యువ

రోబోలు రోడ్డెక్కుతున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటివరకూ షాపింగ్ మాల్సూ, కార్పొరేట్ ఆఫీసులకు మాత్రమే పరిమితమైన రోబోలు ఇకపై రోడ్డెక్కనున్నాయి. రోడ్డెక్కడమే కాదు...వేడి వేడి పిజ్జాలు డెలివరీ చేయనున్నాయి. ఆశ్చర్చపోతున్నారా? నిజమండీ బాబూ! ఇందుకు ప్రఖ్యాత సంస్థ డోమినో రంగం సిద్ధం చేస్తోంది. ‘డోమినోస్ రోబోటిక్ యూనిట్’గా పిలుచుకునే ఈ డ్రైవర్‌లెస్ యూనిట్...న్యూజీలాండ్ ప్రభుత్వ సహకారంతో ఆస్ట్రేలియాలో తయారైంది.
ఫోటోలో చూస్తున్నారుగా...ఇది డ్రైవర్‌లెస్ రోబో కార్ అన్నమాట. షాప్‌నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఎవరు ఆర్డర్ చేసినా స్వయంగా తీసుకెళ్లి పిజ్జా అందజేస్తుంది. ఇందులోనే వేడి వేడి పిజ్జాలుంచేందుకు ఓ అర, చల్లటి కూల్‌డ్రింక్స్ ఉంచేందుకు మరో అర ఉంటాయి. బ్యాటరీల సాయంతో నడిచే ఈ రోబో, పరిమిత వేగంతో వెడుతుంది. ఇందుకు సెన్సర్లు తోడ్పడతాయి. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ రోడ్లపై చేసిన ప్రయోగ పరీక్షల్లో ఇది పిజ్జాలను విజయవంతంగా డెలివరీ చేసిందట. *