S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

08/20/2017 - 02:23

మటన్‌కొట్టు మస్తాన్ తన పదునైన కత్తితో దడదడా మాంసాన్ని కొట్టేస్తున్నాడు. అతగాడి పనితనాన్ని పరికిస్తూ తన తోకాడిస్తూ నాలుక బయటకు వదిలేస్తూ, కళ్ళప్పగిస్తూ చూస్తోంది కనకమనే శునకం. మస్తాన్ తనకు అవసరం లేని అడుగూ మడుగూ, దుమ్ము, వ్యర్థమూ దానికి పడవెయ్యడం, దాన్ని చకచకా నోట కరుచుకొని పారిపోవడం జరుగుతూ ఉంటాయి. అప్పుడు గట్టిగా పిక్కున్న కుక్కకే కక్క ముక్క చిక్కుతుంది.

08/20/2017 - 02:22

ఈ నగరానికి ఏమయ్యింది?
ఒకపక్క ఆధునికత పేరుతో పబ్బులు
మరోపక్క కూలగొడుతున్న
కట్టడాల మట్టికుప్పల దిబ్బలు!!

ఈ నగరానికి ఏమయ్యింది?
రెండు దశాబ్దాల క్రితం
నాయకుడి హత్యకు ప్రతీకారంగా
భవనాల తలల్ని నేలరాల్చి
ఇటుకల గూడుల్ని
గుట్టగా పోసేస్తే
మళ్లీ ఈ దేహం కొత్తందాలతో
మొలకెత్తినందుకు ఆనందించింది

08/20/2017 - 02:21

మహాత్ములు, మహర్షులు యుగానికొకరు జన్మిస్తే వారిని కారణజన్ములంటాం. అలాంటివారు ప్రపంచానికి ఆదర్శనీయులవుతారు. అలాంటి మహాత్ముల్లో మన దేశం గర్వించదగ్గ జాతీయ నేత డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ ఒకరు. సర్వజన హితైషి అయిన అంబేద్కర్ జీవన గమనంపై వచ్చిన మరో పుస్తకం ‘డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర’.

08/20/2017 - 02:20

మన ఆంధ్ర రాష్ట్రంలో ఎందరో నిస్వార్థ రాజకీయ నాయకులు ఉదయించారు. నిర్భీతి, నిజాయితీ, ధైర్య సాహసాలు కలిగిన అలాంటి నాయకుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు అగ్రగణ్యులు. ప్రకాశం గారు ప్రజల మనిషి. ‘ఆంధ్రకేసరి’ బిరుదుతో ఆయనను ప్రజలే సత్కరించుకున్నారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన బారిష్టరుగా పట్టా పొంది అపార ధనరాశులు సంపాదించారు. ఆ మొత్తాన్ని నిస్వార్థంగా ప్రజల కోసమే ఖర్చుచేశారు.

08/20/2017 - 02:19

జాతీయ స్థాయిలో గత తొమ్మిదేళ్లుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగు సాహితీ రంగంలో విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతిని చాటుకుంటున్నాయ ‘సోమేపల్లి సాహితీ పురస్కారాలు’.

08/13/2017 - 00:54

చాలామటుకు నా కోరికలు తీరిపోయాయి.

వాటికి అంతం లేదనుకోండి అది వేరే విషయం.

ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వాడిని. అదీ

సాధ్యమైంది. అన్నగారు ఒక్క కలం పోటుతో

కరణాల ఉద్యోగాలు పీకేసినా ఏదో సెలక్షన్

కమిటీ వారి దయ వల్ల మంచి ఉద్యోగమే

దొరికింది. కమ్యూనిస్టు నాయకుడు నారాయణ

గారిలా గాంధీ జయంతి రోజున మాంసం

దుకాణాలు బంద్ చేయాలనే రూలున్నా

08/13/2017 - 00:53

‘ఏడాదికోసారి ఈ తద్దినం అంటూ ఢిల్లీ నుంచి

గుంటూరుకు నన్ను పిలవటమేంటి? మన

కన్నతల్లి కూడా కాదు. నాన్న మేనల్లుడి చేత

ఆ కార్యక్రమం జరిపించవచ్చు కదా!’ విసుగ్గా

అన్నాడు రవి.
తమ్ముడి వంక ఆశ్చర్యంగా చూశాడు

రఘురాం.
‘అమ్మ చనిపోయేనాటికి నీకు ఏడు, నాకు

పదేళ్లు. నానమ్మ నాన్నకి మళ్లీ పెళ్లి

చేద్దామనుకుంటుంటే వచ్చిన అమ్మాయి

08/13/2017 - 00:52

తెలుగు కథ వర్తమానంలో కొత్త పుంతలు

తొక్కింది. గతంలో ఎప్పుడో వచ్చే సాదాసీదా

కవుల్ని, వస్తువుల్నుంచి విడివడింది.

సమకాలీన నవ్యత, నాణ్యత, పఠనీయత

సంతరించుకున్న రచనలు వస్తున్నాయి. అవి

1980వ దశకం నుంచే ప్రారంభమయ్యాయి.

అలాగని మూలాల్లోకి వెళ్లి గురజాడ, శ్రీపాద,

చింతా, బలివాడల బాటలు వీడలేదు. పదిలం

గా వాటి మూలాలు, మాండలికాల నేపథ్యాలు,

08/13/2017 - 00:51

గుర్తుతెచ్చుకో నేస్తం
ఆనాటి తెల్లరంగు జెండా
అహింసా మార్గమైంది
సత్యవాక్కై నిలచింది
తెల్లవారిని బెదిరించింది
మూడు రంగుల సోయగమై
పరాయి వారి కళ్లు చెదిరేలా
రాట్నం తిప్పింది
ముచ్చెమటల్లో ముంచెత్తింది
అశోకుని ధర్మచక్రం అద్దుకొని
శత్రువుల భరతం పట్టింది
గగనవీధిలో గర్వంగా
రెపరెపలాడింది
ఈనాటి రంగురంగుల జెండాలు

08/07/2017 - 00:26

వరంగల్ జిల్లాలో ఓ ఊరు. రెండు వేల గడప. సుమారు 10 వేల జనాభా. 8 వేల ఓటర్లు. ఆ ఊళ్లో చక్కని వరి పొలాలు. సంవత్సరానికి రెండు పంటలు పండుతాయి. పాఖల చెరువు నీరు పారకం. కమ్మ, రెడ్డి, కాపు, తెలగ, గౌడ, పద్మశాలీలు ఎక్కువగా ఉన్నారు. మరో పది కుటుంబాలు ముస్లింలు. ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో శివారు పల్లెలో దళితులు యాభై కుటుంబాల వారున్నారు. ఆ ఊరి పటేలు రమణారెడ్డి. ఆయనకు వంద ఎకరాల భూమి ఉంది. ఊరి బయట పెద్ద కొట్టం.

Pages