆనందాన్ని కలిగిస్తోందని ఆమె తెలిపింది.