యువ

సెల్‌లో టైప్ చేస్తే టీ షర్ట్‌పై ప్రత్యక్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నిమిషానికో కాప్షన్ మార్చుకోవచ్చు
* డిజిటల్లీ ఇంటరాక్టివ్ షర్ట్స్‌తో అద్భుతం
* బ్రాడ్‌కాస్ట్ కంపెనీ వినూత్న సృష్టి

ఓ కాటన్ క్లాత్‌పై సర్క్యూ ట్ బోర్డ్‌ను అమర్చి, దాన్ని ఓ ప్రత్యేకమైన రసాయనంతో టీ షర్ట్ లోపలి భాగంలో అమర్చాం. అలాగే ఎల్‌ఇడి బల్బ్స్ స్థానంలో సర్ఫేస్ వౌంటబుల్ డియోడ్ ఎల్‌ఇడిలను అమర్చాం. వీటి పరిమాణం ఒక మిల్లీమీటరే. ఒక షర్ట్‌లో 800 ఎస్‌ఎండి ఎల్‌ఇడిలు ఉంటాయి. అలాగే వీటిని బ్యాటరీతో అనుసంధానించి, దాన్ని సెల్‌ఫోన్‌కు కనెక్ట్ చేశాం. సెల్‌ఫోన్‌లో ఓ కాప్షన్ టైప్ చేస్తే, అది టీ షర్ట్‌పై ప్రత్యక్షమైంది,

బిటెక్ చదువుతున్న చైతన్య క్లాత్ స్టోర్‌లో కాలుపెట్టి గంటయింది. తెగవెతికేస్తున్నాడు.
అయినా ఒక్క టీ షర్టూ నచ్చడం లేదు. టీ షర్ట్ నచ్చితే దానిమీద ఉన్న కాప్షన్ నచ్చట్లేదు.
కాప్షన్ నచ్చితే టీ షర్ట్ నచ్చడం లేదు. ఏం చేయడం?

ఈ సమస్య టీనేజ్ కుర్రాళ్లందరికీ
ఎదురయ్యేదే! టీ షర్ట్ బాగుంటే దానిమీద ఉన్న కాప్షన్ బాగుండదు. హైదరాబాద్‌కు చెందిన ‘బ్రాడ్‌కాస్ట్’ కంపెనీ ఈ సమస్యకు పరిష్కారం కనుగొంది. కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టింది. ఆ కథా కమామీషు ‘యువ’ పాఠకులకు ప్రత్యేకం.
కుర్రాళ్లకు నచ్చిన కాప్షన్లనే టీ షర్ట్ మీద ప్రింట్ చేసి ఇస్తే పోలా?- ఇదీ బ్రాడ్‌కాస్ట్ కంపెనీ ప్రతినిధులకొచ్చిన ఆలోచన. అయితే ఇలాంటి కంపెనీలు చాలానే ఉన్నాయి. వందో రెండొందలో మనవి కావనుకుంటే నచ్చిన కాప్షన్‌ను ప్రింట్ చేసి ఇచ్చే కంపెనీలు బోలెడు. అయితే ఆ కాప్షన్లు పర్మనెంట్. వద్దనుకుంటే పోవు. బ్రాడ్‌కాస్ట్ కంపెనీ ప్రతినిధులు ఇందుకు భి న్నంగా ఆలోచించారు. కుర్రాళ్లు తమకు నచ్చిన విధంగా టీ షర్ట్‌లపై కా ప్షన్లను మార్చుకునేలా ఉండాలనుకున్నారు. అందుకోసం కసరత్తు మొదలెట్టారు. బ్రాడ్‌కాస్ట్ కంపెనీ ప్రతినిధి అయ్యప్ప నగుబండి మాట్లాడుతూ ‘డిజిటల్లీ ఇంటరాక్టివ్ టి షర్ట్ తయారు చేయాలనుకున్నాం. అదయితే ఏ కాప్షన్ కావాలంటే ఆ కాప్షన్‌ను, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే అదంత సులభం కాలేదు. ముందుగా టీ షర్ట్ లోపలి భాగంలో సర్క్యూట్ బోర్డ్, ఎల్‌ఇడి లైట్స్, బ్యాటరీ, బ్లూటూత్ చిప్‌ను అమర్చి వాటిని సెల్‌ఫోన్‌తో కనెక్ట్ చేయాలని భావించాం. వీటన్నిటినీ కనెక్ట్ చేస్తే అనుకున్న ఫలితం లభించింది. అయితే వాటిని షర్ట్ లోపలిభాగంలో అమర్చడమే పెద్ద సవాల్‌గా మారింది. ఎల్‌ఇడి బల్బ్స్ కాస్త పెద్దవిగా ఉండటంతో షర్ట్ లోపల వాటిని అమర్చి, షర్ట్‌ను ధరిస్తే చూడటానికి ఎబ్బెట్టుగా ఉంది. పైగా సర్క్యూట్ బోర్డ్‌ను సోల్డరింగ్ చేసేటప్పుడు క్లాత్ కాలిపోయేది. దీంతో ఓ కాటన్ క్లాత్‌పై సర్క్యూ ట్ బోర్డ్‌ను అమర్చి, దాన్ని ఓ ప్రత్యేకమైన రసాయనంతో టీ షర్ట్ లోపలి భాగంలో అమర్చాం. అలాగే ఎల్‌ఇడి బల్బ్స్ స్థానంలో సర్ఫేస్ వౌంటబుల్ డియోడ్ ఎల్‌ఇడిలను అమర్చాం. వీటి పరిమాణం ఒక మిల్లీమీటరే. ఒక షర్ట్‌లో 800 ఎస్‌ఎండి ఎల్‌ఇడిలు ఉంటాయి. అలాగే వీటిని బ్యాటరీతో అనుసంధానించి, దాన్ని సెల్‌ఫోన్‌కు కనెక్ట్ చేశాం. సెల్‌ఫోన్‌లో ఓ కాప్షన్ టైప్ చేస్తే, అది టీ షర్ట్‌పై ప్రత్యక్షమైంది. అలా మా ప్రాజెక్ట్ సక్సెస్ అయింది’ అంటూ వివరించారు అయ్యప్ప. ప్రస్తుతం బ్రాడ్‌కాస్ట్ కంపెనీ ప్రతి షర్ట్‌నూ స్వయంగా తయారుచేస్తోంది. ఫండ్స్ చూసుకుని, తయారీ యూనిట్‌ను పెట్టాలని భావిస్తోంది. ఒక్కో సర్క్యూట్ తయారు చేసేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతోందనీ, షర్ట్స్‌ను బయటనుంచే తీసుకువస్తున్నా, సర్క్యూట్ల తయారీయే అసలు సమస్యనీ అయ్యప్ప చెప్పా రు. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నామని, తమ టీ షర్ట్‌లకు డిమాండ్ పెరుగుతోందని ఆయన అన్నారు. సర్క్యూట్లు, బ్లూచిప్స్, ఎల్‌ఇడి వంటి హంగులుండటంతో వీటి ధర కాస్త ఎక్కువే మరి! *

chitram... ‘ఐలవ్ హైదరాబాద్’ కాప్షన్‌తో టీ షర్ట్