యువ

నకిలీ యాప్‌లతో ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక సాంకేతిక యుగంలో కేవలం కుర్రకారే కాదు.. స్మార్ట్ఫోన్ వాడుతున్న వినియోగదారుల్లో చాలామంది ఆసక్తిగా చూసేది ‘గూగుల్ ప్లే స్టోర్’ వైపే. అక్కడ అందుబాటులో ఉన్న ప్రఖ్యాత యాప్‌లను అనుకున్న మరుక్షణమే ఫోన్లోకి వెంటనే డౌన్‌లోడ్ చేస్తుంటారు. ఆ యాప్ నిజమైనదా? నకిలీదా? అని ఆలోచించకుండానే, ఎలాంటి అవగాహన లేకుండానే డౌన్‌లోడ్ చేసేస్తుంటారు. ఇలా ఏది పడితే అది డౌన్‌లోడ్ చేసే వారి ఫోన్లపై ఇప్పుడు మాల్‌వేర్‌ల దాడి జరుగుతోంది. కాబట్టి మీరు ఈ చిట్కాలతో మీ ఫోన్లను రక్షించుకునే వీలుంది.
చూసేందుకు ఒకేలా ఉన్నా
ఒరిజినల్, నకిలీ యాప్స్ చూసేందుకు ఒకేలా ఉన్నా వాటిలో కొన్ని తేడాలుంటాయి. ఈ తేడాలను కనిపెట్టడం ద్వారా ఒరిజినల్, ఫేక్ యాప్స్‌ను సులభంగా గుర్తించవచ్చు. తద్వారా మన ఫోన్లను రక్షించుకోవచ్చు.
లోగోలు ఒకేలా ఉన్నా
ఒరిజినల్ యాప్స్‌కు నకిలీ యాప్స్‌కు లోగోలు ఒకేలా ఉన్నా వాటి టెక్ట్స్ వేరేలా ఉంటుంది. అందులో ఏదైనా ఒక అక్షరాన్ని మిస్ చేస్తూ నకిలీ యాప్ ఉంటుంది. లేదంటే వాట్సాప్ పదానికి ముందు వెనుక వేరే పదాలను జోడించి ప్లే స్టోర్‌లో పెడతారు. వీటిని జాగ్రత్తగా చూసి కనిపెట్టాలి.
అసలు యాప్స్ ఏవైనా డౌన్‌లోడ్స్ సంఖ్య కొన్ని కోట్లలో వుంటాయి. నకిలీ యాప్‌లు చాలా అత్యల్పమైన డౌన్‌లోడ్స్‌ను కలిగివుంటాయి. ఈ విషయాన్ని గుర్తించడం ద్వారా కూడా అసలు యాప్, నకిలీ యాప్‌ను మనం సులువుగా కనిపెట్టవచ్చు.
రేటింగ్‌పై కూడా
యాప్‌కు ఉన్న రేటింగ్‌పై కూడా ఓ కనే్నయండి. ఎందుకంటే నకిలీ యాప్స్‌కు రేటింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఒరిజనల్ యాప్‌కు రేటింగ్ ఎక్కువ ఉంటుంది.ఒరిజినల్, నకిలీ యాప్స్ లోగోలు కొన్ని సందర్భాల్లో కచ్చితంగా వుండవు. రంగులో గానీ, బ్రైట్‌నెస్‌లోగానీ, షేడింగ్‌లోగానీ తేడా ఉంటుంది. దీన్ని కనిపెట్టడం ద్వారా కూడా రక్షణ పొందవచ్చు. యాడ్స్ పరంగానూ ఓ లుక్కేయండి. చాలావరకు ఒరిజినల్ యాప్స్‌లో యాడ్స్ ఉండవు. వాట్సాప్, మెసెంజర్ తీసుకుంటే వాటిల్లో మనకు యాడ్స్ కనిపించవు. అయితే వీటిని అనుకరిస్తూ వచ్చే నకిలీ యాప్స్‌లో విపరీతమైన యాడ్స్ ఉంటాయి.