యువ

జనవరిలో నోకియా-6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోకియా బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్‌లలో ఒకటైన నోకియా 6 మరోసారి మార్కెట్‌లో మెరవబోతోంది. దీనికి సంబంధించిన 2018 వేరియంట్ జనవరిలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఎచ్‌ఎండి గ్లోబల్ నేతృత్వంలో నోకియా బ్రాండ్ నుంచి విడుదలైన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్‌గా ‘నోకియా-6’ చరిత్ర సృష్టించింది. నోకియా 6 సక్సెసర్ వేరియంట్‌కు సంబంధించిన ఇమేజ్‌తోపాటు మోడల్ నెంబర్‌ను కూడా ఇటీవల అనధికారికంగా కొందరు వెల్లడించారు. ఆ ఇమేజ్ ప్రకారం నోకియా 6 (2018) వేరియెంట్ మోడల్ టిఎ 1054 మోడల్ నెంబర్‌తో రాబోతోంది. ప్రాంతాన్ని బట్టి ఈ మోడల్ నెంబర్ మారుతుంది. ఇదే మోడల్ నెంబర్‌తో వున్న నోకియా స్మార్ట్ఫోన్ ఒకటి చైనా కమ్యూనికేషన్స్ కమిషన్ డేటా బేస్‌లో కొద్దిరోజుల క్రితం దర్శనమిచ్చింది. అప్పట్లో ఈ మోడల్‌ను నోకియా 9గా భావించారు. అయితే అది నోకియా 6 అని ఇప్పుడు తేలింది.
నోకియా 6 కొత్త వర్షెన్‌కు సంబంధించి మెమరీ కన్‌ఫిగరేషన్ వివరాలు కూడా వెలుగుచూశాయి. ఈ డివైస్ 4 జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో రాబోతోంది. 3 జిబి ర్యామ్ +32 జిబి స్టోరేజ్, 4 జిబి ర్యామ్+ 64 జిబి స్టోరేజ్ వేరియెంట్లలో కూడా ఈ ఫోన్ లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిజైన్ పరంగా నోకి 5 (2018) వర్షన్ డ్యూరబుల్ ఇంకా స్టర్డీ బిల్డ్‌తో రానుందట. ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే ఈ ఫోన్‌కు మరో ప్రధానమైన హైలెట్‌గా నిలిచే అవకాశం ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సర్‌తోపాటు ఆన్‌స్క్రీన్ నేవిగేషనల్ బటన్స్ కూడా ఈ ఫోన్‌లో ఉంటాయి. స్నాప్‌డ్రాగన్ 660 సాక్‌పై ఈ ఫోన్ రన్ అయ్యే అవకాశం ఉంది.