భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి.హరికృష్ణ, కడప (ఆంధ్ర)
ప్ర:గురుదేవులకు నమస్కారం! మీరు ఉపదేశించిన విధంగా శివపంచాక్షరీ మహామంత్రము జపిస్తున్నా. సంపూర్ణ మనశ్శాంతి చేకూరింది. నన్ను ద్వేషించినవారు తమకు తాముగానే దూరమైనారు. అసూయాపరులకు శివుడే శిక్ష విధించాడు. నా వరకు ఏ సమస్యా లేదు. మా చెల్లెలుకు అత్తవారింటి సమస్యలున్నాయి. దానికి మార్గం ఉపదేశించండి.
సమా:ప్రతి మంగళవారము మీ చెల్లెలి చేత తొమ్మిది నిమ్మ పండ్లు ఎరుపు దారంతో దండగా కూర్చి ఎరుపు రంగు పూలతో గ్రామ దేవతను అర్చించి ఆమె మెడలో నిమ్మ పండ్ల దండ వేయించండి. జాంగ్రీ స్వీటు నివేదన చేసి పిల్లలకు పంచిపెట్టండి. 11 వారాలలో మార్పు కనిపిస్తుంది.
ఎమ్.సూర్యనారాయణమూర్తి- వీరవాసరం - (ప.గో)
ప్ర:అయ్యా! నమస్కారం! మీరు చెప్పిన ప్రకారమే నాకు మన్మథ నామ సంవత్సరంలోనే నా వివాహము జరిగినది. ప్రస్తుతం ఉద్యోగం గురించి చెప్పవలసినదిగా ప్రార్థన-
సమా:ఆగస్టు తరువాత ఆగ్నేయ దిశలో కాని తూర్పు - దక్షిణ దశల్లో కాని ఇన్సూరెన్స్- బాంకింగ్- బోధనా రంగాల్లో కాని ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
బి.వెంకటేశ్వరరెడ్డి, బేతంచర్ల, కర్నూలు
ప్ర:మా షాపు రెడీమేడ్ దుస్తుల షాపు సరిగా నడవటంలేదు. వ్యాపారం మార్చమంటారా?
సమా:వ్యాపారం మార్చకండి. స్కూల్ యూనిఫాం కాంట్రాక్టులు ప్రయత్నించండి. వాస్తు సరి చూసుకోండి.
ఎల్.గోవిందరాజులు, సోమందేపల్లి, అనంతపురం
ప్ర:గురువుగారూ! గతంలో మీరు నాకు ప్రభుత్వోద్యోగ యోగం ఉందన్నారు. దేవుని దయవలన మీ వాక్సుద్ధి ప్రభావంవలన గ్రూప్-2, గ్రూప్-3లలో ప్రాథమిక ఉత్తీర్ణత లభించింది. భవిష్యత్తులో రెండింటిలో దేనిలో నేను ఉద్యోగం పొందగలను.
సమా:గ్రూప్-2లోనే వచ్చే అవకాశం ఉంది. శుభం భవతు
ఎం.వెంకటశివరాం, తెనాలి, గుంటూరు
ప్ర:వివాహము- ఉద్యోగాభివృద్ధి ఎప్పుడు సంభవిస్తాయి?
సమా:వివాహాలస్యానికి భృగుదోషమూ, శనిదోషమూ కనిపిస్తున్నాయి. తగు నివారణ శాంతి జరిపించండి. ఉద్యోగంలో సెప్టెంబర్-అక్టోబర్‌లలో మంచి మార్పు రాగలదు.
మద్ది ఆంజనేయులు, సత్తెనపల్లి, గుంటూరు
ప్ర:చిరంజీవి చదువులో మందగమనం బాధిస్తోంది. పరిష్కారం చెప్పండి?
సమా:మీ చిరంజీవి పుట్టిన తేదీ ప్రకారం యోగం బాగానే ఉంది. ఆలస్యంగా పుంజుకుంటాడు. అదే మంచిది కూడాను. బాల్యంలో అసాధారణ ప్రజ్ఞావంతులకు ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది. వీలయితే మీ అబ్బాయిని బాసర సరస్వతీదేవి దర్శనం చేయించండి.
సి.చందన, ద్వారకాతిరుమల (ఆంధ్ర)
ప్ర:ద్వారకా తిరుమలలో బి.పి.సి గవర్నమెంట్ హాస్టల్- కొమ్ముగూడెంలోని ఎమ్.పి.సి శ్రీనివాస కాలేజీ- దేన్ని ఎంచుకోమంటారు?
సమా:ద్వారకా తిరుమలలో బై.పి.సి ఎన్నుకోండి. అభివృద్ధికి రాగలరు.
ఎమ్.వి.స్వామి, సీతారాంపురం (ప.గో.)
ప్ర:పేదరికం - కూతురు అనారోగ్యం- వివాహం సమస్యలకు పరిష్కారం ఏమిటి?
సమా:మీ అమ్మాయి జాతకం బాగానే ఉంది. అధైర్యపడకండి. మంచి భర్త దొరుకుతాడు- తులసీవ్రతమే చేస్తూ ఉండనివ్వండి. శుభం జరుగుతుంది.
వంకాయల రామలింగయ్య, హుజూర్‌నగర్ (తెలంగాణ)
ప్ర:ఆస్తి తగాదాలు ఎప్పుడు పరిష్కారం లభిస్తుంది?
సమా:కోర్టుకు వెళ్ళకుండా ఉంటే అక్టోబర్‌లో పరిష్కారమయ్యే అవకాశం. మీకు లాభసాటిగానే ఉంటుంది. కోర్టుకు వెళ్ళే పొరపాటు చేయకండి.
టి.సత్యవతి, విజయనగరం (ఆంధ్ర)
ప్ర:గురువుగారూ! నేను నా మనస్సును నమ్ముతాను. నాకు మనోబలం ఉంది. నా భర్తవలన మా యింట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. విఘ్నేశ్వర - ఓం- స్వస్తిక్- ఇవన్నీ ఒకటేనని నమ్ముతాను. నాలాంటి పరిస్థితి నా పిల్లలకు రాకూడదు. ఏం చేయమంటారు?
సమా:మానసికంగా మీరు చంచలంగా ఉన్నారు. స్వస్తిక్- ఓం- విఘ్నేశ్వర ఇవన్నీ వినాయక రూపాలే- అయితే ఏయే సందర్భాలలో అది పనిచేస్తుంది. ఎవరైనా సిద్ధ పురుషుని ద్వారా కాని ప్రసిద్ధి పీఠాధిపతి ద్వారా కాని లక్ష్మీగణపతి మంత్రోపదేశం పొంది- జపయోగం పాటించండి. శుభం జరుగుతుంది.
పావాడ గణపతిరావు, విజయనగరం (ఆంధ్ర)
ప్ర:నాకు అనారోగ్యంగా ఉన్నది. ఒక రోజు రాత్రి ఏదో అదృశ్యశక్తి నా వీపుమీద కొట్టింది. లేచి చూస్తే ఎవరూ లేరు. కారణమేమిటి?
సమా:మీ సమస్యకు రెండు కారణాలు- ఒకటి భౌతికం- అంటే శారీరకం. రెండవది- బౌద్ధికం. శారీరకంగా శరీరంలో మధుమేహ ప్రారంభంలో మన శరీరంలోని నరాలు వాటంతట వాటిగానే కదలిపోయి మనల్ని తట్టినట్లుగా భ్రమ కలిగిస్తుంది. ఒకసారి ఎవరో తోసేసినట్టుగానూ అనిపిస్తుంది. ‘షుగర్’ చెక్‌అప్ చేయించుకోండి. రెండవ కారణం- వశీకరణాది తాంత్రిక మంత్రాలు సాధన చేయటానికి ప్రయత్నిస్తే ఇటువంటి అనుభవం కలుగుతాయి. నివారణగా సుందరకాండ పారాయణం చెయ్యండి. వశీకరణాది తాంత్రికవిద్యల జోలికి పోకండి!
గాని సుభాష్‌గౌడ్, సరూర్‌నగర్ (హై)
ప్ర: మా నాన్న గారి పేరుతో వున్న ప్లాటు అమ్మకంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎప్పుడు అమ్మకం కాగలదు.?
సమా:ఆ ప్లాటుకు వాయవ్య దిశలో వాస్తుదోషం- ఆడవారి మూలకంగా అభ్యంతరాలు కనబడుతున్నాయి. వాటి నివారణ గురించి ఆలోచించండి.
సి.వెంకటేశులు, దోన్ (ద్రోణాచలం), కర్నూలు
ప్ర:వివాహ యోగం ఎప్పుడు?
సమా:ఈ సంవత్సరమే జరుగుతుంది. తూర్పు-ఆగ్నేయ దిశలనుండి రాగలదు. అక్షరము - వ - ప - క - న - హ అనే అక్షరములు.
సి.మేఘన, కామవరపుకోట (ఆంధ్ర)
ప్ర:నేను ఏ రంగంలో స్థిరపడతాను? భవిష్యత్తు ఏమిటి?
సమా:చక్కని గృహిణిగా స్థిరపడగలవు.
ఫణి చైతన్య, గోపువానిపాలెం (కృష్ణా)
ప్ర:సార్! నేను ఏ పరీక్ష వ్రాసినా కొంచెంలో తప్పిపోతోంది. మీరు చెప్పిన ప్రకారం అమెరికా ప్రయాణం సిద్ధించింది కాని ఉండలేకపోయాను. దయచేసి మీ సెల్ నెంబర్ చెప్పండి. వ్యక్తిగతంగా కలవాలని కుతూహల పడుతున్నాను.
సమా:మీలో సమర్థత ఉంది. ఏకాగ్రత, ఏక లక్ష్యం లేదు. ఒక లక్ష్యంమీద మనసు పెట్టండి. కలవాలనుకుంటే 9246171342 /9959211342లో మాట్లాడండి.
పాలవల్లి అయ్యపురెడ్డి, కావలి (నెల్లూరు)
ప్ర:నాకు స్వగృహయోగం చెప్పినారు- మా స్వగ్రామమా? కావలిలోనా?
సమా:మీరు మీ స్వగ్రామం పేరు వ్రాయలేదు. కావలి మాత్రం కాదు.
బి.ఎన్.రెడ్డి, ప్రగతినగర్, హైదరాబాద్
ప్ర:జాయింట్‌లో కొన్న పొలము ఎపుడు అమ్మకము కాగలదు.?
సమా:జాయింట్‌గా ఏకాభిప్రాయం కనబడుటలేదు.
ఏదో ఒక వైపు అన్నదమ్ముల వరుస అభ్యంతరం కనిపిస్తున్నది. చాలా ఆలస్యం- వివాదాస్పదం.
వి.వి.శర్వాణి, ఒంగోలు (ప్రకాశం)
ప్ర:నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది. వైవాహిక జీవితం ఎప్పుడు కుదుటపడుతుంది?
సమా:రెండూ పరస్పర సంబంధంగా ఉన్నాయి. ఇంకా ఆలస్యం అవుతుంది. శనివార వేంకటేశ్వర వ్రతం చేయండి!
టి.ఆదినారాయణ- వెంకటగిరిగుట్ట (కృష్ణా)
ప్ర:వ్యాపార స్థలం కొంత మారింది. పైన అంతస్తు వేసి- ఇదే వ్యాపారం కొనసాగించమంటారా?
సమా:అదే వ్యాపారం కొనసాగించండి. వ్యాపార స్థలంలో పణ్యహోమం చేయించండి.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
ఖ్ఘౄఔ్ఘఆ్దజఒ్ద్ఘ్ఘౄబక్ఘౄజ.ష్యౄ

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ