యువ

ఆకలి తీర్చే కల్పవృక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో వండుకున్న ఆహారం మిగిలిపోతే ఏం చేస్తాం? చాలామంది బయట పారేస్తారు. మరికొంతమంది ఎవరికైనా ఇవ్వాలన్నా వారు సమయానికి అందుబాట్లో ఉండకపోవచ్చు లేదా మిగిలిన ఆహారాన్ని నిల్వ చేసే వీలు లేకపోవచ్చు. ఈ సమస్యను అధిగమించి, అన్నార్తుల కడుపు నింపేందుకు కేరళకు చెందిన ఓ రెస్టారెంట్ యజమాని చక్కటి ఉపాయం కనిపెట్టాడు.
కోచిలో ‘పప్పడా వడ’ అనే రెస్టారెంట్ నడిపే మినూ పాలిన్ తన రెస్టారెంట్‌లోనే ఓ పబ్లిక్ ఫ్రిజ్ ఏర్పాటు చేశాడు. దీని పేరు ‘నన్మ మరం’. అంటే స్నేహ వృక్షం అని అర్థం. ఎవరైనా ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఇందులో భద్రపరచవచ్చు. ఆకలితో ఉన్నవారెవరైనా ఇందులోంచి ఆహారాన్ని తీసుకోవచ్చు. పాలిన్ తన వంతు కర్తవ్యంగా రోజూ ఇందులో 50 పాకెట్ల ఆహారాన్ని ఉంచుతాడు. బాగుంది కదూ ఈ ఏర్పాటు! అన్నార్తులకు ఈ స్నేహ వృక్షం ఇప్పుడు ఆకలి తీర్చే కల్పవృక్షమైంది.