S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2018 - 20:50

బుల్లితెరపై యాంకర్‌గా, గ్లామర్ గాళ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, అటు సినిమాల్లో కూడా తనదైన హవా చాటుకుంటోంది. ఇటీవలే రామ్‌చరణ్ రంగస్థలంలో రంగమ్మత్తగా కీలక పాత్ర పోషించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా తరువాత అనసూయకు వరుస అవకాశాలు క్యూకట్టాయి. ప్రస్తుతం చాలా అవకాశాలు వస్తున్నాయని, అయితే పాత్ర నచ్చితేనే సినిమా చేస్తానని చెప్పింది.

06/17/2018 - 20:48

నారా రోహిత్, కృతిక, నీలం ఉపాధ్యాయ హీరో హీరోయిన్లుగా కార్తికేయ దర్శకత్వంలో శ్రీ శంకు చక్ర ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం.2 చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ- ఇటీవలే జరిగిన షెడ్యూల్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం పాల్గొనగా, కీలక సన్నివేశాల చిత్రీకరణతో షూటింగ్ పూర్తయ్యింది.

06/15/2018 - 21:22

అభిషేక్ కనె్నలూరు, మధుప్రియ, ప్రజ్వల్, మమతా శ్రీ హీరో హీరోయిన్లుగా రవి ములకలపల్లి స్వీయ దర్శకత్వంలో వసుంధర క్రియేషన్స్ పతాకంపై తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న ‘శీను వేణు. వీళ్ళు మంచి కిడ్నాపర్లు’ అన్నది ఉప శీర్షిక. చిత్రం శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్‌లో ప్రారంభం అయింది.

06/15/2018 - 21:18

సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టయిల్ మార్చాడు. ఒక సినిమా పూర్తికాకుండానే రెండో సినిమాకు ఓకె చెప్పేస్తున్నాడు. ఇంతకుముందు రెండేళ్లకో సినిమా చేస్తుండేవాడు. ఒక సినిమా విడుదలైన చాలా రోజుల తరువాతగానీ ఇంకోదానికి ఓకె చెప్పేవాడు కాదు. కానీ ఇపుడు వరసగా సినిమాలు చేయడానికి డైరక్టర్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. రజనీకాంత్ హీరోగా దర్శకుడు శంకర్ 2.0 సినిమా షూటింగ్ ఎన్నో నెలల క్రింద మొదలెట్టారు.

06/15/2018 - 21:15

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో మంచి జోరుమీదున్నాడు. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్‌లో నటిస్తున్న ఆయన తాజాగా మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాడు. అందులో సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కే 5వ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్‌అయింది. ఈ సినిమాకు జెర్సీ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో క్రికెట్ కిట్...

06/15/2018 - 21:11

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీమేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు, వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్’. ఐ లవ్ యు అనేది ఉప శీర్షిక. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

06/15/2018 - 21:09

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఓ భారీ షెడ్యూల్ జరుగుతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

06/15/2018 - 21:06

దాసరి నారాయణరావు రైటర్‌నుండి డైరెక్టర్ అయ్యారు. జంధ్యాల, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి మొదలైనవారు రచయితల నుండి దర్శకులుగా మారి సక్సెస్‌ అయ్యారు. అదే బాటలో డైమండ్ రత్నబాబు కూడా రైటర్‌నుండి దర్శకుడిగా మారబోతున్నారు.

06/15/2018 - 21:04

కార్తీ నటించిన ‘చినబాబు’ సినిమా ఆడియోను జూన్ 23న విడుదల చేయబోతున్నారు. జూలై 13న చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. కార్తీ సరసన సయేషా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులముందుకు వస్తోంది. ఈ మూవీలో యాక్షన్‌తోపాటు కామెడీ ఉండబోతోంది. కార్తీ ఈ మూవీలో రైతు పాత్రలో కనిపించబోతున్నాడు.

06/15/2018 - 21:02

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈమధ్య హాలీవుడ్ సినిమాలే కాక న్యూయార్క్ నగరంలోనే నివాసం కూడా వుంటోంది. అక్కడే ఒక పాపులర్ సింగర్ నిక్ జోన్స్ అనే వ్యక్తితో ప్రేమలో వుందని ఊహాగానాలు కూడా వున్నాయి. బాలీవుడ్ మాత్రం ఈమె రాకకై ఎదురుచూస్తోంది. ప్రొడ్యూసర్లు కూడా ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు సరే అంటున్నారు. ఇదిలా వుండగా ఈమె ఇప్పుడు సల్మాన్‌ఖాన్‌తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది.

Pages