S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/16/2017 - 20:42

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 61వ సినిమాను అట్లీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులో విజయ్‌ది త్రిపాత్రాభినయం. దీనికోసం ఒక్కో పాత్రకు ఒక్కో హీరోయిన్‌ను నిర్ణయించారు. ముందుగా మొదటి హీరోయిన్ నిత్యామీనన్‌పై సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇక రెండో విజయ్ పాత్రకు జోడీగా కాజల్ నటిస్తోంది. ప్రస్తుతం విజయ్, కాజల్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

05/16/2017 - 20:41

హాట్ హాట్ అందాలతో అందరినీ పడేసిన ప్రియాంక చోప్రా ఇప్పటికే హాలీవుడ్‌లో ‘బేవాచ్’తో ఎంట్రీ ఇచ్చి అక్కడి జనాలను ఆకట్టుకుంది. ఈనెల 25న విడుదలవుతోన్న చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్న ప్రియాంక, హాలీవుడ్‌లో బ్రేక్ కోసం కాస్త హాట్‌గానే కనిపించిందని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో ఆమె చేసిన కొన్ని సీన్లు అప్పుడే వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్‌లో కెరీర్ బ్రేక్ కోసం ప్రియాంక వ్యూహం ఫలించినట్టే కనిపిస్తోంది.

05/14/2017 - 20:59

సంచలనాలు క్రియేట్ చేయడంలో వర్మ తర్వాతే ఎవరైనా. ముఖ్యంగా నేర సంబంధ వాస్తవ సంఘటనల నేపథ్యంలో సినిమాలు తీయడంలో ఆయనది అందె వేసిన చేయి. ఇప్పటికే పలు చిత్రాలతో సంచలనం రేపిన వర్మ మరో ప్రాజెక్టుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈసారి ఆయన తెరకెక్కించే జీవిత కథ ఎవరిదో తెలుసా! మహాత్మా గాంధీని హత్యచేసిన గాడ్సేది కావడం విశేషం. ఈ విషయాన్ని ఇటీవలే సర్కార్-3 ప్రమోషన్‌లో చెప్పాడు.

05/14/2017 - 20:58

బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్‌కు పరిమితమైన అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. భారతదేశం మొత్తం ఉన్న అభిమానులు ఆయనపై మక్కువ పెంచుకుని ఏ చిత్రం విడుదలైనా దాన్ని హిట్ చేస్తారు.

05/14/2017 - 20:57

ఒక భాషలో హిట్టయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం ఇవాళ కొత్తేమీ కాదు. ఇదివరకే చాలా సినిమాలు చాలా భాషల్లో రీమేక్ అయ్యాయి కూడా. పెద్ద హీరోలు ఇప్పుడు రీమక్‌లే సేఫ్ అని ఫీలవుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ మరో రీమేక్ సినిమాలో నటించేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

05/14/2017 - 20:55

ఆ హీరో అంటే చాలా ఇష్టం. ఒకవేళ డేటింగ్ చేయాల్సి వస్తే అతనితోనే చేస్తానంటోంది గ్లామర్ భామ రకుల్ ప్రీత్‌సింగ్. ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వరస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు టాప్ హీరోయిన్ రేసులో ఉంది. ప్రస్తుతం మహేశ్ సరసన స్పైడర్ చిత్రంలో నటిస్తున్న రకుల్, వెంటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో పరిచయమై వరస అవకాశాలతో స్టార్ రేంజ్‌కి చేరింది.

05/14/2017 - 20:53

నిఖిల్, రీతువర్మ జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రం కేశవ. చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. టి న్యూస్ ఎండి సంతోష్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుణశేఖర్, శర్వానంద్, సి కల్యాణ్, సుధాకరరెడ్డి, వెనె్నల కిశోర్, కృష్ట చైతన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్మాత సి కల్యాణ్ మాట్లాడుతూ అభిషేక్‌కు సినిమా అంటే పిచ్చి.

05/14/2017 - 20:50

కుమారి 21 ఎఫ్ తర్వాత హెబ్బాపటేల్‌కు అనూహ్యమైన క్రేజ్ పెరిగింది. ఈ సినిమా తర్వాత ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. గ్లామర్‌తోపాటు నటిగా గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా వరస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈమధ్యే మిస్టర్ సినిమాలో నటించిన ఈమె ప్రస్తుతం అంధగాడు, ఏంజిల్ చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాల తర్వాత హెబ్బా మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

05/14/2017 - 20:48

సుజాతా ఆర్ట్స్ పతాకంపై గగన, సిద్ధార్థ్ జంటగా అరుంధతి శ్రీను దర్శకత్వంలో బెజవాడ నాగేశ్వర రావు నిర్మిస్తోన్న చిత్రం ‘అమరావతి అమ్మాయి’. అచ్చమైన తెలుగింటి ప్రేమకథగా రూపొందిస్తున్న ఈ చిత్రం 26నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఆద్యంతం అమరావతి పరిసరాల్లోనే షూటింగ్ జరుపుతామని, తెలుగుదనం ఉట్టిపడే ఈ చిత్రాన్ని రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తామన్నారు.

05/14/2017 - 20:46

రామ్, మేఘా అక్ష, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం వైజాగ్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ ఇదివరకే హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేశాం. కొన్ని రోజులుగా వైజాగ్‌లో జరుగుతున్న షెడ్యూల్ కూడా పూరె్తైంది.

Pages