యువ

చూపు లేదు.. కానీ ముందు చూపుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనే దైవం
పనే నాకు దైవం. ఆఫీసుకు వచ్చిన వెంటనే అని గదుల్నీ కలియదిరగడం నాకు అలవాటు. మెషీన్లు చేసే చప్పుళ్లను నిశితంగా వింటాను. శబ్దాన్ని బట్టి వాటిలో లోపాలేమిటో గ్రహించడం నాకు దేవుడిచ్చిన వరం.
-శ్రీకాంత్

స్నేహశీలి
నా స్నేహితుడొకరు శ్రీకాంత్ గురించి చెప్పారు. అయితే స్వయంగా చూశాకే అతను ఎంతటి ప్రతిభావంతుడో అర్థమైంది. చూపులేని ఒక వ్యక్తి ఎంఐటిలో చదువుకోవడమే విశేషమైతే, స్వయంగా ఓ సంస్థను స్థాపించి, దానిని విజయవంతంగా నడపడం మరో విశేషం. అందుకే వ్యాపారంలో అతనితో చేతులు కలిపా. శ్రీకాంత్ ఎందరికో ఆదర్శప్రాయుడు. -ఎస్‌పి రెడ్డి,
బొలాంట్ ఇండస్ట్రీస్ డైరెక్టర్

దార్శనికుడు!
శ్రీకాంత్‌కు చూపు లేకపోవచ్చు. కాని చక్కటి దార్శనికత ఉంది. మార్కెట్ అవసరాలేమిటో అతనికి తెలిసినట్టుగా మరొకరికి తెలియవేమో అనిపిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్కెట్ వ్యూహాలు అల్లడంలో అతనికి అతనే సాటి.
-రవి మంథా,
బొలాంట్ ఇండస్ట్రీస్ డైరెక్టర్

పుట్టింది మచిలీపట్నానికి సమీపంలోని ఓ పల్లెటూర్లో!
రోజూ నాలుగైదు కిలోమీటర్లు నడచివెళ్లి చదువుకున్నాడు
పదో తరగతి పరీక్షల్లో 90శాతం మార్కులు సంపాదించాడు
ఇంటర్లోనూ అంతే...90శాతం మార్కులతనివే!
ఐఐటిలో చేరదామనుకుంటే కుదరదన్నారు
ఏకంగా అమెరికా వెళ్లి ఎంఐటిలోనే చదువుకుని వచ్చాడు
హైదరాబాద్‌లో ఓ కంపెనీ పెట్టాడు
లాభాలబాటలో నడిపిస్తున్నాడు
ఎందరికో ఉపాధి కల్పిస్తున్నాడు
- అతని పేరు శ్రీకాంత్ బొల్లా
- ఇందులో వింతేముంది... కాస్త తెలివితేటలు, మరికాస్త చదువుసంధ్యలు ఉన్నవాళ్లు చేసే పనే అది అనేగా మీ అభిప్రాయం? మిగతా వారినుంచి శ్రీకాంత్‌ను వేరు చేస్తున్నది అంశం ఒకటుంది. అది... అంధత్వం. అవును. శ్రీకాంత్ పుట్టుకతోనే అంధుడు. అయినా పట్టుమని పాతికేళ్లు కూడా రాకుండానే జీవితంలో ఎంతో సాధించాడు. తనలాంటివారెందరికో మార్గదర్శకుడయ్యాడు. స్ఫూర్తిదాయకమైన శ్రీకాంత్ జీవన ప్రస్థానం అతని మాటల్లోనే....
నేను పుట్టగానే చూపు లేదని తెలుసుకుని మా అమ్మానాన్న హతాశులయ్యారట. చుట్టుపక్కలనున్నవారు గొంతు నులిమి చంపేయమని సలహా ఇచ్చారట. కానీ నా తల్లిదండ్రులు అలా చేయలేదు. స్కూల్లో చేర్పించారు. మా ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నానికి వెళ్లి చదువుకునేవాణ్ని. నాతో ఎవరూ మాట్లాడేవారు కాదు. నన్ను వెనక బెంచీకే పరిమితం చేశారు. స్కూల్లో నా పరిస్థితి చూసిన నాన్న అక్కడినుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో అంధుల పాఠశాలలో చేర్పించారు. అక్కడే నా జీవితం మలుపు తిరిగింది. పదో తరగతి పరీక్షల్లో 90 శాతం మార్కులు సాధించాను. ఇంటర్‌లో సైన్స్ గ్రూప్ తీసుకోవాలన్నది నా కల. అయితే నాకు చూపు లేకపోవడంతో సైన్స్‌లో అడ్మిషన్ ఇవ్వం పొమ్మన్నారు. దాంతో కోర్టుకు వెళ్లాను. కోర్టు నన్ను సైన్స్ గ్రూప్‌లో చేర్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఓ ప్రత్యేక జివో జారీ చేసి, నన్ను సైన్స్‌లో చేర్చుకునేందుకు అంగీకరించింది. అయితే నేను సైన్స్‌లో నెగ్గుకురాలేనని అంతా అనుకున్నారు. కానీ మంచి మార్కులు తెచ్చుకోవడంద్వారా వారి అభిప్రాయం తప్పని నిరూపించాను.
ఐఐటిలో చేరదామనుకున్నాను. అక్కడా విధి వక్రించింది. అధికారులు కుదరదన్నారు. దాంతో ఆ ప్రయత్నం విరమించుకుని అమెరికాలోని ఎంఐటి, స్టాన్‌ఫోర్డ్, బర్క్‌లీ, కార్నెజీ మెలన్ వంటి ప్రతిష్ఠాత్మక వర్శిటీలకు అప్లయ్ చేశాను. ఎంఐటిలో సీటు రావడంతో అక్కడ చేరాను. ఎంఐటిలో చదువుకున్న మొట్టమొదటి అంధ విద్యార్థిని నేనే. ఓ సందర్భంలో అక్కడ పనిచేసే ప్రొఫెసర్ ఒకరు నాకు రెండు పేజీల ఓ ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఇప్పటికీ నాకు స్ఫూర్తిదాయకమే. ‘ఎంఐటి క్యాంపస్‌కు ఎంపిక కావడమే కాదు, ఎప్పుడూ క్లాస్‌లో ఫస్ట్ వచ్చేవాడివి. ఐయామ్ ప్రౌడాఫ్ యూ’ అంటూ ఆయన రాసిన లేఖ ఇప్పటికీ నావద్ద ఉంది. ఎంఐటిలో చదువు పూర్తిచేశాక మళ్లీ నా పరిస్థితి మొదటికి వచ్చింది. తిరిగి హైదరాబాద్ చేరుకున్నాను. అందరిలా ఏదో ఓ ఉద్యోగం చేసే బదులు కనీసం నాలాంటివారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలనిపించింది. అంగ వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకోసం ఓ సంస్థ పెట్టాను. మూడువేల మందికి చదువు, వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. నేర్చుకుంటారు సరే. తర్వాత వారి ఉద్యోగాల మాటేమిటి? అన్న ప్రశ్న నన్ను వేధించింది. దాంతో వారికోసమే బొలాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించాను. నా దగ్గర 450మంది పనిచేస్తున్నారు. వారిలో 70శాతం మంది అన్యప్రతిభావంతులే. వినియోగదారులకు ఉపయోగపడే డిస్పోజల్ వస్తువుల ఉత్పత్తిలో కొత్తపుంతలు తొక్కాం. విజయం సాధించాం. ఇదీ నా ప్రస్థానం’ అంటూ వివరించారు శ్రీకాంత్.
బొలాంట్ ఇండస్ట్రీస్‌ను తన గురువు, సహవ్యవస్థాపకురాలు స్వర్ణలతతో కలసి శ్రీకాంత్ ప్రారంభించి మూడేళ్లయింది. ఇప్పుడు బొలాంట్ ఇండస్ట్రీస్ దిగ్విజయంగా నడుస్తున్న పరిశ్రమల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.
*