యువ

స్మార్ట్ఫోన్‌తో మెదడుకు చేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ఫోన్‌కు బానిసలవుతున్న యుక్తవయస్కుల్లో ఆతృత, నిద్రలేమి, మనోవ్యాకులత వంటి సమస్యలు అధికం అవుతుండగా, పిల్లలకు సంబంధించి మెదడులో అసమతౌల్యం ఏర్పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ‘రేడియోలాజిక్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా’కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని ప్రకటించారు. మరోవైపు దక్షిణ కొరియా విశ్వవిద్యాలయంలోని న్యూరో రేడియాలజీ శాస్తవ్రేత్త హ్యుంగ్ సుక్ కూడా స్మార్ట్ఫోన్ల వినియోగం ఫలితంగా పిల్లల్లో మెదడుకు చేటు కలుగుతోందని కనుగొన్నారు. స్మార్ట్ఫోన్, అంతర్జాలంతో కాలక్షేపం చేసే టీనేజీ వయసువారి మెదడు పనితీరును అధ్యయనం చేశాక పలు ఆందోళనకరమైన అంశాలు వెలుగుచూశాయి. మెదడులో అసమతౌల్యం ఉన్న టీనేజీ పిల్లలకు మానసిక శాస్తవ్రేత్తల ద్వారా కౌనె్సలింగ్ నిర్వహించారు. ఈ చికిత్సకు ముందు, తర్వాత మెదడులో రెండు రకాల న్యూరో ట్రాన్స్‌మీటర్లలో వ్యత్యాసం ఉన్నట్లు అధ్యయనంలో గమనించారు. మెదడులో న్యూరాన్లను చైతన్యవంతం చేసే ట్రాన్స్‌మీటర్, సంకేతాలను బలహీన పరిచే ట్రాన్స్‌మీటర్‌ను పరిశీలించాక తేడాలను గుర్తించారు. దృష్టి, కదలికలను నియంత్రించే న్యూరో ట్రాన్స్‌మీటర్‌పైనా స్మార్ట్ఫోన్ ప్రభావం పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.