యువ

తడుస్తుంది... ఆరుతుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానలో తడవటం బాగానే ఉంటుంది. కానీ...వర్షం తగ్గాక తడిబట్టలతో తిరగాలంటే మాత్రం ఇబ్బందే. అయితే ఫాల్యాన్ అనే స్టార్టప్ కంపెనీ దీనికో చక్కటి పరిష్కారాన్ని కనిపెట్టింది. ఈ సంస్థ రూపొందించిన జాకెట్ వేసుకుంటే, హాయిగా వర్షంలో తడవచ్చు. వర్షం ఆగాక, జాకెట్ దానంతట అదే ఆరిపోతుంది. నమ్మలేకపోతున్నారు కదూ! అసలు కిటుకేమిటంటే...జాకెట్‌లోపల ఎయిర్ యాంప్లిఫయర్స్‌ను అమర్చారు. వాటిని ఓ చిన్నపాటి బ్యాటరీతో కనెక్ట్ చేశారు. స్విచ్ ఆన్ చేస్తే, ఈ యాంప్లిఫయర్స్ ద్వారా గాలి వేగంగా వెళ్లి జాకెట్‌ను ఆరేలా చేస్తుంది. అదీ సంగతి. ఈ జాకెట్‌కు తాత్కాలికంగా ఎస్‌డిజె-01 అని పేరు పెట్టారు. ప్రయోగ దశలో ఉన్న ఈ జాకెట్ ఏప్రిల్‌లో మార్కెట్లోకి వస్తుందట.