S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

04/30/2017 - 03:15

నిన్నటికి రేపటికి మధ్య ఇరుక్కుపోయిన
వర్తమానం యదార్థ ఉనికి కోసం
ఆరాటపడుతోంది!
పదార్థ ధర్మాన్ని నిరూపించటానికి
విజ్ఞానశాస్త్రం తపనతో తలకిందులౌతోంది
ఆధునిక పరిశోధనా ఆవిష్కరణలకు
శస్తచ్రికిత్స అవసరమని వైద్యశాస్త్రం
గ్రంథాలను తిరగరాయటానికి పూనుకుంది
గతమెంతో ఘనకీర్తి అంటూ కేసెట్ల
ఆవిష్కరణ ముమ్మరం అయింది
ఎక్కడ చూసినా ఉత్సవ ఏర్పాట్లే

04/30/2017 - 03:10

ఒకసారి శ్రీశ్రీని కొందరు ఇంటర్వ్యూ చేస్తూ ‘శ్రీశ్రీ మహాకవి అయితే కావచ్చు గానీ, ప్రజాకవి కాడని కొందరు విప్లవకారుల అభిప్రాయం. మీ వ్యాఖ్య?’ అని అడిగారు. దానికి శ్రీశ్రీ సమాధానమిస్తూ.. ‘ఏకీభవిస్తున్నాను. నేను అక్షరాస్యుల కవిని, చదువు రానివారి కవిని కాను. ప్రజాకవి కానివాడు మహాకవి కూడా కాలేడు’ అన్నారు. శ్రీశ్రీ మహాకవో, ప్రజాకవో, మరో కవో చెప్పాల్సింది శ్రీశ్రీ కాదు, కాలం!

04/25/2017 - 00:15

డాక్టర్ శ్రీరాం సాహితీ పురస్కార సభకు వెళ్లాడు ధర్మశాస్ర్తీ. తనకు తెలిసిన సాహితీమిత్రుడు శ్రీ ఉంగరాల వెంకట సూర్యారావు అందుకుంటున్నాడు ఆ పురస్కారాన్ని. చూద్దామని వెళ్లాడు శాస్ర్తీ ఓపిక లేకపోయినా. సభ బాగానే జరిగింది. చివరిదాకా ఉండి, పురస్కార గ్రహీతను అభినందించి, తన పుస్తకాలిచ్చి వస్తుంటే ‘ఏవండోయ్.. శాస్ర్తీగారూ! కులాసానా? మీకో బరువైన పని అప్పచెప్పాలనుకుంటున్నా. మీరే కనిపించారు.

04/16/2017 - 02:18

అమెరికా నుంచి వచ్చిన ఆనంద్ తల్లిదండ్రులను కూడా చూడకుండా సరాసరి స్నేహితుడు అరవింద్ ఇంటికి వచ్చాడు. బాల్కనీలో కూర్చుని ఎదురింటి వంక ఆశ్చర్యంగా చూశాడు. ‘ఇక్కడ డాబా వుండాలి కదా. ఆ పెద్దాయన ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టేడు? బిల్డర్‌కి కాని ఇచ్చాడా?’ అని అడిగాడు.

04/16/2017 - 02:12

మా ఊరికి వస్తూనే ఉంటాయి
ఆత్మబంధువులై
చలికాలం మంచుపూలు కురిసే
వెనె్నల వేళ
మా ఊరి చింతచెట్లపైకి
దేశదేశాలు దాటి
ఎతె్తైన కొండల వరుసలు దాటి
అలల శబ్దాల గంభీర
సముద్రాలు దాటి
పైనుంచి పైకి ఎదిగిన ఎతె్తైన
అడవుల శిరస్సుల పైనుంచి
వస్తూనే.. వస్తూనే ఉంటాయి
రెక్కల టపటపల శబ్దాలు చేస్తూనే
వరుస వరుసలుగా సైబీరియా విహంగాలై

04/16/2017 - 02:07

వెల : రూ. 100
ప్రతులకు : శ్రీలేఖ సాహితి,
27-14-53, మండల కార్యాలయం,
ఎదురు వీధి, హసన్‌పర్తి,
వరంగల్ - 506371.
*

04/11/2017 - 23:27

‘ఇప్పటికి మీ అబ్బాయితో తన్నులు తిని హాస్పట ల్ పాలైన పిల్లల సంఖ్య ఎనిమిది మంది. మేము మీకు ప్రతిసారీ కబురు పెట్టడం, మీరేమో ఇదంతా మామూలు విషయమన్నట్లు తోసిపారేసి వెళ్లడం పరిపాటి అయింది. మీవాడిని ఇంకా వెనకేసుకు రావడం మావల్లకాదు’.. అసహనంగా మరోసారి చెప్పాడు శ్రీనివాసు.

04/11/2017 - 23:22

కాలం, కాంతివేగాన్ని సవాలు చేస్తూ
కల్మష వర్ణాలనన్నింటిని పులుముకొని
దిశా రాహిత్యమనసుతో గమిస్తోంది
‘రుజ’ కౌగిలిలో నలిగిపోయిన ‘జర’
ముడుదల ద్విపటి కింద మూల్గుతోంది
భారంతో, తలదించిన కన్నప్రేమ రథం
వృద్ధాశ్రమం వైపుకి పరుగిడుతుంటే
హాస్యపు నయనాలు ఆనందిస్తున్నాయి
ఆప్యాయంతో అందించిన గోరుముద్దలు
వికటించి విషతుల్యమైపోయాయి

04/11/2017 - 23:18

జగతికి హోమియో వైద్యాన్ని ప్రసాదించిన క్రిస్టియన్ ఫెడ్రిక్ శామ్యూల్ హానిమన్ బహుభాషా కోవిదుడిగానూ ప్రఖ్యాతి చెందారు. 1755 ఏప్రిల్ 10న జర్మనీలోని మీసేన్ గ్రామంలో జన్మించారు. ఆయనది నిరుపేద కుటుంబం. నిరంతర కృషి, తన మేధా సంపత్తితో 20 సంవత్సరాల వయస్సు నాటికే హానిమన్ 8 భాషల్లో పాండిత్యం సంపాదించారు. ఎన్నో కష్టాలుపడి 1799లో వైద్యవిద్యను పూర్తిచేశారు.

04/02/2017 - 08:43

నేను చిన్నప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో ఐదో తరగతి చదివేటప్పుడు ఒక మాస్టారు ఉండేవారు. ఆయన పేరు కాంతారావు. ఆ స్కూల్ హెడ్‌మాస్టర్. ఆయన ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు. స్కూల్‌లో ఉన్నప్పుడు అసలు నవ్వేవారు కాదు. ఆయన్ని చూడగానే పిల్లలంతా హడలిపోయి ఆటలు ఆపేసి, పరుగెత్తుకుంటూ వచ్చి పుస్తకాల ముందు కూర్చునేవారు. ‘నాకు మీరంతా చదువుకుంటూనో, రాసుకుంటూనో కనబడాలి. ఖాళీగా కనబడ్డారంటే చీరేస్తాను’ అనేవాడు.

Pages