S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/14/2017 - 20:45

నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా అన్నపూర్ణ సినీ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రూపొందిస్తున్న చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఈనెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. సినిమాకు సంబంధించిన థియేటర్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

05/14/2017 - 20:43

అభిమానులు హద్దులు దాటితే హీరోకు కష్టాలు తప్పవు. స్క్రీన్ వెనుక హీరోయజాన్ని ఎలివేట్ చేసేది అభిమానగణమే అయనా, ఒక్కోసారి శ్రుతిమించే వ్యవహారాల వల్ల ఇబ్బందులు తప్పవు. హీరోల సినిమాల విడుదలైనపుడు అభిమాన సంఘాలు చేపట్టే పాలాభిషేకాలు లాంటి సాత్విక చర్యలే కాదు, జంతుబలులు లాంటి మితిమీరిన హింసా కార్యక్రమాలూ ఇప్పటికే చూశాం.

05/13/2017 - 21:26

వెయ్యి కోట్లు వసూలు చేసిన బాహుబలితో రాజవౌళి సంచలన దర్శకుడైపోయాడు. ప్రస్తుతం విదేశాల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న రాజవౌళి, ఓ మంచి ఎంటర్‌టైనర్ చిత్రంతో రావడానికి కసరత్తులు చేస్తున్నాడన్న టాక్ పరిశ్రమలో మొదలైంది. ప్రస్తుతం టాప్ స్టార్ హీరోల్లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న మహేష్‌బాబుతో ఓ చిత్రాన్ని రూపొందించడానికి రంగం సిద్ధమైందన్నది కొత్త కథనం.

05/13/2017 - 21:23

సౌత్‌లో ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న
గ్లామర్ భామ కాజల్‌కు ఈమధ్య కాస్త బ్రేక్ పడ్డట్టుంది.
ప్రస్తుతం రానా సరసన ఒక చిత్రంలో నటిస్తున్న కాజల్, మరోవైపు

05/13/2017 - 21:17

యువ హీరో శర్వానంద్, లావణ్య త్రిపాఠి జంటగా చంద్రమోహన్ దర్శకత్వంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై భోగవల్లి బాపినీడు నిర్మించిన ‘రాధ’ ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు భోగవల్లి ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల విడుదలైన రాధ చిత్రానికి అనూహ్య స్పందన వస్తోంది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ బాగుందన్న ప్రశంసలు అందుతున్నాయి.

05/13/2017 - 21:13

ఆర్.జె.సినిమాస్ పతాకంపై లేడీ డైరెక్టర్ బి.జయ దర్శకత్వంలో నూతన నటీనటులతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వైశాఖం’. బి.ఎ.రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే విడుదలై ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందిస్తున్న వాలిశెట్టి వెంకట సుబ్బారావు చెప్పిన విశేషాలు...

05/13/2017 - 21:10

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. భారీ సెట్‌లో గత నెల రోజులుగా ఏకధాటిగా షూటింగ్ జరుపుతున్నారు. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తరువాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే చిత్రాన్ని అత్యంత భారీస్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

05/13/2017 - 21:08

శివగామిగా అద్భుత నటనతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ, మాతంగిగా తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. కన్నన్ తొమరకులమ్ దర్శకత్వంలో మలయాళంలో తెరకెక్కిన చిత్రాన్ని మాగ్నమ్ ఓపస్ మూవీ పతాకంపై మాతంగిగా తెలుగులో విడుదల చేస్తున్నారు. జయరాం, సంపత్, అక్షర కిశోర్, ఓంపురి కీలక పాత్రలు పోషించిన చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంలో నిర్మాతలు మీడియాకు వివరాలు వెల్లడించారు.

05/13/2017 - 21:05

రాహుల్, మహిమా మక్వానా జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్, బహుమాన్య ఆర్ట్స్ పతాకంపై తూము ఫణికుమార్, శ్రేయా శ్రీనివాస్ నిర్మించిన ‘వెంకటాపురం’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోన్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హీరో రాహుల్ మాట్లాడుతూ- సినిమా విడుదలకు ముందు చాలా టెన్షన్ పడ్డాను.

05/13/2017 - 21:02

నయనతార కథానాయికగా మలయాళంలో రూపొందించిన ‘పుదియ నియమం’ చిత్రాన్ని తెలుగులో ‘వాసుకి’గా అనువదించారు. శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్‌ఆర్ మోహన్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటుగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు వరుణ్‌తేజ్ శుక్రవారం ఉదయం విడుదల చేశారు.

Pages