S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/30/2016 - 21:46

గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా
వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ దిశాపటానికి ఇక్కడ అనుకున్నంతగా కెరీర్ ముందుకు
సాగలేదు. రెండు మూడు సినిమా అవకాశాలు వచ్చినట్టే వచ్చి

01/30/2016 - 21:43

గత ఏడాది ప్రారంభంలో నందమూరి కల్యాణ్‌రామ్ సరసన ‘పటాస్’ చిత్రంలో
నటించి మంచి విజయాన్ని అందుకుంది శృతి సోథి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో
తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తరువాత
చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు ఈ భామకు. తాజాగా ఓ చిత్రంలో ప్రత్యేక పాటలో
నర్తించనుందట. మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ హీరోగా అనీల్ రావిపూడి

01/30/2016 - 21:41

‘అత్తారింటికి దారేది’ సినిమామ తరువాత కన్నడ భామ ప్రణీతకు పలు అవకాశాలతోపాటు క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామకు ఇపుడు కష్టాలు మొదలయ్యాయి. దానికి కారణం ఏమిటంటే, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. నాలుగు భాషలకు చెందిన సినీతారల క్రికెట్‌లో కన్నడ భామ అయిన ప్రణీత తెలుగు టీమ్‌కు సపోర్టు చేయడంతో కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు.

01/30/2016 - 21:41

సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టాడు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ చిత్రాల క్రేజ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఫిబ్రవరి మొదటివారంలో సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే బిజినెస్ విషయంలో సంచలనం సృష్టిస్తోంది.

01/30/2016 - 21:39

తాను ‘్ఫతూర్’ చిత్రంలో కేవలం హెయిర్ స్టైలింగ్ కోసమే 55 లక్షలు నిర్మాతతో ఖర్చుపెట్టించానని, రెడ్ కలర్‌లో వున్న జుట్టును విరబూయించడానికి స్క్రీన్‌పై అది అందంగా కనపడడానికి ఎంతో కష్టపడ్డానని కథనాలు వింటున్నానని, అవన్నీ వింటుంటే నవ్వు వస్తోందని అంటోంది బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్.

01/30/2016 - 21:38

ఈ సంక్రాంతి పండక్కి సోగ్గాడిగా వచ్చిన నాగార్జున మంచి విజయాన్ని అందుకుని
జోరుమీదున్నాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి
విజయాన్ని అందుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో రెండు పాత్రల్లో నటించిన నాగార్జునకు బంగార్రాజు పాత్ర బాగా నచ్చింది. దాంతో బంగార్రాజు పాత్రను ప్రధానంగా

01/30/2016 - 21:36

ఎన్టీఆర్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని నిర్మించారు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్‌తోపాటు భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సందర్భంగా నిర్మాత భోగవల్లి ప్రసాద్ చెప్పిన విశేషాలు...

01/30/2016 - 21:34

రాజ్‌తరుణ్, అర్తన జంటగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రం ఈనెల 29న విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది.
ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీనివాస్ గవిరెడ్డి. ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ రన్ అవుతున్న సందర్భంగా శ్రీనివాస్ గవిరెడ్డి చెప్పిన విశేషాలు...
మంచి రెస్పాన్స్

01/30/2016 - 21:33

శుభకరి క్రియేషన్స్ పతాకంపై సందీప్, విజయభాస్కర్, ఆనంద్, పూజిత, సారిక, పావని ప్రధాన తారాగణంగా గణమురళి శరగడం దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్ రూపొందించిన చిత్రం ‘నినే్న కోరుకుంటా’. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని తూరుపు జగ్గారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా మంచి విజయం సాధించి దర్శక నిర్మాతలకు పేరు తేవాలని కోరుకున్నారు.

01/29/2016 - 22:07

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది
అందాల భామ శ్రుతిహాసన్. లెజెండరీ నటుడు కమల్ నట వారసత్వాన్ని

Pages