మెయిన్ ఫీచర్

శ్రమైక సౌందర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకు..నింగీ నేల నడుమ ఓ అద్భుత లోకం. ఆకాశాన్నంటే గిరులు..అబ్బురపరిచే లోయలు.. జలజలపారే జలపాతాలు.. అవిసె పూలతో నేలంతా పచ్చని తివాచీ పరిచినట్లు ఉండే ప్రకృతి రమణీయ దృశ్యకావ్యం..ఇలా ఎనె్నన్నో విశేషాలతో నిండిన పర్యాటకుల స్వర్గ్ధామం. ఆ స్వర్గ్ధామంలోకి అడుగుపెడితే చాలు కొండల్లోని గుబురు చెట్ల మధ్య నుంచి తలెత్తి పర్యాటకులను సంభ్రమాశ్చర్యాలతో చూసే అమాయకపు గిరిజన బిడ్డలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తారు. వారి చేతుల్లో నుంచి వచ్చే కాఫీ గింజలే నేడు దేశ విదేశాల్లో వేలాదిమంది కాఫీప్రియులు మనసు దోచుకుంటుంది. ఓ కప్పు కాఫీ చాలు అని అనిపించేలా ఈ గిరిజన బిడ్డలు పండిస్తున్న కాఫీ ఘుమఘమలు ఐరోపాలోని పారిస్ వాసుల ముక్కుపుటలను అదరగొడుతున్నాయి. ప్రేమికులకు నిలయమైన పారిస్‌లో అరకు కాఫీ ప్రేమలో పడిపోయామని అంటున్నారు. నాంది ఫౌండేషన్ వీరికి బాసటగా నిలిచి పారిస్, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో రిటైల్ విక్రయశాలలను ఏర్పాటు చేయటంతో విలాసవంతమైన, ఖరీదైన భారతీయ కాఫీ బ్రాండుగా అరకు కాఫీ ప్రపంచానికి పరిచయమైంది. నాంది సహకారంతో అరకు గిరిజన బిడ్డలు తమ భవితవ్యానికి నేడు బాటలు వేసుకోగలుగుతున్నారు. ఒకప్పుడు మురికి గుడ్డలతో పొద్దస్తమానం శ్రమించే గిరిజన యువకులు పట్టణ కుర్రాళ్లుగా జీన్స్ ఫ్యాంట్లు వేసుకుంటున్నారు. పసుపుపచ్చని పుస్తెలు, గవ్వలు వంటి వాటిని అలంకరించుకుని పేదరికానికి ఆనవాళ్లుగా కనిపించే గిరిజన మహిళలు నేడు బంగారు నగలు చేయించుకుని మురిసిపోతున్నారు.
‘నాంది’ సహకారంతో..
‘అరకు కాఫీ’ ఘుమఘుమలు ఎల్లలుదాటి ప్రపంచ ఖ్యాతి పొందటానికి నాంది ఫౌండేషన్ అందించిన చేయూత వారి జీవన విధానంలో పెను మార్పులకు దోహదం చేసింది. 1998లో ఏర్పాటైన ఈ స్వచ్ఛంద సంస్థ అక్కడి గిరిజనులకు అనేక విధాలుగా సాయం చేస్తోంది. అక్షరజ్ఞానం లేని అమాయకపు బిడ్డల నాలుకపై నేడు అక్షరాలు పలికిస్తోంది. పంట సాగులో మెళకువలను నేర్పుతుంది. సాగు పాఠాలు బోధిస్తోంది. సాగుకు సాంకేతికతను జోడించటంతో గిరిజనులు నేడు కాఫీ సాగుపట్ల మక్కువ చూపుతున్నారు.
కల్పవృక్షంగా మారిన కాఫీ సాగు..
పచ్చటి ప్రకృతి రమణీయత.. ఆహ్లాదకరమై చల్లటి వాతావరణంతో అలరారే విశాఖ మన్యం వాతావరణం కాఫీ సాగుకు అనుకూలంగా ఉండటం గిరిజనులకు ప్రకృతి ప్రసాదించిన వరంగా చెప్పవచ్చు. కాలం చెల్లిన పద్ధతుల్లో సాగుచేసే అధిక శాతం మంది గిరిజనులు నేడు నాంది ఫౌండేషన్ నిర్వాహకుల సలహాలు, సూచనలు పాటించి దిగుబడిని కూడా ఆశించిన రీతిలో సాధించగలుగుతుండడంతో కాఫీ సాగు గిరిజనుల పట్ల కల్పవృక్షంగా మారింది. ఒక ఎకరా భూమిలో కాఫీ సాగు చేపడితే ఏడాదికి సరాసరి లక్ష రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు.
ఈ కాఫీ కష్టంలో ఎక్కువ పాలుపంచుకునేది గిరిజన మహిళలే. వీరంతా నేడు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. నాంది సంస్థ తరచూ నిర్వహించే శిక్షణా తరగతుల్లో తర్ఫీదు పొందుతున్నారు. వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లు కాఫీ సాగుతో పాటు అంతర్ పంటగా మిరియాలు పసుపు, కందు లు వంటి పంటలను సైతం ఆధునిక పద్ధతుల్లో సాగుచేస్తున్నారు. అధిక దిగుబడులను సాధించేందుకు గిరిజనులు సేంద్రియ ఎరువులను వినియోగించటం విశేషం.
పండ్ల తోటల పెంపకంలోనూ సాయం..
నాంది ఫౌండేషన్ కాఫీ సాగుతో పాటు పండ్ల మొక్కల పెంపకంపై దృష్టిసారింపచేసింది. ఈ మేరకు మామిడి, కమల, జామ, సీతాఫలం తదితర ఫలసాయాలనిచ్చే మొక్కలను నాంది రైతులకు పంపిణీ చేస్తూ వీటి సాగును ప్రోత్సహిస్తోంది. నేడు విశాఖ ఏజెన్సీలోని అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, పెదబయలు, పాడేరు, హుకుంపేట మండలాలకు చెందిన గిరిజనలు ఓ సంఘంగా ఏర్పాటయ్యారు. 11 వేల 500 మంది సభ్యులుగా నమోదయ్యారు. దాదాపు 25 వేల కుటుంబాలు కాఫీ సాగుతో తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు. మరో 8వేల 500 మంది రైతులు పండ్ల మొక్కలను పెంచుతున్నట్టు తెలుస్తోంది. చిన్న, సన్నకారు గిరిజన కుటుంబాలు పరస్పర సహాయ సహకార సంఘం సభ్యులుగా చేరి ఏజెన్సీ వ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాల్లో కాఫీ పంట సాగును చేపడుతున్నారు.
కష్టార్జితం ఇష్టార్జితమైంది..
పాడేరు ఐటిడిఎ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాఫీ సాగుకు నాంది ఫౌండేషన్ తోడ్పాటునందిస్తుండడంతో ఈ ప్రాంతంలో సాగయ్యే కాఫీకి దేశ, విదేశాల్లో ఖ్యాతి లభించింది. వారి కష్టార్జితం నేడు ఇష్టార్జితంగా మారటానికి నాంది ఫౌండేషన్ మార్కెంటింగ్ సదుపాయాన్ని కల్పిస్తూ వారికి తోడుగా నిలుస్తోంది. గిరిజనులు కాఫీ గింజలను శుద్ధి చేసిన తరువాత వాటిని చిన్న, సన్నకారు గిరిజన రైతుల పరస్పర సహాయక సహకార సంఘం కొనుగోలు చేసి నాంది ప్రతినిధుల సహకారంతో విక్రయిస్తుంది. గత సంవత్సరం ఈ సంఘం ఆరు లక్షల కిలోల కాఫీ గింజలను సేకరించి దీనిని శుద్ధి చేయగా 90 వేల కిలోల నాణ్యమైన కాఫీ గింజలు వచ్చినట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. శుద్ధి చేసిన 90 వేల కిలోల కాఫీ గింజలలో 50 వేల కిలోల కాఫీని విక్రయించగా, మరో 40 టన్నుల కాఫీ గింజలను విక్రయించాల్సి ఉంది. శుద్ధిచేసిన నాణ్యమైన కాఫీ గింజలకు కిలో 240 నుంచి 300 వందల రూపాయల వరకూ ధర పలుకుతోంది. అయి తే కాఫీ సాగు చేపడుతున్న రైతుల్లో ఉత్తమ రైతులను ఎంపిక చేసి ప్రతీ సంవత్సరం వారిని నాంది ఫౌండేషన్ సత్కరించి ప్రోత్సాహకాలు అందిస్తుండడం విశేషం. ‘అరకు రత్నాలు’ పేరుతో అరకులోయ మండలం చినలబుడు పంచాయితీ తురాయిగుడ గ్రామంలో ప్రతీ సంవత్సరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు కాఫీలో నిష్ణాణితులైన దేశ విదేశీ న్యాయ నిర్ణేతలను ఆహ్వానిస్తున్నారు. నాంది చేస్తున్న ఈ కార్యక్రమంతో గిరిజనల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. గిరిజన ప్రాంతంలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు 2001వ సంవత్సరంలో మన్యంలో అడుగుపెట్టిన నాంది ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు పేరిట పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఆ తరువాత ఏజెన్సీలోని పేద గిరిజన రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన నాంది కాఫీ సాగుపై రైతుల దృష్టిని మరల్చి వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు తమ వంతు కృషి చేస్తోంది.
***
గత ఏడాది కాఫీపంట వల్ల వచ్చిన ఆదాయంతో పంగీ తన కుమార్తె రోసైరాణీకి స్కూటీని కొనిచ్చాడు. ఈ సంవత్సరం బంగారు గొలుసుచేయించాలనుకుంటున్నాడు.
****
టోకీ చక్కగా చదువుకోవటమే కాదు. డిగ్రీతో పాటు బి.ఇడి పూర్తిచేసింది. ఇలా ఆర్థికంగా అడుగులు ముందుకు వేస్తున్న అమాయకపు అడవి బిడ్డల ఆనంద వీచికలు ఇవి.

సొంతంగా బయోడైనమిక్ ఎరువు తయారీ..
గిరిజను లు పండించే ఈ కాఫీ గింజలు నేడు అంతర్జాతీ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా పోటీ పడుతున్నాయి. ‘బయో డైనమిక్’ సిస్టమ్‌ను అనుసరిస్తున్నారు. తమ ఇళ్ళ ముంగిట ఉండే ఖాళీ స్థలంలో బయో డైనమిక్ ఎరువులను సొంతంగా తయారు చేసుకుని వినియోగిస్తున్నారు. స్వచ్చమైన పశువుల పేడలో కోడిగుడ్ల పెంకులు, పొడిరాయి గుండతో పాటు ఇతరాత్ర పదార్థాలను మిళితం చేసి బయో డైనమిక్ ఎరువును మూడు నెలల కాల వ్యవధిలో తయారు చేస్తున్నారు. ఈ ఎరువు వాడకంతో కాఫీతో పాటు ఇతర పంటల దిగుబడి గణనీయంగా పెరుగుతోంది.

నాంది సహకారం మరువలేం: కిల్లో కొండలరావు, సహకార సంఘం అధ్యక్షుడు, తురాయిగుడ, ముకుంద్, కాఫీ రైతు, తురాయిగుడ
కాఫీ సాగులో నాంది ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిది. సాంకేతిక సలహాలను ఒకవైపు అందిస్తునే మరోవైపు ఆర్థికంగా సహాయ పడుతుండడం వలన మరింత ఉత్సాహంతో కాఫీ సాగు చేపడుతున్నాం. తాము పండిస్తున్న కాఫీకి ప్రస్తుతం లభిస్తున్న ధర కష్టానికి తగ్గట్టుగా లేదు. కాఫీకి గిట్టుబాటు ధర కల్పించేందుకు నాంది ఫౌండేషన్ ప్రతినిధులు సహకరించి తమ వంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాఫీకి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్న నాంది తాము అంతర్ పంటలుగా పండిస్తున్న మిరియాలు, మామి డి, జామ, సీతాఫలాలు, పనస వంటి ఫలసాయాలకు కూడా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దళారుల బెడద లేకుండా తాము పండించే పంటలను కాఫీ రైతులతో ఏర్పాటు చేసుకున్న సంఘం ద్వారా విక్రయిస్తుండడం కూడా తమకు ఎంతో లాభసాటిగా ఉంది. ఇందుకు నాంది ఫౌండేషన్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి (సిఇఒ) మనోజ్‌కుమార్‌తో పాటు వారి సిబ్బంది సహకరిస్తుండడం అభినందనీయం. రానున్న కాలంలో కూడా కాఫీ రైతుల సంక్షేమం కోసం మరిన్ని ఉపయోగకర కార్యక్రమాలను నాంది ఫౌండేషన్ చేపడుతుందని ఆశిస్తున్నాం.

- ఎల్బీ వెంకటేశ్వరరావు, అరకులోయ