S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/06/2019 - 00:02

విశాఖపట్నం, మార్చి 5: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖలో సముద్ర స్నానాలు ఆచరిస్తూ ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. అలాగే సముద్రంలో స్నానాలు చేసే క్రమంలో ఆరుగురు వ్యక్తులు ఫిషింగ్ హార్బర్ జెట్టీ వద్ద సముద్రంలోకి దిగారు. వీరిలో ఒకరు గల్లంతయ్యారు. మహాశివరాత్రి పుణ్య స్నానాల కోసం పెదజాలరి పేట బాపూజీ నగర్‌కు చెందిన వీ సత్యసాయి ప్రసన్న (30) వైఎంసీఏ వద్ద సముద్రంలో దిగాడు.

03/05/2019 - 22:42

ఉరవకొండ, మార్చి 5 : మండలంలోని చిన్న ముష్టూరు గ్రామం వద్ద హంద్రీనీవా కాలువలోని పిల్ల కాలువలో రంజిత్ (7) ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చిన్న ముష్టూరు గ్రామానికి చెందిన బోయ నాగరాజు కుమారుడు బోయ రంజిత్ స్థానిక యూపీ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. రంజిత్, అతని స్నేహితుడు కలసి కాలువలో ఈతకు వెళ్లారు.

03/05/2019 - 22:42

గుమ్మఘట్ట, మార్చి 5 : మండలంలోని రంగసముద్రం గ్రామ సమీపంలో మంగళవారం ఆటో ఢీకొనడంతో ఆర్.కొత్తపల్లికి చెందిన మాల మారెప్ప(52) మృతి చెందాడు. ఏఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు మారెప్ప కొత్తపల్లి నుంచి ద్విచక్రవాహనంలో రంగ సముద్రం వస్తుండగా మార్గమధ్యంలో కర్నాటక నుంచి లగేజీ ఆటో టాటా ఎస్‌డీ ఢీకొంది. దీంతో మారెప్ప అక్కడిక్కడే మృతి చెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

03/05/2019 - 22:42

బుక్కరాయసముద్రం, మార్చి 5: బుక్కరాయసముద్రం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నంపల్లి గ్రామంలో మంగళవారం పురుగుల మందు తాగి వ్యక్తిఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. బుక్కరాయసముద్రం పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి.

03/05/2019 - 22:41

బుక్కరాయసముద్రం, మార్చి 5: బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం గ్రామ శివార్లలలో ఒక గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతున్నట్లు మంగళవారం స్థానికుల నుండి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్‌కు సమాచారం రావడంతో విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలం చేరుకొని మృతుని గురించి వివరాలను ఆరా తీసారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా వున్నాయి .

03/05/2019 - 05:04

నల్లజర్ల, మార్చి 4 : పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద సోమవారం తెల్లవారుజామున రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో మంటలు చెలరేగి, ఒక లారీ డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. నల్లజర్ల పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన సవరపు హరీష్ (25) క్వారీ టిప్పర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

03/05/2019 - 04:44

న్యూఢిల్లీ, మార్చి 4: యోగా గురు రామ్‌దేవ్‌పై చౌకబారు ఆరోపణలు చేస్తూ ఉన్న వీడియో లింక్‌లను తక్షణం తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఫేస్‌బుక్ యాజమాన్యాన్ని ఆదేశించింది. రామ్‌దేవ్‌తోపాటు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌పై వివిధ అంశాలతో కూడిన పనికిమాలిన, చౌకబారు ఆరోపణలు, బెదిరింపులతో కూడిన వీడియోలను వెంటనే గూగుల్, యూట్యూబ్‌ల నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది.

03/05/2019 - 04:44

న్యూఢిల్లీ, మార్చి 4: మహాత్మాగాంధీ హత్య కేసుపై మళ్లీ దర్యాప్తు చేయాలని వచ్చిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పూజ్య బాపూజీ హత్య వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దీనిపై మళ్లీ దర్యాప్తు చేపట్టాలని ముంబయికి చెందిన పంకజ్ ఫడ్నిస్ అనే పరిశోధకుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

03/05/2019 - 03:57

హైదరాబాద్, మార్చి 4: ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రవళి (22) సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. వరంగల్ నగరంలో గత బుధవారం ఉదయం రవళి హాస్టల్ నుంచి స్నేహితులతో కలిసి కళాశాలకు వెళ్తుండగా అదే కాలేజీకి చెందిన బీకాం ఫైనలియర్ చదువుతున్న పెండ్యాల సాయి అనే్వష్ అడ్డుకుని, రెచ్చిపోయి అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు.

03/05/2019 - 03:56

పొదలకూరు, మార్చి 4 : సంచలనం సృష్టించిన ఓట్ల తొలగింపు ప్రక్రియ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలాన్ని తాకింది. మండలంలో వివిధ గ్రామాలకు చెందిన ఓట్లను తొలగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చిన ఆరోపణలపై రెవెన్యూ శాఖ లోతుగా విచారణ చేపట్టింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలిలా ఉన్నాయి.

Pages