యువ

క్షణాల్లో బ్యాటరీ చార్జ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్జింగ్ లేనపుడు ఎంతటి ఖరీదైన, ఎన్ని ఫీచర్లున్న స్మార్ట్ఫోన్ అయినా ఎందుకూ కొరగానట్టేనని ఎవరైనా నిరాశ పడడం సహజం. అందుకే- బ్యాటరీలు చార్జి అయ్యేందుకు ఎక్కువ సమయం నిరీక్షించే రోజులు తొందరలోనే కనుమరుగవుతాయని భరోసా ఇస్తున్నారు పరిశోధకులు. కెనడాకు చెందిన ‘వాటర్లూ’ పరిశోధకులు కొద్ది సెకన్లలోనే బ్యాటరీలను రీచార్జి చేసే ‘సూపర్ కెపాసిటర్’లకు రూపకల్పన చేశారు. వీటితో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, విద్యుత్ వాహనాలకు వాడే బ్యాటరీలను త్వరితగతిన రీచార్జి చేయవచ్చునని అంటున్నారు. సూపర్ కెపాసిటర్ల వినియొగం ఎంతో సురక్షితమైనదని, మన్నికైనదని, పైగా పర్యావరణానికి మేలు జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న సూపర్ కెపాసిటర్ల సామర్థ్యాన్ని పెంచితే ఇవన్నీ సాధ్యమంటున్నారు. ఇందుకోసం సూపర్ కెపాసిటర్లలో ‘లిక్విడ్ సాల్ట్’ను వినియోగిస్తామని, ఫలితంగా బ్యాటరీలోని ‘గ్రాఫేన్ షీట్ల’ మధ్య ఖాళీ పెరుగుతుందని అంటున్నారు. ఈ విధానం వల్ల చార్జింగ్‌ను నిల్వ ఉంచే బ్యాటరీ ఎలక్ట్రోలైట్‌గా మారుతుంది.