S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/06/2019 - 04:35

నార్కట్‌పల్లి, మార్చి 5: నిత్యం విధి నిర్వహణే ప్రాణంగా భావిస్తూ సేవలందిస్తున్న ఎస్సై మధుసూదన్ (35) చివరికి విధి నిర్వాహణకోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల సమీపంలో చోటు చేసుకుంది.

03/06/2019 - 04:12

కరీంనగర్, మార్చి 5: రైతుల ఆమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి ట్రాక్టర్ రుణాలు ఇప్పిస్తామని నమ్మించి భూ పత్రాలు, ఆధార్ కార్డులు తీసుకొని వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి ఒక కోటి 20 లక్షల రుణాలు పొంది రైతులను మోసగించిన వైనం మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.

03/06/2019 - 03:38

హైదరాబాద్, మార్చ 5: టీటీడీ దేవస్థానంతో పాటు యాదగిరి గుట్ట, సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మోసగాడిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

03/06/2019 - 03:38

హైదరాబాద్, మార్చ 5: డేటాఎంట్రీ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచానాన్ని రూపొందిస్తానని నమ్మబలికి వెంకట్ ధీరజ్ అనే వ్యక్తి లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. ఒక్కరి నుంచి రెండు నుంచి మూడు లక్షలు వసూలు చేశాడు. దాదాపు రూ. 75 లక్షలు వసూలు చేసి తమకు ఇవ్వాల్సిన డేటా ఎంట్రీ ప్రాజెక్టు పనులు చేయలేదని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

03/06/2019 - 03:11

కొత్తకోట, మార్చి 5: వనపర్తి జిల్లా కొత్తకోటలోని ప్రధాన మూడు ఆలయాల్లో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు ఎస్ ఐ రవికాంత్‌రావు తెలిపారు. పట్టణ సమీపంలో ఉన్న వెంకటగిరి ఆలయం, కోట్ల ఆంజనేయస్వామి ఆలయం, సాయిబాబా మందిరంలో చోటికి పాల్పడ్డారు.

03/06/2019 - 02:16

పెద్దదోర్నాల, మార్చి 5 : శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని తమతమ ఇళ్లకు బయలుదేరిన వారు మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బోలేరో వాహనం బోల్తాపడిన సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గద్వాల, కర్నూలు, రాయచోటి ప్రాంతాల భక్తులు మహశివరాత్రి పండగ రోజు సోమవారం పార్వతీ పరమేశ్వర్లను దర్శించుకున్నారు.

03/06/2019 - 02:15

న్యూఢిల్లీ, మార్చి 5: వంశధార ట్రిబ్యునల్‌లో విచారణ బుధవారానికి వాయిదా పడింది. మంగళవారం జస్టిస్ ముకుందం శర్మ నేతృత్వంలోని వంశధార ట్రిబ్యునల్‌లో ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ప్రారంభమయ్యాయి. ఒడిశా తరపు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ నేరడి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి 106 ఎకరాల భూసేకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తగిన సమాచారం రాలేదని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు.

03/06/2019 - 01:50

కొత్తూరు రూరల్, మార్చి 5: రాత్రి సమయాల్లో వ్యవసాయ పొలాల వద్ద నుంచి పశువులను చోరీ చేసే నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ నందిగామ పోలీస్‌స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు.

03/06/2019 - 01:50

హైదరాబాద్, మార్చి 5: జలమండలి సరఫరా చేస్తున్న పైప్‌లైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన భవన యాజమానులపై జలమండలి విజిలెన్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నాచారం హౌసింగ్ బోర్డు కాలనీలోని సాయి నిలియం అపార్ట్‌మెంట్ యాజమానులు భవనానికి అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా తొలగించిన నల్లా కనెక్షన్ స్థానంలో జలమండలి అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తిరిగి అక్రమ నీటి కనెక్షన్ తీసుకున్నాడు.

03/06/2019 - 01:49

శంషాబాద్, మార్చి 5: స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఏటీఎంలో క్యాషియర్ మబ్దుల్ పాషా పదిహేడు లక్షల రూపాయలు పెట్టినట్లు తెలిపారు. ఏటీఎంలో డబ్బులు లేకపోవడంతో మేనేజర్ ఫోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఆర్‌జీఐ ఏ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్యాషియర్ మబ్దుల్ పాషా 17లక్షల నగదును ఏటీఎంలో పెట్టిన్నట్టు చెప్పి పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Pages