యువ

జీవితాన్ని చదివింది! మార్పుకోసం పరితపిస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

30 ఏళ్ల ఈ అమ్మాయి పేరు ఇప్పుడు దేశమంతటా మార్మోగుతోంది. ముంబయిలో ‘క్రాంతి’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న రాబిన్ పేరు ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’కు ఎంపికైన తుది 10మంది జాబితాలో ఉండటమే దీనికి కారణం. ఇంతకీ ఎవరీ రాబిన్ చౌరాసియా?
ఇండోర్‌లో పుట్టి, అమెరికాలో పెరిగి పెద్దదైన రాబిన్... అమెరికన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా పనిచేసింది. అయితే లైంగిక వేధింపుల కారణంగా ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి, ముంబయి చేరుకుంది. అక్కడ వ్యభిచార వృత్తిలో చిక్కుకుని అల్లాడుతున్న యువతుల గురించి తెలుసుకుని చలించిపోయి ... వారికోసం మరికొందరితో కలసి ‘క్రాంతి’ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆమె సంరక్షణలో 18మంది యువతులు ఉన్నారు. వీరందర్నీ వ్యభిచార కేంద్రాల్లోంచి విడిపించి తీసుకొచ్చిందామె. శాంతాక్రుజ్‌లోని ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని, వారికి అందులో జీవిత పాఠాలు బోధిస్తోందామె. ఉదయం వేళల్లో యోగా, ధ్యానం, సంగీతం, సృజనాత్మక ఆలోచన, భౌగోళిక శాస్త్రం వంటి సబ్జెక్టులు బోధిస్తున్నారు. సాయంత్రాలు ఇంగ్లీషు, థియేటర్ ఆర్ట్స్, హెల్త్ ఎడ్యుకేషన్ వంటి అంశాల్లో పాఠాలు చెబుతున్నారు. అంతేకాదు, వారిని ఎగ్జిబిషన్లు, సినిమాలకూ రాబిన్ తీసుకువెళ్తుంది. తమ అనుభవాలపై రూపొందించిన ఓ నాటకాన్ని రాబిన్ ఆధ్వర్యంలో ఈ యువతులు అమెరికాలో ప్రదర్శించి, అందరి ప్రశంసలూ అందుకున్నారు.
‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’కు తన పేరు నామినేట్ కావడం ఇప్పటికీ తనకు ఆశ్చర్యంగానే ఉందంటుంది రాబిన్. ఈ అవార్డుకోసం ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలనుంచి 1800మంది దరఖాస్తు చేసుకున్నారట. ఈ బహుమతికోసం ఎంపికైన చివరి పది మంది పేర్లనూ ఇటీవల ప్రఖ్యాత శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకింగ్ ప్రకటించారు. ఆ జాబితాలో మూడో పేరు రాబిన్‌దే. ఈ బహుమతి గెలుచుకుంటే మిలియన్ డాలర్లు (సుమారు 6.7కోట్ల రూపాయలు) లభిస్తాయి. ఆ డబ్బు వస్తే చేయాల్సినవి చాలానే ఉన్నాయంటుంది రాబిన్. ‘మేం ఉండే ఇంటి పైకప్పు ఎప్పుడు ఎగిరిపోతుందా అని భయంగా ఉంది. అందరం కలసి కాఫీ తాగేందుకు కూడా మా వద్ద డబ్బుల్లేవు. ‘క్రాంతి’ నిర్వహణకు నెలకయ్యే ఖర్చు కనీసం మూడు లక్షల రూపాయలు. వీటన్నిటినీ భరించాలంటే గ్లోబల్ టీచర్ ప్రైజ్ వస్తే బాగుంటుంద’టోందామె. పడుపు వృత్తిలో చిక్కుకుని అల్లాడుతున్న పడతుల బాగుకోసం శ్రమిస్తున్న రాబిన్‌కు ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్ రావాలని ‘యువ’ మనసారా కోరుకుంటోంది. *