S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/04/2017 - 22:36

బాలీవుడ్ గ్లామర్ భామ పరిణితి చోప్రా చేసిన సినిమాలు తక్కువే అయినా, ఆమెపై వస్తున్న పుకార్లు, వార్తలతోనే క్రేజ్ పెంచుకుంది. మేరీ ప్యారీ బిందు సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఈమధ్య బాగా స్లిమ్ అయింది. ప్రస్తుతం ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌తో ఘాటు ప్రేమాయణం సాగిస్తోందని బాలీవుడ్ టాక్. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది.

05/04/2017 - 22:33

కంగనా రనౌత్ కథానాయిగా మరో చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు దర్శకుడు క్రిష్ నేతృత్వంలో ఝాన్సీ లక్ష్మీబాయి కథతో తెరకెక్కిస్తున్న చిత్రం మణికర్ణిక. ఈ చిత్రాన్ని వారణాసిలో సినిమా యూనిట్ ప్రారంభించింది. గంగా తీరంలో జన్మించిన లక్ష్మీబాయి కథనం కనుక అక్కడ ప్రారంభించడమే మంచిదని దర్శకుడు భావించడంతో గురువారం సాయంత్రం సినిమా షూటింగ్ ప్రారంభించారు.

05/04/2017 - 22:31

నారారోహిత్, శ్రీవిష్ణు గతంలో నటించిన అప్పట్లో ఒకడుండేవాడు విజయవంతమైన నేపథ్యంలో ఇద్దరూ కలిసి మరో చిత్రంలో నటిస్తున్నారు. బాబా క్రియేషన్స్ పతాకంపై ఇంద్రసేన.ఆర్. దర్శకత్వంలో అప్పారావు బెల్లన రూపొందిస్తున్న చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. ఈ చిత్రంలో శ్రీయా, సత్యదేవ్ మరో ప్రధానమైన పాత్రలు. చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

05/04/2017 - 22:30

ఎంఎస్‌జి హీరోగా రూపొందిస్తున్న ‘జట్టు ఇంజనీర్’ చిత్రానికి సంబంధించి ఓ పాట ముంబైలో విడుదలైంది. ఔట్ అండ్ ఔట్ కామెడీని తీసుకుని చిన్న సందేశంతో నిర్మిస్తోన్న చిత్రమిది. ఎలాంటి అశ్లీల సంభాషణలు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు చిత్ర బృందం చెబుతోంది.

05/04/2017 - 22:28

శతమానంభవతి చిత్రం అందించిన విజయంతో హీరో శర్వానంద్ స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. కొత్త కొత్త ప్రాజెక్టులు ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన చేసిన ‘రాధ’ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాడు. దీంతోపాటే స్టార్ డైరెక్టర్ దశరథ్ సినిమాకి కూడా శర్వానంద్ సైన్ చేసినట్టు సమాచారం.

05/04/2017 - 22:28

నిఖిల్ కథానాయకుడిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘కేశవ’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.

05/04/2017 - 22:26

శేఖర్‌వర్మ, దీప్తిశెట్టి జంటగా గాయత్రి ప్రొడక్షన్స్ పతాకంపై నరేశ్.పి దర్శకత్వంలో కె.ఎన్.రావు రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’. చిత్రానికి సంబంధించిన టీజర్ హైదరాబాద్‌లో విడుదల చేశారు.

05/04/2017 - 22:24

రాహుల్, మహిమా మక్వాన్ జంటగా గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై వేణు మాదికంటి దర్శకత్వంలో శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘వెంకటాపురం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది.

05/04/2017 - 22:24

లేటెస్టుగా నెక్స్ట్ ఏంటి అంటూ నేను లోకల్ సినిమాతో సందడి చేసిన నాని ఇప్పటికే ‘నిన్నుకోరి’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత ఆయన దిల్ రాజు నిర్మించే ఎంసిఏ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమా జూలైలో సెట్స్‌పైకి రానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా గ్లామర్ భామ సాయి పల్లవి నటిస్తుందట.

05/04/2017 - 22:23

మోహన్‌లాల్ కథానాయకుడిగా గతంలో విడుదలైన మనె్నం పులి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి తెలియజేశారు. డబ్బింగ్ సినిమా అయినా గొప్ప చిత్రం చూశామన్న అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందని, పెద్ద నోట్ల రద్దు సమయంలో విడుదలవడంతో అనుకున్నంత విజయం సాధించలేదని ఆయన తెలిపారు.

Pages