S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/02/2019 - 01:24

వికారాబాద్, మార్చి 1: వికారాబాద్ జిల్లా ఎస్పీ టీ.అన్నపూర్ణను బదిలీ చేస్తూ ఆమె స్థానంలో నూతన ఎస్పీగా ఎం.నారాయణను నియమిస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీగా పని చేస్తున్న అన్నపూర్ణను విజిలెన్సు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కార్యాలయానికి బదిలీ చేయగా, సీఐడీ ఎస్పీగా పని చేస్తున్న ఎం.నారాయణను వికారాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

03/02/2019 - 01:22

హైదరాబాద్, మార్చి 1: అబిడ్స్‌లో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు బయలుదేరిన చిన్నారిని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో అక్కడిక్కడే మృతిచెందింది. సంఘటన శువ్రారం ఉదయం అబిడ్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అబిడ్స్‌లోని రోజరీ కానె్వంట్‌లో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల దియా జైన్ (సోను) తండ్రి నరేశ్ జైన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై తన ఇంటి నుంచి పాఠశాలకు బయల్దేరింది.

03/01/2019 - 23:47

వెంకటాచలం, మార్చి 1 : రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కంటేపల్లి రైల్వే గేటు సమీపంలో జరిగింది. గూడూరు - నెల్లూరు రైలు మార్గంలో 159-12 వద్ద రైల్వే ట్రాక్ పై శుక్రవారం తెల్లవారుజామున రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

03/01/2019 - 23:13

సంతనూతలపాడు, మార్చి 1 : సంతనూతలపాడు పెట్రోల్ బంకు సమీపంలో నాగంబొట్లవారిపాలెం నుండి వరి ధాన్యంతో పేర్నమిట్టలోని సప్తగిరి రైస్‌మిల్లుకు వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సంఘటనా స్థలాన్ని స్థానిక పోలీసులు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

03/01/2019 - 22:55

తిరుపతి, మార్చి 1: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే లభించే అరుదైన అటవీ సంపద ఎర్రచందనమని దీని అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పీసీసీఎఫ్ మహ్మద్ ఇలియాస్ రిజ్వీ చెప్పారు. తిరుపతిలో శుక్రవారం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది.

03/01/2019 - 22:22

నందిపేట్, మార్చి 1: నందిపేట, అయిలాపూర్ మార్గమధ్యలో మెయిన్‌రోడ్డుపై శుక్రవారం మధ్యాహ్నం నిస్సాన్ టెరినో8081 నంబర్ గల వాహనం ప్రమాదవశాత్తు కల్వర్టుకు ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది. అయిలాపూర్ శివారు ప్రాంతం నుండి మెయిన్‌రోడ్డు మీదుగా నందిపేట వైపుకు అతివేగంగా వస్తున్న నిస్సాన్ వాహనము చింరాజ్‌పల్లి సమీపంలో కల్వర్టును ఢీకొట్టి లోయలో బోల్తాపడింది. అందులో నాలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు.

03/01/2019 - 22:15

సిరిసిల్ల, మార్చి 1: సిరిసిల్ల పట్టణంలో ఆర్థిక ఇబ్బందులతో పవర్‌లూం కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం స్థానిక బీవైనగర్ కార్మిక క్షేత్రంలో బొమ్మెన నారాయణ(60) అనే పవర్‌లూం కార్మికుడు ఇంటిలో ఉరి వేసుకుని బలవన్మరణం పొందాడు. మృతుడు నారాయణ స్థానిక వెంకంపేటలో పవర్‌లూంలపై కాటన్ వస్త్రాలను ఉత్పత్తి చేస్తాడు.

03/01/2019 - 05:05

నల్లబెల్లి, ఫిబ్రవరి 28: న్యూడెమోక్రసీ సూర్యం దళంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురం శివారు మురళినగర్ గ్రామంలో షెల్టర్ తీసుకుంటున్న న్యూడెమోక్రసీ సూర్యం దళంపై పోలీసులు దాడి చేసే ప్రయత్నంలో పోలీసుల రాకను పసిగట్టిన దళ సభ్యులు అక్కడి నుండి పారిపోయే ప్రయత్నంలో దళ కమాండర్ సూర్యంతో పాటు దళ సభ్యుడు లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

03/01/2019 - 01:03

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 28: మచిలీపట్నం శివారు గిలకలదిండిలో ఓ మైనర్ బాలికను గర్భవతిని చేసిన కామాంధుడి ఉదంతం ఇది. పోలీసుల కథనం ప్రకారం గిలకలదిండికి చెందిన లోహిత్ కృష్ణ స్వామి (30) అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను మూడు నెలల క్రితం మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ నేపధ్యంలో ఆ బాలిక గర్భవతి అయ్యింది. విపరీతమైన కడుపు నొప్పి రావటంతో బాలికను ఆస్పత్రిలో చూపించగా గర్భవతి అని తేలింది.

03/01/2019 - 00:58

పమిడిముక్కల, ఫిబ్రవరి 28: మండల పరిధిలోని మంటాడ బైపాస్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాకం మనోజ్ కుమార్ (27) మృతి చెందాడు. పోలీసుల వివరాలు ప్రకారం విజయవాడ వైపు నుండి వస్తున్న కారు మంటాడ బైపాస్ వద్ద గ్రామంలోని బైక్‌పై వెళుతున్న మనోజ్ కుమార్‌ను వేగంగా ఢీకొనటంతో మనోజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. పమిడిముక్కల పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తుననట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.

Pages