S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

06/25/2017 - 01:52

కారులోంచి కొడుకు వెనుక నించి దిగుతున్న ఇంగ్లీషు కోడలిని కళ్లప్పగించి చూస్తుండిపోయింది తాయారమ్మ. ఆమె చేతిలోని రెండేళ్ల పసివాడిని ఎత్తుకొని ముద్దాడింది. ‘నీ పేరేమిటిరా కన్నా!’ అని అడిగి ‘కాశీవిశ్వనాథం’ అని వాడు చెప్పగానే ముద్దులతో ముంచెత్తింది. మరి ఆవిడ భర్త పేరు అదే! ‘్ఫర్వాలేదు. నా కొడుక్కి తండ్రి గుర్తున్నాడు. మరి తల్లి? ఆరేళ్ల క్రితం మేనమామ కూతురు చంద్రకళని పెళ్లి చేసుకుంటే?

06/25/2017 - 01:51

సమాజాన్ని నిశితంగా పరికించే వ్యక్తి కవి అయితే అతని కలం నుంచి వచ్చే రచనలు ఉన్నతంగానే ఉంటాయి. కాగితాన్ని తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో నింపుతారు. కనుక వారి రచనల్లో అంతులేని ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఉత్తమ ఉపాధ్యాయునిగానే కాకుండా ఉత్తమ రచయితగా సమాజ హితం కోసం పాటుపడుతున్నవారు పిడుగు పాపిరెడ్డి గారు. నిరంతర సాహితీ సేవ చేస్తున్న ఆయన ఇటీవల వెలువరించిన కవితా సంపుటి ‘కాలం దోసిలిలో’ యాబది ఆరు కవితల హారం!

06/22/2017 - 22:22

నిండు పున్నమి. ఆకాశంలో చంద్రుడు పండువెనె్నల కురిపిస్తున్నాడు. చల్లని గాలి వీస్తోంది. అర్ధరాత్రి సమయం. సాగర ఘోష తప్ప పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. సముద్రం మీద వారధి నిర్మాణం కొంతవరకు జరిగింది. పగలంతా కష్టపడి వారధి నిర్మాణానికి పనిచేసిన వానరులు ఎక్కడబడితే అక్కడ నేల మీద పడుకొని అలసిసొలసి నిద్రిస్తున్నారు.

06/22/2017 - 22:18

మేఘాలను ముద్దాడే ఆకాశహర్మ్యానికైనా
మట్టిలో కట్టిన పునాదిపైనే మనుగడ
వేనవేల శాఖలుగా
విస్తరించిన వృక్షరాజానికైనా
నేలపొరల్లో పరుచుకున్న తల్లివేరే జీవనాడి
అమ్మ స్తన్యామృతం గ్రోలకుండా
ఆబగా తిన్న పిజ్జా.. బొజ్జకు చేటుచేస్తుంది
ఓనమాలు దిద్దాల్సిన చేతులు
ఆంగ్లంలో ఎంగిలి పడితే
ఆనవాలు లేకుండాపోతాయి సంస్కృతులు

06/22/2017 - 22:15

బొమ్మల పేరంటంలో ఆ వీధిలోని ముతె్తైదువులంతా కలిశారు.
‘మా చందన చదువు పూర్తయింది. ఇక పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. ఉద్యోగం చేయించాలా, వద్దా? అనే విషయం అత్తారు చూసుకుంటారు’ అంది ఆమె తల్లి.
మగపిల్లల తల్లులైన జయమ్మ, దుర్గమ్మ ఆవిడ దగ్గర చేరారు.
‘మా అబ్బాయి బెంగళూరులో ఇంజినీరు. 60 వేల రూపాయలు జీతం. జాతకం కలిస్తే చాలు. కట్నం అక్కరలేదు’ చెప్పింది జయమ్మ.

06/11/2017 - 02:06

రామారావు ప్రభుత్వ ఉద్యోగిగా రిటైరై ఐదేళ్లయింది. ప్రభుత్వ పింఛనుతో భార్య జానకి, కుమారుడు సురేష్‌తో కలిసి ఆయన కాలం వెళ్లదీస్తున్నాడు. విశ్రాంత ఉద్యోగి అయినా జీవికకు ఏదోఒక పనిచేయక తప్పదు. ఏదో పని కల్పించుకోక తప్పదు. తన ఏకైక పుత్రుడు సురేష్‌ను బాగానే చదివించినా వచ్చే ఉద్యోగాలన్నిటినీ కాలదన్నుతూ బాధ్యతా రాహిత్యంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాడు.

06/11/2017 - 02:05

విద్యార్థుల్లో దాగిన సృజనను వెలికితీయగలిగే సామర్థ్యమున్న గురువు లభిస్తే ఆ శిష్యుడు భావి సమాజానికి మార్గనిర్దేశనం చేయగలిగిన జ్ఞానుడు అవుతాడనటంలో అతిశయోక్తి లేదు. అలాంటి గురువులు ప్రాచీన కాలంలో ఎందరో శిష్యులను తయారుచేయటం వల్లే మనదేశ సంస్కృతి వేనోళ్ల కొనియాడబడుతోంది.

06/11/2017 - 02:04

ఓ కర్రి కోయిలమ్మ..

05/13/2017 - 23:36

‘దేవాలయం వీధి’ బోర్డు దగ్గరే రిక్షా ఆపేశాడు రిక్షావాలా. వాడితో గొడవెందుకని దిగి మా సందులో నడుస్తున్నాను. పదడుగులు నడవగానే పెద్దగా కేకలు. అందరూ ఇళ్ల బయటే నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇంకొద్ది దూరం నడవగానే అర్థమైంది. ఆ గొడవ మా అమ్మవాళ్ల ఇంట్లోంచేనని. నాకు సిగ్గుతో చచ్చినంత పనయింది. అక్కడే నిలబడిపోయి వదిన, అమ్మల గొడవను అందరితో పాటు వింటుండిపోయాను రేడియో నాటకంలా!

04/30/2017 - 03:17

ఉపాధ్యాయునిగా నాకిది ముప్ఫై మూడో సంవత్సరం. అందులో తెలుగు భాషా పండితునిగా నా విద్యార్థులకు తగిన తెలుగు పాఠాలతో పాటు, ఆయా సందర్భాలను బట్టి నీతికథలు, సూక్తులు చెబుతుంటాను. ఆరోజు నా పుట్టిన రోజని తెలిసిన నా సహోపాధ్యాయ బృందం శుభాభినందనలు తెలియజేయడం, అందుకు వారికి ధన్యవాదాలు చెప్పటం జరిగింది.

Pages