S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/07/2017 - 09:53

విజయ్ సేతుపతి, రితికాసింగ్ జంటగా తమిళంలో రూపొందిన అండవన్ కట్టాళై చిత్రాన్ని మారుతీ టాకీస్, ఏవిఎస్ స్టుడియో పతాకాలపై లండన్ బాబులు పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. చిన్ని కృష్ణ దర్శకత్వంలో దర్శకుడు మారుతి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ సందర్భంగకా నిర్మాత మారుతి మాట్లాడుతూ తమిళంలో విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది.

05/07/2017 - 09:52

ప్రస్తుతం వరసగా సినిమాల్లో నటిస్తుండటం ఆనందంగా ఉంది. ముఖ్యంగా రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా భిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నందుకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి అంటున్నాడు సందీప్ కిషన్. బర్త్‌డే సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎనిమిదేళ్ల సినిమా కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశానన్న సంతృప్తి ఉందని, ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నట్టు చెప్పారు.

05/07/2017 - 09:51

సాంబ, యోద, కిరణ్, పావని ప్రధాన పాత్రల్లో వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రాజ్యలక్ష్మి సి నర్సింహులు పటేల్ నిర్మిస్తున్న చిత్రం లావణ్య విత్ లవ్‌బాయ్స్. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన విజయబాబు మాట్లాడుతూ గేయ రచయితగా మంచి పేరున్న వడ్డేపల్లి కృష్ణ చాలాకాలం తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. చిన్న సినిమా అయినా అందులో విషయం ఉంటే పెద్ద విజయం సాధిస్తుంది.

05/07/2017 - 09:51

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న తరువాత నేను చాలామందికి దూరమై విభిన్నంగా కనిపిస్తున్నాననే భావన కలిగింది. ఇన్నాళ్లూ మీలో ఒకడిగావున్న నన్ను ఈ పురస్కారం దూరం చేస్తోందా? అనిపిస్తోంది. ఈ అవార్డు తీసుకుని ఒకేసారి హైజంప్ చేసానని రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి వ్యాఖ్యానించారు. అది నిజమేనేమో అనిపిస్తోంది కూడా’ అంటున్నాడు కళాతపస్వి కె విశ్వనాథ్.

05/07/2017 - 09:50

బాహుబలి -ది కంక్లూజన్ చిత్రంలో జాతీయస్థాయి నటుడిగా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యుఎస్ హాలిడేలోవున్న ప్రభాస్, ట్రిప్ నుండి తిరిగిరాగానే ‘సాహో’ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. దాంతోపాటే ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణన్ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఒక సినిమా చేయనున్నాడని ఇండస్ట్రీ టాక్.

05/07/2017 - 09:50

బాహుబలి-2 చివరి ఈవెంట్ ఈరోజుతో ముగిసింది. లండన్‌లో జరిగిన భారీ ప్రోగ్రామ్‌తో ఐదేళ్లుగా సినిమాపై పెట్టుకున్న నమ్మకాలు, కష్టాలన్నీ ఈ కార్యక్రమంతో ముగించాడు దర్శకుడు రాజవౌళి. లండన్‌లో జరిగిన చివరి ప్రమోషన్‌తో ఇన్నాళ్లూ బాహుబలితో ఉన్న నా అనుబంధం ముగిసింది’ అని ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘మై జాబ్ ఈజ్ కంప్లీట్‌లీ ఓవర్’ అని ట్వీట్ చేసాడు.

05/06/2017 - 09:23

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాప్ ప్రధాన తారాగణంగా సివి కుమార్ దర్శకత్వంలో తమిళ భాషలో రూపొందించిన మాయావన్ చిత్రాన్ని ఎస్‌బికె ఫిలింస్ పతాకంపై తెలుగులో ‘పాజెక్టు -జెడ్’ పేరిట అనువదించారు. ఎస్‌కె బషీద్ సమర్పణలో రూపొందిన చిత్రం గూర్చి మాట్లాడుతూ ఆద్యంతం ఆసక్తి కలిగించే అంశాలతో ఉత్కంఠభరిత కథనంతో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నట్టు సమర్పకుడు ఎస్‌కె బషీద్ వివరించారు.

05/06/2017 - 09:21

రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానంభవతి వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో శర్వానంద్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు రూపొందించిన ‘రాధ’తో స్క్రీన్స్‌కు రాబోతున్నాడు.

05/06/2017 - 09:18

చిన్నా చితకా సినిమాలు చూడాలంటే ఇప్పుడు ప్రేక్షకులు మొహం చాటేస్తున్నారు. పాత సినిమాలు చూడటం ఎప్పుడో మర్చిపోయారు. నిరంతర ప్రేక్షకుడికి నిత్యం ఏదోక కొత్త సినిమా నైవేద్యం కావాల్సిందే. గత పదేళ్లుగా వారానికి ఒకటో రెండో సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. ప్రేక్షకుడు ఏదోక సినిమా చూసి సంతృప్తిపడుతూనే ఉన్నాడు. పాత సినిమాలు గతంలో మళ్లీ ప్రదర్శించేవారు.

05/04/2017 - 22:36

ప్రస్తుతం మూడు పాత్రలతో జైలవకుశ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ పవన్ సినిమాకు కమిట్ అయినందువల్ల వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. ఈలోగా జైలవకుశ లైన్‌లోకి వచ్చింది. మరోవైపు పవన్‌తో త్రివిక్రమ్ తీసే సినిమా స్పీడ్‌గా షూటింగ్ జరుపుకుంటోంది.

Pages