S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/10/2017 - 20:45

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్స్‌లోని సాంకేతిక నిపుణులు, నటీనటులకు ప్రభుత్వ సహకారంతో 5 లక్షల విలువచేసే హెల్త్ కార్డులు అందించారు. హెల్త్ కార్డులవల్ల ఆరోగ్య భద్రత మాత్రమే కాకుండా ఇతర సౌలభ్యాలూ కల్పిస్తున్నారు. హైస్కూలు స్థాయి పిల్లలకు స్కాలర్‌షిప్ కూడా వచ్చే ఏర్పాటు చేస్తున్నారు ప్రతాని రామకృష్ణగౌడ్.

05/09/2017 - 23:42

గ్లామర్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ లావణ్య త్రిపాఠి. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈమె తాజగా శర్వానంద్ సరసన హీరోయిన్‌గా రాధ సినిమాలో నటిస్తోంది. చంద్రమోహన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై భోగవల్లి బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదలకు రెడీ అయింది. ఈ సందర్భంగా అందాల భామ లావణ్య త్రిపాఠితో ఇంటర్వ్యూ...
* ఈ సినిమాలో రాధ ఎవరు?

05/09/2017 - 23:40

గురు సినిమాతో వైవిధ్యమైన పాత్రలకు, కథలకు తానెప్పుడూ సిద్ధమేనని చెప్పిన సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మరో ప్రయోగాత్మక చిత్రాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారని వినికిడి. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ నటించిన జాలీ ఎల్‌ఎల్‌బి-2 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ చేసిన లాయర్ పాత్రను తెలుగులో వెంకటేష్ చేస్తారని అంటున్నారు.

05/09/2017 - 23:38

ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై. లి. పతాకంపై రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ జంటగా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర అందిస్తున్న చిత్రం ‘అంధగాడు’. రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్, టీజర్‌లకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాత తెలియజేస్తున్నారు.

05/09/2017 - 23:36

గంటా రవి, మాళవికా మీనన్ జంటగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జయంత్ సి పరాన్జి దర్శకత్వంలో కె.అశోక్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘జయదేవ్’. ఈ చిత్రానికి సంబంధించిన మూడవ పాట విడుదల చేశారు.

05/09/2017 - 23:35

ఈ సినిమాలో ఆంజనేయస్వామి ఫొటో పెట్టడం వెనక అసలు కథ దాగి ఉంది.. ఆయన పాత్ర ఎంట్రీ ఇచ్చినపుడు ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు అని అంటున్నాడు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ. రక్షా, జక్కన్న సినిమాల తరువాత ఆయన దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రక్షకభటుడు’.

05/09/2017 - 23:33

చిరంజీవి 151వ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం చేయనున్న ఈ సినిమాని నిర్మాత రామ్‌చరణ్‌తేజ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించాలని భావిస్తున్నారు. అందుకే సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించడమే కాకుండా నటీనటుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చరణ్.

05/09/2017 - 23:32

‘నేను పుట్టింది విజయవాడలో. సిద్ధార్థ్ ఎడ్యుకేషనల్ అకాడెమీని ప్రారంభించింది మా తాతగారు. ఇప్పుడు ఇదే కాలేజీలో మాట్లాడే అవకాశం రావడం పిచ్చి హ్యాపీగా ఉంది’ అంటూ మురిసిపోయాడు శర్వా. వరస విజయాలతో జోరుమీదున్న శర్వానంద్, లావణ్య త్రిపాఠీతో చంద్రమోహన్ దర్శకత్వంలో ‘రాధ’ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బోగవల్లి బాపినీడు నిర్మిస్తున్న చిత్రమిది.

05/09/2017 - 23:31

ఉపేంద్ర, ప్రియమణి, తులసి ప్రధాన తారాగణంగా ఉదయరాజ్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ అందిస్తున్న చిత్రం ‘కల్పన-3’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో విడుదలైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కొణిజేటి రోశయ్య బిగ్ సీడీని విడుదలచేశారు.

05/09/2017 - 23:29

సంపూర్ణేష్‌బాబు హీరో, షకీల, గాయత్రి కీలక పాత్రల్లో నటించిన అమృత ప్రొడక్షన్స్, గుడ్ సినిమా గ్రూప్, సంజనా మూవీస్ తెరకెక్కిస్తున్న సినిమా కొబ్బరిమట్ట. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన ఈసినిమా త్వరలో విడుదలకు సిద్ధం అయింది. ఈసందర్భంగా మే 9న హీరో సంపూర్ణేష్‌బాబు పుట్టినరోజు వేడుక జరిగింది.

Pages