రివ్యూ

కాలానికి అతీతంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * రాబ్తా
*
తారాగణం: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్, జిమ్ షర్బ్ తదితరులు
సంగీతం: ప్రీతం చక్రవర్తి
నిర్మాత: దినేష్ విజన్, హోమీ అదాజానియా, భూషణ్‌కుమార్
దర్శకత్వం: దినేష్ విజన్
*
అమ్మాయి ఓ ఫైర్‌క్రాకర్. అబ్బాయి ఓ లేడీ కిల్లర్. వీరిద్దరి లవ్‌స్టోరీ -ఒకరి ఆలోచన మరొకరికి రాకూడదన్న రూలేం లేదు. ఐతే- మరొకరికి ఆ ఆలోచన వచ్చిందన్న విషయం తెలిస్తే ఫర్వాలేదు. సౌలభ్యత ఉంటుంది. మార్పులూ చేర్పులూ చేసుకోవచ్చు. తెలియకపోతే.. కథ నేలవిడిచి సాము చేస్తుంది. ఇక్కడ ఏం జరిగిందో తెలీదుగానీ.. మొత్తానికి ‘కథ’ కోర్టు మెట్లెక్కింది. మూలం గురించి ఇక్కడ ప్రస్తావించుకోకండా.. 800 ఏళ్ల వెనక్కి వెళ్దాం. థోత్రాకీలకూ - మురాకీలకూ మధ్య యుద్ధం. ఏ సన్నివేశాన్ని కాపీ కొట్టాం.. ఆ కథకీ ఈ కథకీ పోలిక ఎక్కడ? టెల్ మీ - అంటూ దర్శకుడు ‘వార్’ ప్రకటించి ఉండవచ్చు. ఇదంతా తెర వెనుక కథ.. అయినప్పటికీ - వీటన్నింటినీ దాటుకొని ‘రాబ్తా’ థియేటర్‌లోకి వచ్చింది.
కథ - శివ (రాజ్‌పుత్) తనకి తానే లేడీ కిల్లర్‌ని అని చెప్పుకుంటూంటాడు. సైరా (సనన్) తనకి తాను ‘అద్దం’లో మాట్లాడుకుంటూంది. ఆమె కలల్లో రెండు తెగల మధ్య యుద్ధం తాలూకు నీలినీడలు వెంటాడుతుంటాయి. రాజ్యం కోసం కొట్టుకునే ఇద్దరు యువకులు. ఒకవైపు తను ఇష్టపడే ప్రియుడు. మరోవైపు శత్రువు. ఎవరిని ఎంచుకోవాలన్న సందిగ్ధత సైరాని కలచి వేస్తుంది. ఆమె ప్రపంచాన్ని వీరిద్దరూ ఆక్రమించేస్తారు. వర్తమానానికి వస్తే.. శివతో పరిచయం ప్రేమగా మారుతుంది. మన పరిచయం రెండు రోజులదే అని శివ అంటే.. లేదూ! నీతో సూర్యోదయాన్ని అనుభూతి చెందాను. సుదూర తీరాలకు వెళ్ళాను. వెనె్నల్లో భోజనం చేశాను అని సైరా అంటుంది. అదేమో తెలీదుగానీ.. ‘నాకు ఎకనామిక్స్ మేటర్స్.. బాగా తెలుసు’ అంటాడు శివ. ఇలా వాళ్లిద్దరి ‘కెమిస్ట్రీ’ 800 ఏళ్లు వెనక్కి.. మళ్లీ వర్తమానానికి పయనిస్తూంటుంది. ఇంతకు మించి కథ చెప్తే- ఇట్టే పసిగట్టేసి.. ఆహో ఓహో అనేస్తారు. కాబట్టి - వౌనం.
కథాపరంగా- 800 ఏళ్ల నాటిది కనుక.. తెగల మధ్య యుద్ధం కాబట్టి.. అంతగా లాజిక్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. కానీ- ఆ తెగల వేషధారణ.. సన్నివేశాలన్నీ ప్రేక్షకుల్తో ‘కనెక్ట్’ కాకపోవటం.. చెప్పాల్సిన అంశం పక్కదారి పడుతున్నట్టుగా.. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఏదో నిర్ణయించుకోవటంలో ప్రేక్షకులు కూడా అక్కడక్కడ తికమక పడటంతో -కథ ఆసాంతం అర్థంకాదు. ఈ ప్రేమ కథకి ఎనె్నన్నో అవరోధాలు. కాకపోతే - ముద్దుల పరంపర మధ్య కథ అనే పదార్థాన్ని అంతగా పట్టించుకోం.
ఇటు ఫాంటసీ కాదు.. అటు జానపదం కాదు... ‘పునర్జన్మ’ అందామా? అంటే.. అక్కడి రాజకీయం ‘కనెక్ట్’ కాదు. ఇలా అనేకానేక అవరోధాలతో ‘రాబ్తా’ రెంటికి చెడ్డ రేవడి అయింది. ‘ప్రేమ’ సన్నివేశాలు సైతం ఫీల్‌ని కలిగించలేదు.
రాజ్‌పుత్ మంచి నటుడే. కానీ.. అతని ముఖంలో ‘నటన ప్లస్ నవ్వు’ ఏదో తెచ్చిపెట్టుకున్నట్టు.. ఒకే మూసలో ఉండి.. సినిమా సినిమాకీ విభిన్నత లేకపోవటంతో బోర్ కొడుతుంది. కృతి సనన్ మరీ బక్కపలచగా.. జీరో సైజ్ ఉండటాన్ని జీర్ణించుకోలేం. దానికి తగ్గట్టు.. భారీ డైలాగ్‌ల విషయానికి వస్తే.. పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెత సరిపోదు. ఆయా మాటల్ని వింటూంటే.. ఆమె పట్ల సింపతీ పెరిగిపోతుంది.
గత జన్మకి సంబంధించిన సన్నివేశాల్లో సగం సన్నివేశాల్ని ‘ఎడిట్’ చేసినా కథకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఆ జన్మ నుంచీ.. 800 ఏళ్లు ప్రయాణించి -ఈ జన్మలోకి వచ్చేప్పటికి.. ‘ట్రావెలింగ్’లోనే ఫీల్ మిస్సయింది. ఇలా చెప్పుకుంటూ పోతే- ఎన్నో.
స్క్రిప్ట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సంగీతం సన్నివేశ పరంగా బాగుంది. సుశాంత్ - కృతి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.

-బిఎనే్క