యువ

మనిషా? రోబోనా? సింగపూర్ శాస్తవ్రేత్తల సృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషులకీ, రోబోలకీ మధ్య అంతరం చెరిగిపోతోంది. అచ్చం మనుషుల్లా పనిచేసే రోబోలు కూడా వచ్చేస్తున్నాయి. కాకపోతే, రూపురేఖల్లోనే తేడా. అయితే సింగపూర్‌కు చెందిన కొందరు శాస్తవ్రేత్తలు ఆ అంతరాన్ని కూడా చెరిపేశారు. అచ్చం మనిషిని పోలిన రోబోని సృష్టించి, అందర్నీ ఔరా అనిపించారు. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌కు వెడితే అక్కడ రిసెప్షనిస్ట్ సాదరంగా స్వాగతం పలికి, మీరొచ్చిన పనేంటో వాకబు చేస్తుంది. పరికించి చూస్తే గానీ ఆ రిసెప్షనిస్ట్ ఓ రోబో అని మీకు తెలీదు. అదే వర్శిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ నది యా థాల్మన్‌ను అచ్చు గుద్దినట్టుగా ఉండే రోబోను అక్కడి శాస్తవ్రేత్తలు తయారు చేసి, నదీన్ అని పేరు పెట్టారు. ప్రస్తుతానికి రిసెప్షనిస్ట్‌గానే ఉన్నా, నిజానికి నదీన్ ఓ చక్కటి రోబోటిక్ అసిస్టెంట్‌గా పనిచేస్తుందంటున్నారు వారు. కళ్లను ఆర్ప డం, ఎదుటివారితో మాట్లాడటం, వారు గతంలో మాట్లాడింది కూడా గుర్తుంచుకుని ప్రస్తావించడం, పేరూ, ఊరూ వంటి వివరాలన్నీ గుర్తు పెట్టుకోవడం లాంటివన్నీ నదీన్ చేస్తుందట. ఇంట్లోనూ, ఆఫీసులోనూ మీ వెంట ఉండే పర్సనల్ అసిస్టెంట్‌లాంటిదే ఈ రోబో అనీ, దీని జ్ఞాపకశక్తి కూడా మానవ మేధస్సును పోలి ఉంటుందని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు సింగపూర్ వర్శిటీ శాస్తవ్రేత్తలు.