యువ

చవకైన 4జీ స్మార్ట్ఫోన్లు (కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు అన్నివర్గాల వారిలోనూ స్మార్ట్ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టు మార్కెట్లో రోజురోజుకూ కొత్తరకం స్మార్ట్ ఫోన్లు ప్రత్యక్షమవుతున్నాయి. వీటి ధరలకు సంబంధించి చూస్తే ఎన్నో వ్యత్యాసాలు కనబడుతుంటాయి. సంపన్నులు ఎంత ఖర్చుపెట్టి అయినా అత్యంత ఖరీదైన ఫోన్లు కొంటుంటారు. మధ్యతరగతి వారు మాత్రం స్మార్ట్ఫోన్‌మీద ఎక్కువగా ఖర్చు చేయలేరు. తక్కువ ధరల్లో లభించే ఫోన్లను వీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అందుబాటు ధరలో ఉండే ఫోన్‌లో మనం కోరుకునే ఫీచర్లు ఉన్నాయో లేవో అని బేరీజు వేసుకోవడం ఉత్తమం. బోలెడు ధర పెట్టి ఆ తర్వాత నిరుత్సాహపడే కన్నా ఫోన్లను కొనేముందు పలుకోణాల్లో ఆలోచించాల్సిందే.
షియోమీ రెడ్‌మి 4: అమెజాన్ వెబ్‌సైట్‌లో షియోమీ రెడ్‌మి 4 ధర రూ.6999. 5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపిఎస్ డిస్‌ప్లే విత్ 2.5కి కర్వ్‌డ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం ఎమ్‌ఐయుఐ 8, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్, 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2 జిబి, 3జిబి, 4జిబి), స్టోరేజ్ వేరియంట్స్ (16 జిబి, 32 జిబి, 64 జిబి), మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128 జిబి వరకు విస్తరించుకునే అవకాశం, కెమెరా 13 మెగా పిక్సల్, రియర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా, 4 జి ఓల్ట్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 4100 ఎంఎహెచ్ బ్యాటరీ.
షియోమీ రెడ్‌మి 4ఎ: ఫ్లిప్‌కార్ట్‌లో షియోమి రెడ్‌మి 4ఎ ధర రూ.6990. ఇందులో 5 ఇంచ్ హెచ్‌డి ఐపిఎస్ డిస్‌ప్లే, 1280/720 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్, 425 ప్రాసెసర్, అడ్రినో 308 గ్రాఫిక్స్ 2 జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 128 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మా, హైబ్రిడ్ డ్యూయెలఇ సిమ్ వంటి ప్రత్యేకతలున్నాయి.
షియోమీ రెడ్‌మి 5ఎ: 5ఎ రకం ఫోన్‌లో 8 జిబి ర్యామ్ ఉంటే దాని ధర రూ.6990, 2 జిబి ర్యామ్ రకమైతే ధర రూ.4990. రెడిమి 5ఎలో విశిష్ఠతలు.. 5 ఇంచ్ 720పి ఎల్‌సిడి డిస్‌ప్లే, 2/3 జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమరీ, 128 జిబి విస్తరణ సామర్థ్యం, 13 ఎంపి కెమెరా, 1080 పిక్సెల్‌తో వీడియో షూట్ సామర్థ్యం, 5 ఎంపి సెల్ఫీ షూటర్, ఆండ్రాయిడ్ నౌగట్ బేస్డ్ ఎంఐయుఐ9, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ, డ్యూయెల్ సిమ్ ఫోన్ సపోర్టు, 4జి ఓల్ట్ అండ్ యుఎస్‌బి ఒటిజి.
మోటో సి ప్లస్: ఫ్లిప్‌కార్డ్‌లో దీని ధర రూ.6990. 5 అంగఉలల హెచ్‌డి డిస్‌ప్లే, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 720/1280 పిక్సల్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 2 జిబి ర్యామ్, 16 జిబి ఇన్‌బిల్డ్ స్టోరేజ్, 128 జిబి వరకు ఎక్స్‌పాండబుల్ సోరేజ్, 8 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగా పిక్సల్ సెల్ఫీ, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ వంటివి ఇందులోని ఆకర్షణలు.