యువ

కూర్చునే ఉంటే కొంప మునుగుతుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూర్చునే పనిచేసేవారికంటే నిలబడి లేదా కాసేపు అటూ ఇటూ తిరుగుతూ పనిచేసేవారిలో గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం 34 శాతం తక్కువ. కూర్చుని పనిచేసేవారు పలు వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.
*********
కేవలం ఆఫీసులోనే కాదు...చాలా సందర్భాల్లో కూర్చునే పనిచేయాల్సి వస్తుంది. ఉదాహరణకు...డ్రైవింగ్, టీవి చూడటం వంటివి. కాబట్టి ఇతర సందర్భాల్లోనయినా నిలబడి పనిచేయడమే ఉత్తమమన్నది డాక్టర్ల మాట.
*********
వయసు పైబడినవారు రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు కూర్చునే అలవాటు ఉన్నట్టయితే ఛాతీ నొప్పి,
హార్ట్ ఎటాక్ వంటి హృద్రోగాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వ్యాయామమేమీ చేయకుండా, ఆఫీసు పని అలా ఉంచి, ఇతర వేళల్లో ఐదు గంటల సేపు కూర్చుని ఉండే
మగవారిలో కూడా గుండె సంబంధిత వ్యాధులకు లోనయ్యే ప్రమాదం
ఎక్కువగా ఉంటుందని
డాక్టర్ చంద్రభూషణ్ చెబుతున్నారు.

*********
కూర్చుని తింటే కొండలు కరిగిపోతాయో లేదో గానీ, కూర్చునే పనిచేస్తే మాత్రం కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగడం ఖాయం. రోగాల బారినపడటం తథ్యం- ఇది డాక్టర్లు చెబుతున్నమాట.
ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బెర్గ్ నిలబడి పనిచేయడానికే ప్రాధాన్యమిస్తాడట. పేరొందిన రచయితలు ఎర్నెస్ట్ హెమింగ్ వే, చార్లెస్ డికెన్సన్ నిలబడే తమ రచనావ్యాసంగాన్ని కొనసాగించేవారట. ఇలా ఎందుకంటే- ఆరోగ్యం కోసం.
*********
ఎవరైనా ఇంటికి రాగానే కూర్చొమనడం మన సంప్రదాయం. అప్పాయింట్‌మెంట్ లెటర్ పట్టుకుని ఆఫీసు గడప తొక్కగానే సీటు చూపిస్తారు. కూర్చుని పనిచేయమంటారు. ఇలా కూర్చోవడమే కొంపముంచుతోందంటే నమ్ముతారా మీరు? డాక్టర్లు మాత్రం అది నిజమేనంటున్నారు. గంటో, రెండు గంటలో కూర్చుంటే ఫరవాలేదు గానీ, గంటల తరబడి కూర్చునే అలవాటు ఉంటే మాత్రం ఒంటికి మంచిది కాదంటున్నారు.
ఈ నేపథ్యంలో స్టాండప్ డెస్క్ కల్చర్ పెరుగుతోంది. కార్పొరేట్ కార్యాలయాలు ఈ సంస్కృతిని అందిపుచ్చుకుంటున్నాయి. గంటల తరబడి పనిచేసే తమ ఉద్యోగుల సంక్షేమం కోసమే అవి స్టాండప్ డెస్క్‌లకు ప్రాధాన్యమిస్తున్నాయి.
గంటల తరబడి కూర్చుని పనిచేస్తే ఒబేసిటీ బారిన పడే ప్రమాదముంది. అంతేకాదు...శరీరంలో జీవక్రియ వేగం మందగిస్తుంది. కేలొరీలు కరిగే ప్రక్రియ సన్నగిల్లుతుందనేది డాక్టర్లు చేస్తున్న హెచ్చరిక. ఇలా అనారోగ్యం బారిన పడేవారిలో ఆఫీసుల్లో పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగులైతే కనీసం ఎనిమిది గంటలు కూర్చుని పనిచేస్తారు. అదే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లయితే పది, పనె్నండు గంటలు డెస్క్‌ముందు కూర్చుని ఉండాల్సిందే. ఇలా కూర్చునే ఉంటే ఒబేసిటీయే కాదు...డయాబెటీస్ బారిన పడే ప్రమాదమూ ఉందట. కూర్చుని ఉండేవారిలో బ్యాక్ సపోర్ట్ సరిగా లేకపోతే వెనె్నముక సంబంధిత సమస్యలూ తలెత్తుతాయి. దీనికి పరిష్కారమే స్టాండప్ డెస్క్. రిసెప్షనిస్ట్ మొదలు ఇతర ఉద్యోగులు కూడా స్టాండప్ డెస్క్‌ల వద్ద పనిచేయడమే బెటర్. అయితే గంటలకొద్దీ కూర్చుని పనిచేస్తే ఒకరకమైన అనారోగ్య సమస్యలు తలెత్తితే నిలబడి పనిచేస్తే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులు వచ్చే బెడద ఉంది. అయితే కూర్చుని పనిచేసే కంటే నిలబడి పనిచేయడమే బెటరన్నది డాక్టర్ల ఉవాచ. కావాలంటే మధ్యమధ్యలో కాసేపు కూర్చుని రిలాక్సయితే సరిపోతుందంటున్నారు. మరి మీరేమంటారు?
*

- డాక్టర్ చంద్రభూషణ్, గ్లోబల్ హాస్పిటల్స్