యువ

అదరగొట్టే ‘ఐఫోన్ టెన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియులకు చల్లటి కబురు.. ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన ‘యాపిల్’ సంస్థ గత డిజైన్లతో ఎటువంటి పోలికలు లేకుండా వినూత్నంగా రూపొందించిన ‘ఐఫోన్ పది’ ఇపుడు దేశీయ మార్కెట్‌లో సందడి చేస్తోంది. ‘యాపిల్’ ఇంతవరకూ విడుదల చేసిన మోడళ్లలో పదవదైన ఈ వినూత్న స్మార్ట్ఫోన్ అమ్మకాలు ఇప్పటికే దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రారంభమయ్యాయి. కొన్ని నగరాలకు పరిమిత స్టాకు చేరడంతో విపరీతమైన డిమాండ్ చేరింది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ విక్రయశాలల్లోనూ వీటి అమ్మకాలు జోరందుకుంటున్నాయి. స్టాకు వచ్చిన పావుగంటలోనే ఇవి లభించని పరిస్థితి ఉందంటే స్మార్ట్ఫోన్ ప్రియులు మరికొంత కాలం నిరీక్షించక తప్పదని విక్రయశాలల ప్రతినిధులు చెబుతున్నారు. ‘బైబ్యాక్’ (తిరిగి కొనుగోలు చేసే అవకాశం) జియో ప్రకటించగా, నగదును వెనక్కి ఇచ్చేసి ఎయిర్‌టెల్ చేతులెత్తేసింది. దేశీయంగా రూ. 89,000- 1.02 లక్షల ధరల శ్రేణిలో లభించే ‘యాపిల్ పది’ హోం బటన్ లేకుండా వచ్చిన వినూత్న మోడల్. వేలిముద్రకు బదులు ‘ఫేస్ ఐడి’ని ఇది పరిచయం చేస్తుంది. అంటే వినియోగదారుడి ముఖాన్ని గుర్తుపట్టి ఫోన్ అన్‌లాక్ అయ్యే సౌకర్యం ఇందులో ఉంది. ‘ముఖాన్ని గుర్తించే’ అధునాతన సాంకేతికత వల్ల చీకట్లో కూడా ముఖాన్ని స్పష్టంగా, కచ్చితంగా గుర్తిస్తుంది. సెల్ఫీ కెమెరాలో నిక్షిప్తం చేసిన ‘ట్రూ డెప్త్ కెమెరా’తో ముఖ కవళికల సాయంతో 12 రకాల యానిమోజీలను రూపొందించుకొని మన హావభావాలను ఇతరులతో పంచుకోవచ్చు. 5.8 అంగుళాల టన్ స్క్రీన్, 4జీబీ ర్యామ్, 2,716 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 256 జీబీ అంతర్గత మొమరీ, వైర్‌లెస్ పద్ధతిలో చార్జింగ్, 5.0 బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ వైఫై వంటివి ‘యాపిల్ టెన్’లో ఆకర్షణలుగా ఉన్నాయి.

చార్జింగ్ ఎందుకు తగ్గుతోందంటే..

ఎన్ని ఫీచర్లు ఉన్నా, ఎంత ఖరీదైన స్మార్ట్ఫోన్ అయినా తగినంత బ్యాటరీ బ్యాక్‌అప్ లేకుంటే ఇక్కట్లు తప్పవు. తొందరగా బ్యాటరీ ఖాళీ అవడానికి కారణాలు అనేకం. మన ఫోన్‌లో ఏదైనా యాప్ నిరంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తూ ఉంటే చార్జింగ్ తగ్గుముఖం పడుతూ అది అనవసరంగా ఖర్చయి పోతుంది. కొన్ని రకాల యాప్స్‌లోని బగ్స్ కారణంగా ఇలా జరుగుతుంది. అనవసరమైన యాప్స్‌ను ఫోన్‌లో నుంచి తొలగించడం వల్ల బ్యాటరీని మెరుగుపరచుకునే వీలుంది. ఫోన్ ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేసిన సందర్భంలోనూ ఈ సమస్య ఉంటుంది. కొన్ని యాప్స్ ఫోన్‌ను స్లీప్ మోడ్‌లోకి వెళ్లనీయకుండా పనిచేస్తూనే ఉంటాయి గనుక చార్జింగ్ వృథా అవుతుంటుంది. ‘వేక్‌లాక్ డిటెక్టర్’ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఈ తరహా సమస్యల నుంచి బయటపడొచ్చు.