S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/14/2018 - 00:11

దుల్కర్ సల్మాన్, నేహాశర్మ, ధన్సిక హీరోహీరోయిన్లుగా బెజోరు నంబియార్ దర్శకత్వంలో మలయాళంలో రూపొంది హిట్ అయిన సినిమా ‘సోలో’. ఈ చిత్రాన్ని వెంకటసాయి ప్రియాన్నీ క్రియేషన్స్ పతాకంపై వెంకటేష్ గాజుల తెలుగులో ‘అతడే’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదలయంది. అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి పాటల సీడీలను విడుదల చేశారు.

06/14/2018 - 00:10

యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్‌తో అత్యంత భారీ వ్యయంతో 4 భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా సాహో చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ మరియు పాకెట్ సినిమా సంయుక్తంగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రినె్సస్ నిహారిక కొణిదెల జంటగా నిర్మిస్తున్న సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’ యువి క్రియేషన్స్ బ్యానర్‌లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ నటిస్తున్నారు.

06/14/2018 - 00:09

నందమూరి కళ్యాణ్‌రామ్ కెరీర్ ప్రారంభం నుండి ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటూ స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య వరుస పరాజయాలతో టెన్షన్ పడ్డ ఆయన కొన్ని రోజుల గ్యాప్ తరువాత ‘పటాస్’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అటు మాస్, ఇటు యాక్షన్ అంటూ అన్ని జోనర్‌లో సినిమాలు చేస్తున్న కళ్యాణ్‌రామ్ మొదటిసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు.

06/14/2018 - 00:07

సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ సినిమా సంచలన విజయం సాధించింది. నటిగా కీర్తి సురేష్‌కు, దర్శకుడిగా నాగ్ అశ్విన్‌కు ఎనలేని గుర్తింపును తీసుకువచ్చింది. రెండో చిత్రంతోనే ఇలాంటి ప్రాజెక్టును చేపట్టిన నాగ్ ప్రతిభను చూసి స్టార్ డైరెకర్లే కాకుండా స్టార్ హీరోలు సైతం ప్రశంసల వర్షం కురిపించారు.

06/14/2018 - 00:13

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన విజేత సినిమా టీజర్ నిన్న విడుదలై ఆడియన్స్‌నుండి మంచి రెస్పాన్స్ పొందింది. యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉండడమే కాకుండా 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి. టీజర్‌లో కళ్యాణ్‌దేవ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ చక్కగా కనబరిచాడు.

06/14/2018 - 00:05

తెలుగు అమ్మాయి అదితిరావు హైదరి పుట్టింది హైదరాబాద్‌లోనే అయినా పెరిగింది మాత్రం నార్త్ ఇండియాలో. మోడలింగ్ నుండి హీరోయిన్‌గా ఎదిగిన ఈమె హిందీతోపాటు సౌత్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ సుధీర్‌బాబు సరసన నటిస్తోంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో అదితిరావు హైదరి చెప్పిన విశేషాలు..
సమ్మోహనం..

06/12/2018 - 21:36

30ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతోమంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్. ఈయన తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు.

06/12/2018 - 21:40

శ్రీ వైష్ణోదేవి మూవీస్ పతాకంపై నారాయణ భట్ సమర్పించు చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. కన్నడ ఫేమ్స్ రాగిణీ ద్వివేది, మేఘనరాజ్, దీప్తి, ప్రధమప్రసాద్, సంయుక్త హోర్నాడ్‌లు నటించగా.. సి.పుట్టుస్వామి నిర్మాతగా వ్యవహరించారు. మహేష్ దర్శకుడు. ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం విడుదలచేశారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మహేష్ మాట్లాడుతూ..

06/12/2018 - 21:41

సంతానం, అంచల్‌సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాంబాల దర్శకత్వంలో రూపొందిన ‘దిల్లుడు దుడ్డు’ చిత్రాన్ని ‘శ్రీకృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటరాజ్ ‘దమ్ముంటే సొమ్మేరా’ టైటిల్‌తో అనువదించి తెలుగులో విడుదల చేస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకుని ఈనెల 22న రిలీజ్ అవుతుంది.

06/12/2018 - 21:28

అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బంగార్రాజుగా నాగ్ బాగా ఆకట్టుకున్నాడు. ఈ పాత్ర ఆయనకు బాగానచ్చేసింది. దాంతో బంగార్రాజు టైటిల్, పాత్రతో సీక్వెల్ చేయాలనీ ప్లాన్‌ చేసాడు. అప్పట్లో వేరే కమిట్‌మెంట్స్‌వల్ల కుదరలేదు కానీ.. తాజాగా దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

Pages