యువ

వై-ఫై సిగ్నల్స్‌తో సమస్యలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి సాంకేతిక యుగంలో ఇంటింటా ‘నెట్’ విస్తరించడంతో ‘వై-ఫై రూటర్’ను వినియోగించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, స్మార్ట్ టీవీ.. ఇలా విభిన్న రూపాల్లో ఒకే కుటుంబంలో ‘నెట్’ను పలురకాలుగా వాడుతున్నారు. ‘నెట్’ వినియోగం పెరగడంతో చాలా ఇళ్లలో ఇపుడు ‘వై-ఫై రూటర్’ కొనడం తప్పనిసరి అవుతోంది. ఏదో ఒకటి కొనేస్తే సరిపోతుంది అనుకోకుండా ‘వై-ఫై రూటర్’ ఎంపికలో మెళకువలను, నిపుణుల సలహాలను తెలుసుకుంటే వృథా ఖర్చును నివారించవచ్చు, అసౌకర్యాలు లేకుండా ‘అంతర్జాలం’లో విహరించవచ్చు. అందుకే స్మార్ట్ఫోన్లకు, ల్యాప్‌టాప్‌కు సరైన ‘వై-ఫై’ సిగ్నల్ రావాలంటే రూటర్ కొనే సమయంలో సంబంధిత సాంకేతిక అంశాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం.ఇంట్లో ఏ గదిలో ఉన్నా ‘వై-ఫై’ సిగ్నల్స్ సరిగా ఉండాలి. మనకు అడ్డంకిగా ఉంటుందని ‘రూటర్’ను ఏదో ఒక మూలన పడేయడం వల్ల సిగ్నల్ సమస్య ఏర్పడుతుంది. ఓ గదిలో మూలన రూటర్‌ను పడేస్తే మెయిన్ హాల్, బెడ్‌రూమ్, కిచెన్ వంటి ప్రాంతాలకు సిగ్నల్స్ అందవు. అన్ని గదులకూ మధ్య ఉండే చోట దీన్ని అమర్చుకోవాలి. మందమైన గోడలున్నా సిగ్నల్స్ అందవు. ఫ్రిజ్, టీవీ, ఓవెన్, స్టెబిలైజర్లు వంటి ఎలక్ట్రిక్ సామాగ్రికి దూరంగా ‘రూటర్’ను ఏర్పాటు చేసుకుంటే సిగ్నల్స్ బాగా అందుతాయి. ఎత్తయిన చోట రూటర్‌ను ఉంచితే అన్ని రకాల డివైజ్‌లకు సిగ్నల్స్ అందుతాయి. గది వైశాల్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ‘రూటర్’ను ఎంపిక చేసుకోవాలి. అధిక సామర్థ్యం ఉన్న రూటర్‌తో గదులన్నింటికీ సిగ్నల్స్ అందుతాయి. సిగ్నల్స్ బాగా అందాలంటే ‘వై-ఫై ఎక్స్‌టెండర్స్’ను వినియోగించినా ఫలితం ఉంటుంది.